Share News

IPL 2024: ఆర్సీబీ ఎలిమినేట్ అయ్యాక అనుష్క శర్మ రియాక్షన్ చూశారా.. పాపం!

ABN , Publish Date - May 23 , 2024 | 12:27 PM

తమది ఒక గొప్ప జోడీ అని విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ ఇప్పటికే ఎన్నోసార్లు చాటిచెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా.. ఒకరికొకరు అండగా ఉంటారు. ముఖ్యంగా.. తన భర్త కోహ్లీలో ఉత్తేజం నింపేందుకు...

IPL 2024: ఆర్సీబీ ఎలిమినేట్ అయ్యాక అనుష్క శర్మ రియాక్షన్ చూశారా.. పాపం!
Anushka Sharma Looks Upset

తమది ఒక గొప్ప జోడీ అని విరాట్ కోహ్లీ (Virat Kohli), అనుష్క శర్మ (Anushka Sharma) ఇప్పటికే ఎన్నోసార్లు చాటిచెప్పారు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా.. ఒకరికొకరు అండగా ఉంటారు. ముఖ్యంగా.. తన భర్త కోహ్లీలో ఉత్తేజం నింపేందుకు, స్ఫూర్తి పెంచేందుకు అనుష్క ఎల్లప్పుడై మైదానానికి వస్తుంటుంది. అది టీమిండియా కోసమైనా, ఆర్సీబీ (RCB) కోసమైనా.. తప్పకుండా గ్రౌండ్‌కి విచ్చేస్తుంది. బుధవారం రాజస్థాన్ రాయల్స్‌తో (Rajasthan Royals) జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్ సందర్భంగానూ ఆమె స్టాండ్స్‌లో కనిపించింది. ఇది కీలకమైన మ్యాచ్ కాబట్టి.. ఆర్సీబీకి, కోహ్లీకి మద్దతుగా మైదానానికి వచ్చింది.


Read Also: విమానంలో విచిత్రం.. సీటు లేకపోవడంతో ఏం జరిగిందంటే?

అయితే.. ఈ ఎమిలినేటర్ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓడిపోవడంతో అనుష్క చాలా నిరాశగా కనిపించింది. ఫైనల్స్‌కి ముందు ఎలిమినేట్ అవ్వడంతో తీవ్రంగా డిజప్పాయింట్ అయిన తన భర్త కోహ్లీని చూసి.. ఆమె నిరాశకు గురయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వీఐపీ బాక్స్‌లో నిలబడి.. తన స్నేహితులతో మ్యాచ్ ఫలితం గురించి అనుష్క చర్చించడం ఆ వీడియోలో మనం గమనించవచ్చు. ఎల్లప్పుడూ ఎంతో హుషారుగా కనిపించే ఆమె.. ఆ వీడియోలో మాత్రం కలత చెందుతూ కనిపించింది. దీన్ని బట్టి.. ఆర్సీబీ ఓటమి కోహ్లీని ఎంతలా కలచివేసిందో, అనుష్క సైతం అంతే బాధపడినట్లు మనం అర్థం చేసుకోవచ్చు.

Read Also: దినేశ్ కార్తిక్ రిటైర్‌మెంట్ ప్రకటించాడా.. అసలు నిజం ఏంటి?

ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన ఆర్సీబీ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 172 పరుగులు చేసింది. ఆర్సీబీ బ్యాటర్లలో ఏ ఒక్కరూ భారీ ఇన్నింగ్స్ ఆడలేదు. కోహ్లీ (33), రజత్ పాటిదార్ (34), లామ్రోర్ (32) మాత్రమే పర్వాలేదనిపించారు. లక్ష్య ఛేధనలో భాగంగా.. రాజస్థాన్ 19 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసి విజయఢంకా మోగించింది. ప్రత్యర్థి జట్టు బ్యాటర్లు కట్టడి చేసేందుకు ఆర్సీబీ బౌలర్లు చివరివరకూ పోరాడారు కానీ, చివరికి వారి కృషి నీరుగారిపోయింది. దీంతో.. ‘ఈసాలా కప్ నమ్డే’ కాస్త ‘నెక్ట్స్ సాలా కప్ నమ్డే’ అయ్యింది.

Read Latest Sports News and Telugu News

Updated Date - May 23 , 2024 | 12:27 PM