Viral Video: ఇలాంటోళ్లతో రైళ్లల్లో ప్రయాణించడం నరకమే! మహిళ ఎంతకు తెగించిందో చూడండి!
ABN , Publish Date - Apr 19 , 2024 | 09:27 PM
టిక్కెట్టు లేకపోయినా రైలెక్కి రిజర్వేషన్ సీటులో కూర్చున్న అక్కడి నుంచి లేచి లేదంటూ మంకుపట్టు పట్టింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
ఇంటర్నెట్ డెస్క్: టిక్కెట్లు లేకపోయినా రైళ్లల్లో ప్రయాణిస్తూ రద్దీ పెరగడానికి కారణమయ్యే వారి వీడియోలు ఎన్నో చూశాం. దేశంలో సరిపడినన్ని రైళ్లు లేవు కాబట్టి ఇలాంటి ఘటనలు తప్పవని కొందరు అంటుంటారు. అయితే, రైల్లో టిక్కెట్టు లేకుండా ప్రయాణిస్తున్న ఓ మహిళ మరింత దారుణానికి పాల్పడింది. టిక్కెట్టు ఉన్న వ్యక్తి కోసం తన సీటు ఖాళీ చేసేది లేదంటూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా (Viral) మారింది.
Viral: శ్మశానంలో తండ్రి సమాధి అకస్మాత్తుగా అదృశ్యం.. ఏం జరిగిందో తెలిసి కూతురు కన్నీరుమున్నీరు!
వీడియోలో కనిపించిన దాని ప్రకారం, ఓ మహిళ టిక్కెట్టు లేకపోయినా ట్రెయిన్ ఎక్కింది. మరో వ్యక్తి పేరిట రిజర్వ్ అయిన సీటులో కూర్చుంది. అతడు వచ్చి ఆమెను లేవమన్నాడు. అది తన సీటు అని, రిజర్వ్ చేసుకున్నానని చెప్పాడు. అతడి మాటలు ఆమె అస్సలు లెక్క చేయలేదు. అది తన సీటు కాదంటూనే అక్కడి నుంచి లేచేది లేదంటూ ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. ‘‘మీరు టీటీఈ పిలవండి. ఆయన వచ్చినప్పుడు..టిక్కెట్ గురించి మాట్లాడతా. నేను ఎవరి మాట వినను. ఇక్కడ కూర్చున్నా. ఇక్కడే ఉంటా. మీరలా మాట్లాడుతూనే ఉండండి. కావాలంటే కంప్లెయింట్ చేసుకోండి’’ అంటూ రెచ్చిపోయింది (Woman without ticket refuses to vacate seat, argues with passengers Railways reacts).
మరోవైపు టిక్కెట్టు ఉన్న ఆ ప్రయాణికుడు మహిళ తీరును వీడియోలో రికార్డు చేశాడు. వీడియో నెట్టింట బాట పట్టడంతో తెగ వైరల్ అవుతోంది. వీడియోలోని మహిళను జనాలు దుమ్మెత్తిపోస్తున్నారు. ఆమెకు ఇలా చేయడం అలవాటులా ఉందంటూ మండిపడుతున్నారు.ఇలాంటోళ్లతో రైళ్లల్లో ప్రయాణాలు చేయడం కష్టమేనంటూ మరికొందరు వ్యాఖ్యానించారు. వీడియో వైరల్ కావడంతో రైల్వే శాఖ స్పందించింది. ఘటన ఏ ట్రైన్‌లో జరిగిందీ, టిక్కెట్ నెంబర్‌తో సహా నేరుగా మెసేజీ పెడితే తగు చర్యలు తీసుకుంటామని ట్విట్టర్ వేదికగా రిప్లై ఇచ్చింది.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి