Share News

Viral Video: భర్తతో గొడవ పడి ఇలా చేస్తుందా.. ఛీ ఛీ చేసిన పనికి తిట్టి పోస్తున్న నెటిజన్లు..

ABN , Publish Date - Oct 19 , 2024 | 04:52 PM

భార్యా భర్తల మధ్య అప్పుడప్పుడు గొడవలు రావడం సర్వసాధారణం. ఇక్కడ కూడా అచ్చం అలాగే గొడవ జరిగింది. కానీ భర్తతో గొడవ పడి పిల్లలను ఇబ్బంది పెట్టిన దారుణ సంఘటన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అసలు ఏం జరిగిందనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.

Viral Video: భర్తతో గొడవ పడి ఇలా చేస్తుందా.. ఛీ ఛీ చేసిన పనికి తిట్టి పోస్తున్న నెటిజన్లు..
viral video

ఏ కుటుంబంలోనైనా భార్య, భర్తల మధ్య అప్పుడప్పుడు గొడవలు రావడం కామన్. ఆ తర్వాత ఎవరో ఒకరు తగ్గి క్షమాపణలు చెప్పుకుంటే తర్వాత ఫ్యామిలీ సర్వసాధారణంగా మారిపోతుంది. అయితే గొడవలు వచ్చినప్పుడు మాత్రం పిల్లలను మధ్యలోకి లాగొద్దని నిపుణులు చెబుతున్నారు. కానీ అచ్చం ఇలాంటి సంఘటనే ఇటివల చైనాలో చోటుచేసుకుంది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.


వీడియోలో

ఇక వీడియోను బట్టి చూస్తుంటే ఓ మహిళ తన భర్తతో గొడవ పడుతున్నట్లుగా అనిపిస్తుంది. ఆ క్రమంలో మహిళ భర్తను వేధించేందుకు తన 23వ అంతస్తులోని అపార్ట్‌మెంట్ బయట ఉన్న ఎయిర్ కండీషనర్‌పై వారి ఇద్దరు చిన్న పిల్లలను ప్రమాదకరంగా కూర్చొబెట్టింది. దీంతో భయాందోళన చెందిన చిన్నారులు ఏడవటం ప్రారంభించారు. ఆ క్రమంలో పిల్లలకు భద్రతా పరికరాలు కూడా లేవని భర్త పిల్లల దగ్గరకు వెళ్లేందుకు ప్రయత్నించగా ఆమె వెళ్లనీయలేదు. దీంతో పిల్లలు ఏడుపు, అరుపులు మరింత ఎక్కువయ్యాయి. ఆ క్రమంలో వారి ఏడుపులు విన్న ఇరుగుపొరుగు వారు ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. ఆ దృశ్యాలను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.


పోలీసులకు

అదే సమయంలో ఈ ఘటనపై అప్రమత్తమైన స్థానికులలో ఒకరు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని చిన్నారులను రక్షించారు. ఈ క్రమంలో ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు స్థానిక మహిళా, పిల్లల సంఘం అధికారులు తెలిపారు. మరోవైపు పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఆ మహిళకు శిక్ష పడుతుందా లేదా అన్న విషయంపై మాత్రం క్లారిటీ లేదు. దీంతోపాటు భార్యాభర్తల మధ్య గొడవకు కూడా ఇంకా కారణం తెలియరాలేదు.


కామెంట్స్ చుశారా..

ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇది చూసిన నెటిజన్లు అనేక విధాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఏ తల్లి తన పిల్లలను కాపాడుకోవాలి, కానీ ఆమె తన పిల్లలను ప్రమాదంలో పడేస్తుందని ఓ వ్యక్తి కామెంట్ చేశారు. అదే సమయంలో మరో వ్యక్తి ఆమె తల్లిగా ఉండటానికి అర్హురాలు కాదని అన్నారు. ఇంకో యూజర్ "ఇప్పుడు ఏదైనా సంఘటన జరిగి ఉంటే, అతని కంటే ఎవరూ బాధపడేవారు కాదని పేర్కొన్నారు. ఇంత పెద్ద నిర్ణయం ఎందుకు తీసుకున్నారు, కొంచెం శాంతించాలని మరో వ్యక్తి పేర్కొన్నారు. మీరు ఆయనతో జీవించడానికి ఇష్టపడకపోతే విడాకులు ఇవ్వండి, కానీ ఇలా పిల్లలు, భర్తను ఇబ్బంది పెట్టడం సరికాదని అంటున్నారు. అంతేకాదు మరికొంత మంది అయితే ఆమెను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి..

Viral Video: ఈగలకు తెలీకుండా తేనె చోరీ.. ఇతడి టెక్నిక్ ఏంటో తెలిస్తే.. నోరెళ్లబెడతారు..

Viral Video: ఓ వైపు టీచర్ పాఠాలు చెబుతుంటే.. మరోవైపు బ్యాక్ బెంచర్ నిర్వాకం మామూలుగా లేదుగా..

Viral Video: ప్రియుడితో ఉండగా సడన్‌గా తలుపు కొట్టిన తల్లి.. దొరక్కుండా ఉండేందుకు ప్రియుడిని ఏం చేసిందంటే..

Viral Video: భద్రత కోసం ఇంట్లో సీసీ కెమెరాలు పెట్టించాడు.. చివరకు భార్య నిర్వాకం చూసి ఖంగుతిన్నాడు..

Viral Video: వరుడి నిర్వాకానికి అవాక్కైన వధువు.. ఇష్టం లేకున్నా ఇబ్బంది పెట్టడంతో..

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Oct 19 , 2024 | 04:54 PM