Share News

Asia Cup 2024: మరోసారి భారత్, పాకిస్థాన్ మధ్య కీలక పోరు.. షెడ్యూల్ ప్రకటన

ABN , Publish Date - Oct 14 , 2024 | 03:21 PM

ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024 కోసం భారత్ తన 15 మంది సభ్యుల జట్టును ప్రకటించింది. ఈ జట్టుకు తిలక్ వర్మ నాయకత్వం వహిస్తుండగా, భారత్, పాకిస్థాన్ మ్యాచ్ తేదీని కూడా ప్రకటించారు.

Asia Cup 2024: మరోసారి భారత్, పాకిస్థాన్ మధ్య కీలక పోరు.. షెడ్యూల్ ప్రకటన
Asia Cup 2024 India vs Pakistan match

ఎమర్జింగ్ ఆసియా కప్ 2024 కోసం ఇండియా(team india) ఏ జట్టును భారత క్రికెట్ బోర్డు ప్రకటించింది. ఈ జట్టుకు తిలక్ వర్మకు నాయకత్వం వహించనున్నాడు. అంతేకాదు ఈ జట్టుతో ఆయనతోపాటు పలువురు యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. ఈసారి ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఒమన్‌లో టోర్నీని ఈ నిర్వహిస్తోంది. భారత జట్టు అక్టోబర్ 19 నుంచి తన ఆటను ప్రారంభించనుండగా, ఈ టోర్నమెంట్ అక్టోబర్ 18 నుంచి మొదలు కానుంది. అయితే ఈ టోర్నీలో మరోసారి భారత్‌-పాక్‌ల మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. ACC ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ టోర్నమెంట్ అక్టోబర్ 18 నుంచి 27 వరకు ఒమన్‌లో జరుగుతుంది.


కీలక పోరు

అంతేకాదు ఆసియా కప్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌లోనే పాకిస్థాన్‌ జట్టుతో తలపడనుంది. ఈ మ్యాచ్ అక్టోబర్ 19న జరగనుంది భారత జట్టు అక్టోబర్ 21న యూఏఈతో రెండో మ్యాచ్ ఆడనుంది. కాగా లీగ్ దశలోని చివరి మ్యాచ్‌ను ఆతిథ్య దేశం ఒమన్‌తో మెన్ ఇన్ బ్లూ ఆడాల్సి ఉంది. ఈ మ్యాచ్‌లన్నీ ఒమన్ క్రికెట్ అకాడమీలో జరుగుతాయి. మొదటి సెమీ ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 25న జరగనుండగా, రెండో సెమీఫైనల్ మ్యాచ్ కూడా అక్టోబర్ 25న జరుగుతుంది. ఫైనల్ మ్యాచ్ అక్టోబర్ 27న ఆదివారం జరగనుంది. శ్రీలంక, బంగ్లాదేశ్, ఆప్గానిస్థాన్ జట్లు కూడా ఈ టోర్నీలో పాల్గొంటాయి.


వీరికి ఛాన్స్

ఎమర్జింగ్ ఆసియా కప్ 2024 కోసం ఐపీఎల్ 2024లో అద్భుత ప్రదర్శన చేసిన ఆటగాళ్లకు ఎక్కువగా అవకాశం ఇచ్చారు. అభిషేక్ శర్మతో పాటు ఆయుష్ బదోని, ప్రభాసిమ్రన్ వంటి ఆటగాళ్లకు బోర్డు అవకాశం కల్పించింది. బంగ్లాదేశ్‌తో జరిగిన 3 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో కూడా అభిషేక్‌కు అవకాశం కల్పించారు. కానీ ఈ సిరీస్‌లో పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడలేకపోయాడు. అతనితో పాటు, ఢిల్లీ ప్రీమియర్ లీగ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన ఆయుష్ బడోని కూడా ఇండియా ఏ జట్టులో సభ్యులుగా ఉన్నారు.


ఆసియా కప్ 2024 కోసం భారత జట్టు

తిలక్ వర్మ (కెప్టెన్), అభిషేక్ శర్మ, ప్రభ్‌సిమ్రాన్ సింగ్, ఆయుష్ బదోని, నిషాంత్ సింధు, రమణదీప్ సింగ్, అనుజ్ రావత్, నెహాల్ వధేరా, అన్షుల్ కాంబోజ్, హృతిక్ షౌకీన్, వైభవ్ అరోరా, రసిఖ్ సలామ్, సాయి కిషోర్, రాహుల్ చాహర్,


ఇవి కూడా చదవండి:

Online Shopping Tips: పండుగల సీజన్‌లో ఆన్‌లైన్‌ షాపింగ్ చేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

SIP Investment: చిరు ఉద్యోగస్తులకు గుడ్‌ న్యూస్.. రూ.99 నుంచే మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు

IRCTC: నవరాత్రుల సందర్భంగా స్పెషల్ టూర్ ప్యాకేజీ.. తక్కువ ధరల్లో సందర్శించండి


Read More Sports News and Latest Telugu News

Updated Date - Oct 14 , 2024 | 03:23 PM