Viral: ఒక్క సంవత్సరంలో 48 కిలోలు మాయం.. స్పెషల్ సీక్రెట్ చెప్పిన బ్రిటన్ మహిళ!
ABN , Publish Date - Jul 27 , 2024 | 12:33 PM
బరువు తగ్గడం అంటే సాధరణమైన విషయం కాదు. ఎంతో పట్టుదల, అంకితభావం ఉంటే తప్ప బరువు తగ్గడం అందరికీ సాధ్యం కాదు. ఎంతో కఠినమైన వ్యాయామాలు, డైటింగ్ చేస్తేనే ఆరోగ్యకరంగా బరువు తగ్గడం వీలవుతుంది. ఎంత కష్టపడినా ఏడాదికి 20 కిలోలు తగ్గితే గొప్ప విషయం.
బరువు (Weight) తగ్గడం అంటే సాధరణమైన విషయం కాదు. ఎంతో పట్టుదల, అంకితభావం ఉంటే తప్ప బరువు (Weight Loss) తగ్గడం అందరికీ సాధ్యం కాదు. ఎంతో కఠినమైన వ్యాయామాలు (Exercise), డైటింగ్ (Dieting) చేస్తేనే ఆరోగ్యకరంగా బరువు తగ్గడం వీలవుతుంది. ఎంత కష్టపడినా ఏడాదికి 20 కిలోలు తగ్గితే గొప్ప విషయం. అలాంటిది ఇంగ్లండ్ (England)కు చెందిన ఓ మహిళ ఒక్క ఏడాదిలో 48 కిలోలు తగ్గింది. 115 కేజీల నుంచి 67 కిలోలకు వచ్చింది. తన వెయిట్ లాస్ వెనుకున్న సీక్రెట్‌ను ఆమె సోషల్ మీడియా ద్వారా బయటపెట్టింది (Viral News).
ఇంగ్లండ్‌కు చెందిన మిల్లీ స్లేటర్ అనే 20 ఏళ్ల యువతి వెయిట్ లాస్ జర్నీ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎక్కువ వాకింగ్, సమతుల ఆహారం తీసుకోవడం ద్వారా బరువు తగ్గినట్టు మిల్లీ వెల్లడించింది. వాకింగ్‌లో ఓ స్పెషల్ ఫార్ములాను ఆమె వెల్లడించింది. 12-3-30 ట్రెడ్‌మిల్ వర్కౌట్‌తో బరువు తగ్గినట్టు మిల్లీ వెల్లడించింది. ట్రెడ్‌మిల్‌పై 30 నిమిషాల పాటు గంటకు 3 మైళ్ల వేగంతో 12 శాతం గ్రేడ్‌లో నడవడం చాలా మేలు చేస్తుందట. ఇలా నడవడం వల్ల క్యాలరీలు ఎక్కువగా బర్న్ అవుతాయట.
12-3-30 వర్కవుట్ చేయడం ద్వారా 68 కిలోల బరువు ఉన్న వ్యక్తి కేవలం 30 నిమిషాల్లో దాదాపు 300 కేలరీలు బర్న్ చేయగలడని స్లేటర్ వెల్లడించింది. ఒక వ్యక్తిని ఫిట్‌గా ఉంచడానికి నడక సరిపోతుందని స్లేటర్ తెలిపింది. ఆహారం విషయంలో ప్రోటీన్ ఫుడ్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలని సూచించింది. ప్రతిరోజూ 10 వేల అడుగులు వేయాలనే నియమం పెట్టుకుంటే బరువు తగ్గడం పెద్ద కష్టం కాదని ఆమె పేర్కొంది.
ఇవి కూడా చదవండి..
మరిన్ని ప్రత్యేక వార్తలు కోసం క్లిక్ చేయండి..