Share News

Viral: అయ్యో.. ఊబకాయంతో అనూహ్య సమస్య.. అంత్యక్రియల్లో జాప్యం!

ABN , Publish Date - May 07 , 2024 | 09:27 PM

బ్రిటన్‌లో అత్యంత భారీ కాయుడిగా పేరు గాంచిన జేసన్ హోల్టన్ (33) ఇటీవలే మరణించాడు. కానీ, అతడి భారీ కాయం చివరకు అంత్యక్రియలకు కూడా అడ్డంకిగా మారింది. అతడిని శ్మశానానికి తరలించే వాహనం దొరకక తల్లి ఇబ్బందుల పాలవుతోంది.

Viral: అయ్యో.. ఊబకాయంతో అనూహ్య సమస్య.. అంత్యక్రియల్లో జాప్యం!

ఇంటర్నెట్ డెస్క్: బ్రిటన్‌లో అత్యంత భారీ కాయుడిగా (Britain's Heaviest Man) పేరు గాంచిన జేసన్ హోల్టన్ (33) ఇటీవలే మరణించాడు. ఊబకాయం, గుండెపోటు కారణంగా అతడు కన్నుమూశాడు. కానీ, అతడి భారీ కాయం చివరకు అంత్యక్రియలకు కూడా అడ్డు పడుతోంది. అతడిని శ్మశానానికి తరలించేంతటి భారీ వాహనం అందుబాటులో లేక అతడి మాతృమూర్తి లీసా తీవ్ర ఆవేదనకు లోనవుతోంది.

స్థానిక మీడియాతో లీసా తన ఆవేదన పంచుకుంది. ‘‘అతడి బరువుకన్నా కూడా సైజే ప్రస్తుతం అడ్డంకిగా మారింది. జేసన్ పట్టేంత వాహనం ఏదీ ప్రస్తుతం అందుబాటులో లేదు. శశ్మానంలో అతడిని ఖననం చేసేందుకు ఇద్దరికి సరిపడా స్థలం కావాలి. ఇందుకు అవసరమయ్యేంత డబ్బు నా వద్ద లేదు’’ అని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది (Why Mother Of Britain’s Heaviest Man Is Struggling To Cremate Him).

Ayodhya: వామ్మో.. అయోధ్యలో భక్తులకు తిలకం దిద్దే బాలుడు ఈ రేంజ్‌లో సంపాదిస్తాడా!


2015లో తండ్రి మరణించాక జేసన్ ఊబకాయం బారినపడ్డాడు. తండ్రి పోయిన బాధలో అతడు అతిగా తినేందుకు అలవాటు పడ్డాడు. దాని పర్యవసానంగా ఊబకాయం వచ్చి పడింది. 2020లో ఓసారి మంచం మీంచి కింద పడ్డ అతడిని లేవనెత్తేందుకు ఏకంగా క్రేన్ సాయం అవసరమైంది. ఇటీవల గుండెసంబంధిత సమస్యతో అనారోగ్యం పాలైన అతడిని క్రేన్ సాయంతోనే కిందకు దింపాల్సి వచ్చింది.

జేసన్‌ అతిగా తినడాన్ని తాను నిరోధించలేకపోయాయని అతడి తల్లి వాపోయింది. తన తండ్రి బతికి ఉంటే తనకీ పరిస్థితి వచ్చేది కాదేమోనని జేసన్ ఒకానొక సందర్భంలో ఆవేదన వ్యక్తం చేశారు. అయితే, తన కొడుకుకు అన్ని లాంఛనాలతో వీడ్కోలు పలకలేననే భయం వెంటాడుతోందని లీసా మీడియా వారితో ఆవేదన వ్యక్తం చేసింది.

Read Viral and Telugu News

Updated Date - May 07 , 2024 | 09:34 PM