Share News

Abhishek Sharma: అభిషేక్ శర్మ ఊర మాస్ బ్యాటింగ్.. టార్గెట్ చేసి మరీ చితకబాదాడు

ABN , Publish Date - Dec 31 , 2024 | 02:03 PM

Abhishek Sharma: టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ తన బ్యాట్ పవర్ ఏంటో మరోమారు చూపించాడు. ఊర మాస్ బ్యాటింగ్‌తో ప్రత్యర్థి జట్టును షేక్ చేశాడు. నెవర్ బిఫోర్ హిట్టింగ్‌తో బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు.

Abhishek Sharma: అభిషేక్ శర్మ ఊర మాస్ బ్యాటింగ్.. టార్గెట్ చేసి మరీ చితకబాదాడు
Abhishek Sharma

Punjab vs Saurashtra: టీమిండియా యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ బాదుడు ఎలా ఉంటుందో తెలిసిందే. క్రీజులోకి దిగింది మొదలు పెవిలియన్‌కు చేరే వరకు పిచ్చకొట్టుడే ధ్యేయంగా ఆడుతుంటాడు. డిఫెన్స్‌కు అవకాశం లేకుండా అటాకింగే మంత్రంగా బ్యాటింగ్ చేస్తుంటాడు. ఫెయిలైనా, సక్సెస్ అయినా అతడి ఫార్ములా మాత్రం హిట్టింగే. అందుకే కెప్టెన్స్ కూడా అతడికి ఫుల్ లైసెన్స్ ఇస్తుంటారు. చెలరేగి ఆడమని ప్రోత్సహిస్తుంటారు. అతడు ఐదారు ఓవర్లు క్రీజులో నిలబడినా మ్యాచ్ స్వరూపం మార్చేస్తాడని భరోసాతోనే హిట్టింగ్‌కు వెళ్లమని ఎంకరేజ్ చేస్తుంటారు. అది మరోమారు విజయవంతమైంది. భారీ సెంచరీతో జట్టు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని అతడు నిలబెట్టాడు. విధ్వంసక బ్యాటింగ్‌తో వన్డేను టీ20 మ్యాచ్‌లా మార్చేశాడు.


సిక్సుల వర్షం..

ఇంటర్నేషనల్ క్రికెట్‌లోనే అవతలి జట్లను మాస్ బ్యాటింగ్‌తో భయపెట్టే అభిషేక్ శర్మ.. డొమెస్టిక్ క్రికెట్‌లో ఇక ఏ రేంజ్‌లో రెచ్చిపోతాడో ఊహలకు కూడా అందదు. ఇవాళ అదే జరిగింది. విజయ్ హజారే ట్రోఫీలో బిగ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు అభిషేక్. సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో 96 బంతుల్లోనే 170 పరుగుల విధ్వంసక బ్యాటింగ్‌తో అలరించాడు. వచ్చిన బాల్‌ను వచ్చినట్లు బౌండరీకి తరలించడమే టార్గెట్‌గా పెట్టుకొని ఆడాడు. ఒక్కో బౌలర్‌ను లక్ష్యం చేసుకొని భారీ షాట్లు బాదాడు. అతడి ఇన్నింగ్స్‌లో 22 బౌండరీలు, 8 భారీ సిక్సులు ఉన్నాయి. ఫోర్లు, సిక్సుల ద్వారానే 136 పరుగులు రాబట్టడం విశేషం. అతడి స్ట్రైక్ రేట్ 177.80. దీన్ని బట్టే అభిషేక్ ఇన్నింగ్స్ ఏ విధంగా సాగిందో అర్థం చేసుకోవచ్చు.


ఇదేం బాదుడు సామి..

అభిషేక్ దెబ్బకు పంజాబ్ జట్టు 50 ఓవర్లలో ఏకంగా 424 పరుగులు చేసింది. అతడితో పాటు మరో ఓపెనర్ ప్రభుసిమ్రన్ సింగ్ (95 బంతుల్లో 125) కూడా సెంచరీతో చెలరేగాడు. ఆఖర్లో అన్మోల్ మల్హోత్రా (48 నాటౌట్), సన్వీర్ సింగ్ (29 బంతుల్లో 40 నాటౌట్) కూడా భారీ షాట్లతో దుమ్మురేపడంతో స్కోరు బోర్డు రాకెట్ స్పీడ్‌తో దూసుకుపోయింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన సౌరాష్ట్ర.. ప్రస్తుతం 6 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 54 పరుగులతో ఉంది. పంజాబ్ ఇన్నింగ్స్‌లో ప్రభుసిమ్రన్ సింగ్ సెంచరీ బాదినా అభిషేక్ శర్మ బ్లాస్టింగ్ నాక్ ముందు అది నిలబడలేదు. అతడి దెబ్బకు జయ్‌దేవ్ ఉనాద్కట్ 9 ఓవర్లలో 90 పరుగులు ఇచ్చుకున్నాడు. ఇతర బౌలర్లను కూడా పిచ్చకొట్టుడు కొట్టాడు. అతడి బాదుడు చూస్తుంటే టీమిండియాలోని మూడు ఫార్మాట్లలో పర్మినెంట్ బెర్త్ కోసం మరింత కసితో ఉన్నట్లే కనిపిస్తోంది.


Also Read:

‘అప్పుడే..నవతరం నాయకులు’

న్యూజిలాండ్‌దే సిరీస్‌

నిద్రలేని రాత్రులు.. కఠిన సవాళ్లు

For More Sports And Telugu News

Updated Date - Dec 31 , 2024 | 02:04 PM