Share News

IND vs ENG: ఇంగ్లండ్‌కు మరోసారి వీసా సమస్య.. కీలక ఆటగాడిని ఎయిర్‌పోర్టులోనే నిలిపివేత

ABN , Publish Date - Feb 13 , 2024 | 11:14 AM

ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు తరచుగా వీసా సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఆ జట్టు యువ స్పిన్నర్ షోయబ్ బషీర్‌కు వీసా సమస్య ఎదురైంది. తాజాగా మరో స్పిన్నర్ రెహాన్ అహ్మద్‌కు కూడా ఇదే సమస్య తలెత్తింది.

IND vs ENG: ఇంగ్లండ్‌కు మరోసారి వీసా సమస్య.. కీలక ఆటగాడిని ఎయిర్‌పోర్టులోనే నిలిపివేత

రాజ్‌కోట్: ప్రస్తుతం భారత పర్యటనలో ఉన్న ఇంగ్లండ్ క్రికెట్ జట్టుకు తరచుగా వీసా సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పటికే ఆ జట్టు యువ స్పిన్నర్ షోయబ్ బషీర్‌కు వీసా సమస్య ఎదురైంది. తాజాగా మరో స్పిన్నర్ రెహాన్ అహ్మద్‌కు కూడా ఇదే సమస్య తలెత్తింది. సరైన ధృవీకరణ పత్రాలు లేకపోవడంతో రెహాన్ అహ్మద్‌ను రాజ్‌కోట్ హిస్సోర్ విమానాశ్రయంలో అధికారులు అడ్డుకున్నారు. రెండో టెస్టు ముగిసిన అనంతరం మూడో టెస్టు మ్యాచ్ ప్రారంభంకావడానికి సమయం ఉండడంతో ఇంగ్లండ్ జట్టు దుబాయ్ వెళ్లింది. 15వ తేదీ నుంచి రాజ్‌కోట్ వేదికగా మూడో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. దీంతో ఇంగ్లండ్ జట్టు సోమవారం దుబాయ్ నుంచి నేరుగా రాజ్‌కోట్‌లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలోనే రెహాన్ అహ్మద్‌ను విమానాశ్రయం అధికారులు అడ్డుకున్నారు.


పలు నివేదికల ప్రకారం రెహాన్ అహ్మద్ సింగిల్ ఎట్రీ వీసాపై ఇండియాకు వచ్చాడు. ఈ నేపథ్యంలోనే దుబాయ్ వెళ్లి మళ్లీ ఇండియాకు వస్తోన్న రెహాన్ అహ్మద్‌ను అధికారులు అడ్డుకున్నారు. అయితే మూడో టెస్టు ప్రారంభానికి మరో 2 రోజుల సమయం మాత్రమే ఉంది. దీంతో రెహాన్ అహ్మద్‌కు అత్యవసర పరిస్థితి కింద స్థానిక అధికారులు 2 రోజుల వీసాను మంజూరు చేసినట్టు తెలుస్తోంది. అలాగే మరో రెండు రోజుల్లో వీసా సమస్యను పరిష్కరించాలని ఇంగ్లండ్ జట్టు మేనెజ్‌మెంట్‌కు అధికారులు సూచించినట్లు సమాచారం. కాగా ప్రస్తుతం ఇంగ్లండ్ జట్టులో రెమాన్ అహ్మద్ కీలక స్పిన్నర్‌గా ఉన్నాడు. అయితే దుబాయ్ నుంచి వచ్చిన ఇంగ్లండ్ జట్టులో రెహాన్ ఒక్కడికే ఈ సమస్య ఎదురైంది. మిగతా వారంతా తమ హోటల్ గదులకు చేరుకున్నారు. రెహాన్ కాస్త ఆలస్యంగా జట్టులో చేరాడు. ఇక భారత్, ఇంగ్లండ్ జట్ల ఈ నెల 15 నుంచి రాజ్‌కోట్ వేదికగా మూడో టెస్ట్ ప్రారంభంకానుంది. ఇప్పటికే ముగిసిన రెండు టెస్టుల్లో ఇరు జట్లు చెరొటి గెలిచాయి. దీంతో మూడో టెస్ట్ మ్యాచ్ కీలకంగా మారింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 13 , 2024 | 11:17 AM