Share News

Viral Video: బాబోయ్ ఇదేం సరదా నాయనా? ఊయల ఊగడానికి ఈ కుర్రవాళ్లు ఏం చేశారో చూస్తే..!

ABN , Publish Date - May 22 , 2024 | 03:49 PM

ఊయల ఊగడం అందరికీ ఇష్టమే. ఎక్కడైనా ఊయల కనిపిస్తే చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఊగేందుకు సిద్దమవుతారు. ఈ కుర్రాళ్ల రూటు మాత్రం సపరేటు. వీళ్లు ఊయల ఊగడానికి చేసిన ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Viral Video: బాబోయ్ ఇదేం సరదా నాయనా? ఊయల ఊగడానికి ఈ కుర్రవాళ్లు ఏం  చేశారో చూస్తే..!

ఊయల ఊగడం అందరికీ ఇష్టమే. ఎక్కడైనా ఊయల కనిపిస్తే చిన్నా పెద్దా తేడా లేకుండా అందరూ ఊగేందుకు సిద్దమవుతారు. సాధారణంగా బలమైన తాడును ఏ చెట్టు కొమ్మకో కట్టి ఊయల తయారుచేస్తారు. మరికొందరు ఇనుప గొలుసులతో ఊయల ఏర్పాటు చేసుకుంటారు. అయితే ఈ కుర్రాళ్ల రూటు మాత్రం సపరేటు. వీళ్లు ఊయల ఊగడానికి చేసిన ప్రయోగం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు షాకవుతున్నారు. ఇదేం సరదా నాయనా ప్రాణాలు పోగొట్టుకునే పనులు చేస్తున్నారేంటి ? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వీడియోకు సంబంధించి పూర్తీ వివరాల్లోకి వెళితే..

Viral Video: వాహ్! ఏమి తెలివి గురూ.. ఏసీని ఇతనెంత సింపుల్ గా తయారుచేశాడో చూస్తే అవాక్కవుతారు!



సోషల్ మీడియాలో ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. వీటిలో కొన్ని ఆశ్చర్యపరుస్తాయి. మరికొన్ని ఉపయోగకరంగా ఉంటాయి. ఇంకొన్ని మాత్రం పిచ్చిగా ఉంటాయి. ఇప్పటి కాలం యువత సరదా కోసం చేసే పిచ్చి చేష్టలు లెక్కలేనన్ని. ఈ వీడియో కూడా ఆ కోవలోనిదే. కుర్రవాళ్లు ఊయల ఊగాలనే సరదాను చాలా వినూత్నంగా ప్రయత్నించారు. రెండు కొబ్బరి చెట్లకు బలమైన తాళ్లు కట్టారు. ఒక బైక్ ను రెండు వైపులా కొబ్బరి చెట్లకు కట్టిన తాళ్లతో బంధించారు. ఇలా చేసిన తరువాత బైక్ రెండు కొబ్బరి చెట్లకు మధ్యలో ఊయల లాగా మారిపోయింది. వీడియోలో ఓ కుర్రాడు బైక్ మీద కూర్చుని బైక్ ను స్టార్ట్ చేశాడు. దీంతో ఆ బైక్ ఊయల లాగా ఊగడం మొదలు పెట్టింది. అది క్రమంగా వేగం పుంజుకుని ఎత్తుకు వెళుతుంది.

ఈ వీడియోను Snoopdogg అనే ఇన్స్టాగ్రామ్(Instagram) అకౌంట్ లో షేర్ చేశారు. ఇవన్నీ XYZ గేమ్స్ అనే క్యాప్షన్ మెన్షన్ చేశారు. ఈ వీడియో చూసిన నెటిజన్లు పలు విధాలుగా కామెంట్స్ చేస్తున్నారు.

జాగ్రత్త.. ఈ పోషకాలు లోపిస్తే బరువు పెరుగుతారట..!

బాదం బంక ఎప్పుడైనా తిన్నారా? వేసవిలో దీన్ని తింటే ఎన్ని లాభాలంటే..!

మరిన్ని ప్రత్యేక వార్తల కోసం.. ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - May 22 , 2024 | 03:49 PM