Viral Vide: మీకేం పోయేకాలం సామీ.. ఆరోగ్యంగా తినాల్సిన యాపిల్ పండ్లను ఇతను ఏం చేశాడో చూస్తే..!
ABN , Publish Date - Jan 29 , 2024 | 05:27 PM
ఎంతో ఆరోగ్యకరమైన యాపిల్ పండుతో ఇతను చేసిన ప్రయోగం చూస్తే పక్కాగా కోపం తన్నుకొస్తుంది.
యాపిల్ పండ్లు ఆరోగ్యానికి చాలామంచివి. ప్రతిరోజూ ఓ యాపిల్ పండు తింటూంటే డాక్టర్ అవసరమే ఉండదని, ఆరోగ్యం అంత దృఢంగా ఉంటుందని అంటారు. కానీ ఇతను మాత్రం యాపిల్ ను ఎంతలా చెడగొట్టాలో అంతా చెడగొట్టాడు. హెల్తీ ఫుడ్ అయిన యాపిల్ లో ఏకంగా ఆమ్లెట్ వేసి ఫుడ్ లవర్స్ కు సైతం పెద్ద షాకిస్తున్నాడు. ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్న ఈ యాపిల్ ఆమ్లెట్ గురించి తెలుసుకుంటే..
యాపిల్, గుడ్లు రెండూ ఆరోగ్యానికి చాలా మంచివి. రెండింటిని విడివిడిగా తింటే వెలకట్టలేని ఆరోగ్యప్రయోజనాలుంటాయి. కానీ రెండింటి ప్రయోజనాలు ఒక్కసారికే కడుపులోకి వెళ్లాలని అనుకున్నాడో ఏమో కానీ ఓ వీధి వ్యాపారి కొత్త ప్రయోగం చేశాడు. వీడియోలో వీధి వ్యాపారి తాను యాపిల్ తో ఆమ్లెట్ వేస్తానని చెబుతాడు. యాపిల్ ను సన్నని ముక్కలుగా కట్ చేసి ఒక ప్లేట్ లో ఉంచుతాడు. ఒక బౌల్ లో గుడ్లు పగలగొట్టి అందులో ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కొత్తిమీర, టమోటా, మిర్చి పౌడర్, ఉప్పు, ఆమ్లెట్ కోసం వారు తయారుచేసుకున్న ప్రత్యేక మసాలా వేసి బాగా మిక్స్ చేస్తాడు. స్టవ్ మీద పాన్ ఉంచి అందులో వెన్న వేసి తయారు చేసి ఉంచుకున్న గుడ్ల మిశ్రమాన్ని అందులో ఆమ్లెట్ లా పోస్తాడు. ఆమ్లెట్ మిశ్రమం ఇంకా ద్రవంగా ఉండగానే దానిమీద యాపిల్ ముక్కలను పరుస్తాడు. ఇది బాగా వేగిన తరువాత దానిమీద తందూరీ మయోనైస్, కొత్తిమీర తో గార్నిష్ చేశాడు. ప్లేట్ లో యాపిల్ ముక్కలు, గ్రీన్ చెట్నీతో సర్వ్ చేశాడు. (street vendor make omelet with apple)
ఇది కూడా చదవండి: Viral Video: ఇదీ ఫ్యామిలీ వర్క్ కు దక్కే ఫలితం.. ఏనుగు పిల్ల బురదలో పడిపోతే ఏనుగులన్నీ ఏం చేశాయో మీరే చూడండి..!
ఈ వీడియోను etloindiaa అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ నుండి షేర్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. ఆరోగ్యంగా తినాల్సిన యాపిల్ ను చండాలం చేశారంటూ విరుచుకుపడుతున్నారు. 'ఇతనికి గుడ్లు సప్లై చెయ్యడం ఆపండి ' అంటూ ఒకరు కామెంట్ చేశారు. 'బాబోయ్ నేను ఇలాంటివి అసలు ప్రయత్నించను, తినను' అని మరొకరు స్పందించారు. 'వెరైటీ పేరుతో ఫుడ్ లవర్స్ ను ఫూల్ చేస్తున్నారు' అంటూ ఇంకొకరు స్పందించారు.
ఇది కూడా చదవండి: బాబోయ్.. ప్రపంచంలోని టాప్ 10 ధనవంతుల విద్యార్హతలు ఇవా..!
మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.