Woman: విషాదంగా మారిన సరదా..!!
ABN , Publish Date - Jul 17 , 2024 | 06:49 PM
సరదా కోసం చేసిన పని విషాదం నింపింది. ప్రాంక్ చేద్దామని అనుకున్నారు. కానీ అది విషాదం నింపింది. మూడో అంతస్తు నుంచి పడి తీవ్రంగా గాయపడింది. తీవ్ర గాయాలతో ఆ మహిళ మృతిచెందింది. ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.
ముంబై: సరదా కోసం చేసిన పని విషాదం నింపింది. ప్రాంక్ చేద్దామని అనుకున్నారు. కానీ అది విషాదం నింపింది. మూడో అంతస్తు నుంచి పడి తీవ్రంగా గాయపడింది. తీవ్ర గాయాలతో ఆ మహిళ మృతిచెందింది. ఆ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది.
ఏం జరిగిందంటే..
ముంబై డోంబివాలిలో గల గ్లోబ్ స్టేట్ భవనంలో ఈ ఘటన మంగళవారం (నిన్న) జరిగింది. ఆ కాంప్లెక్స్‌లో నాగినా దేవి పని చేస్తున్నారు. క్లీనింగ్ విభాగంలో అక్కడ పనిచేసేది. తోటి సిబ్బందితో కలిసి జాలీగా ఉండేది. అదేవిధంగా నిన్న బంటీ అనే ఒకతను సరదా కోసం ఆట పట్టించాడు. మూడో అంతస్తు బాల్కనీ గోడపై నాగినా కూర్చొని ఉంది. నాగినిని ప్రాంక్ చేద్దాం అని బంటి అనుకున్నాడు. అక్కడ కూర్చొన్న ఆమెను నెట్టేస్తానని, ప్రాంక్ చేద్దామని అన్నాడు. అంతలోనే నాగినా దేవి పడిపోయింది. క్షణ కాలంలో అలా జరిగింది. అయినప్పటికీ ఆమెను పట్టుకునేందుకు బంటి ప్రయత్నించాడు. కానీ ఫలితం లేదు. నాగినా పడిపోయింది.
బయటపట్ట బంటి
బంటి కూడా పూర్తిగా వంగాడు.. తాను బ్యాలెన్స్ చేసుకొని లేచాడు. నాగినా దేవి చనిపోగా.. బంటి ప్రాణాలతో బయట పడ్డాడు. ఆ ఘటన సీసీటీవీలో కూడా రికార్డైంది. ఘటన జరిగిన వెంటనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేశారు. నాగినా దేవి కూతురు, కుమారుడు ఉన్నారు. తల్లి చనిపోవడంతో వారిద్దరూ బోరుమని విలపిస్తున్నారు. తల్లి చనిపోవడంతో వారికి పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఏదో సరదా కోసం చేసిన పని విషాదం నింపింది. అప్పటి వరకు తమతో ఉన్న నాగినా దేవి తిరిగిరానీ లోకాలకు వెళ్లిపోయింది. దాంతో సిబ్బంది, బంటి షాక్‌లో ఉన్నారు.
Read Latest Viral News and Telugu News