Sunil Narine: సునీల్ నరైన్ చారిత్రాత్మక రికార్డ్.. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే తొలిసారి
ABN , Publish Date - Apr 17 , 2024 | 04:22 PM
వెస్టిండీస్ మాజీ ఆటగాడు, కోల్‌కతా నైట్‌రైడర్స్ స్టార్ సునీల్ నరైన్ ఐపీఎల్‌లో సరికొత్త సంచలనానికి పునాది వేశాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కిన అతను.. ఐపీఎల్ చరిత్రలో ఎవ్వరికీ సాధ్యం కాని ఓ చారిత్రాత్మక రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.
వెస్టిండీస్ మాజీ ఆటగాడు, కోల్‌కతా నైట్‌రైడర్స్ (Kolkata Knight Riders) స్టార్ సునీల్ నరైన్ (Sunil Narine) ఐపీఎల్‌లో సరికొత్త సంచలనానికి పునాది వేశాడు. ఈడెన్ గార్డెన్స్ వేదికగా రాజస్థాన్ రాయల్స్‌తో (Rajasthan Royals) జరిగిన మ్యాచ్‌లో సెంచరీతో కదం తొక్కిన అతను.. ఐపీఎల్ చరిత్రలో ఎవ్వరికీ సాధ్యం కాని ఓ చారిత్రాత్మక రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. ఒక ఐపీఎల్ మ్యాచ్‌లో సెంచరీ చేయడం, క్యాచ్ పట్టడంతో పాటు వికెట్ (ఈ మ్యాచ్‌లో రెండు వికెట్లు తీశాడు) పడగొట్టిన తొలి ప్లేయర్‌గా చరిత్రపుటలకెక్కాడు. 17 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఈ ఘనతని ఎవ్వరూ సాధించలేరు. ఇదొక్కటే మరిన్ని.. మరికొన్ని రికార్డులను సైతం అతడు సొంతం చేసుకున్నాడు.
‘కోహ్లీ, ధోనీనే కాదు.. ఆ ఆటగాడు కూడా ఓ లెజెండ్’
ఆ రికార్డులు ఏంటంటే..
* ఐపీఎల్‌లో 100 వికెట్లు తీయడంతో పాటు సెంచరీ నమోదు చేసిన తొలి ఆటగాడిగా సునీల్ నరైన్ రికార్డులకెక్కాడు. రవీంద్ర జడేజా, ఆండ్రే రసెల్, అక్షర్ పటేల్, డ్వేన్ బ్రావో వంటి ఆల్‌రౌండర్లు 100 వికెట్లు పడగొట్టారు కానీ.. వారిలో ఏ ఒక్కరూ సెంచరీ చేయలేదు. కాగా.. నరైన్ ఇప్పటివరకూ ఐపీఎల్‌లో 170 వికెట్లు పడగొట్టాడు.
* ఐపీఎల్ చరిత్రలో ఐదు వికెట్ల హాల్‌తో పాటు సెంచరీ చేసిన మొదటి ప్లేయర్‌గానూ నరైన్ చరిత్ర సృష్టించాడు. 2012 ఐపీఎల్ సీజన్‍లో ఇదే ఈడెన్‌గార్డెన్స్‌లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‍పై నరైన్ 5 వికెట్లతో చెలరేగాడు. ఐదు వికెట్ల హాల్ కలిగిన ఆల్‌రౌండర్లు పలువురు ఉన్నారు కానీ, వారిలో ఎవ్వరూ సెంచరీ చేసిన దాఖలాలు లేవు.
* ఐపీఎల్‍లో హ్యాట్రిక్‍తో పాటు సెంచరీ సాధించిన మూడో ప్లేయర్‌గా నరైన్ నిలిచాడు. 2013 ఐపీఎల్ సీజన్‍లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‍పై హ్యాట్రిక్ తీసిన నరైన్.. ఇప్పుడు సెంచరీ చేయడంతో ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ జాబితాలో ముంబై ఇండియన్స్ స్టార్ రోహిత్ శర్మ, ఆస్ట్రేలియా దిగ్గజం షేన్ వాట్సన్ ఉన్నారు.
* టీ20 క్రికెట్‌లో సునీల్ నరైన్‌కు ఇదే మొదటి శతకం. అలాగే.. బ్రెండన్ మెక్‌కల్లమ్, వెంకటేశ్ ఐయ్యర్ తర్వాత సెంచరీ చేసిన మూడో కేకేఆర్ ఆటగాడిగా నరైన్ నిలిచాడు.
ఈసారి టైటిల్ ఆ జట్టుదే.. జోస్యం చెప్పిన రికీ పాంటింగ్
తాను చేసిన తొలి శతకంతో సునీల్ నరైన్ ఇన్ని రికార్డులు సాధించినప్పటికీ.. కేకేఆర్ జట్టు మాత్రం రాజస్థాన్ రాయల్స్ చేతిలో ఓటమిపాలైంది. దీంతో అతని సెంచరీ వృధా అయ్యింది. తొలుత బ్యాటింగ్ చేసిన కేకేఆర్ జట్టు.. నరైన్ (56 బంతుల్లో 109) చేసిన శతకం పుణ్యమా అని నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 223 పరుగులు చేసింది. అనంతరం 224 పరుగుల లక్ష్య ఛేదనలో భాగంగా.. జోస్ బట్లర్ (Jos Buttler) (60 బంతుల్లో 107 నాటౌట్) చేసిన వీరోచిత పోరాటం కారణంగా రాజస్థాన్ జట్టు విజయఢంకా మోగించింది. బట్లర్ చివర్లో సింపుల్‌గా సింగిల్ తీసి.. తన జట్టుని విజయతీరాలకు చేర్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి