Hernan Fennell: బచ్చా బౌలర్ డబుల్ హ్యాట్రిక్.. తోపుల వల్ల కానిది సాధించాడు
ABN , Publish Date - Dec 17 , 2024 | 12:53 PM
Hernan Fennell: క్రికెట్‌లో హ్యాట్రిక్ తీయడమే అరుదైన ఘనతగా చూస్తారు. అలాంటిది ఓ పసికూన బౌలర్ ఏకంగా డబుల్ హ్యాట్రిక్ సాధించాడు. ఎవరా బౌలర్? అతడిది ఏ దేశం? అనేది ఇప్పుడు చూద్దాం..
Hernan Fennell: క్రికెట్‌లో హ్యాట్రిక్ తీయడాన్ని అరుదైన ఘనతగా చూస్తారు. ఒకప్పుడు బౌలింగ్ ఫ్రెండ్లీ వికెట్లు ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో హ్యాట్రిక్ అనేది పాజిబుల్ అయ్యేది. కానీ క్రమంగా బ్యాట్ హవా నడవడం మొదలైంది. ఫ్లాట్ పిచ్‌లు తయారు చేస్తుండటంతో వికెట్లు తీయడమే గగనంగా మారింది. ఎవరైనా హ్యాట్రిక్ తీస్తే వాళ్లను హీరోలుగా చూస్తున్నారు. అలాంటిది ఓ బచ్చా బౌలర్ ఏకంగా డబుల్ హ్యాట్రిక్ తీసి వారెవ్వా అనిపించాడు. ఎవరా బౌలర్ అనేది ఇప్పుడు చూద్దాం..
రెచ్చిపోయాడు
అర్జెంటీనా బౌలర్ హెర్నర్ ఫెన్నెల్ అరుదైన ఘనత సాధించాడు. డబుల్ హ్యాట్రిక్ వికెట్లు తీసి క్రికెట్ దునియాలో సంచలనంగా మారాడు. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్ కప్ సబ్ రీజనల్ అమెరికా క్వాలిఫయర్ టోర్నీలో భాగంగా కేమన్ ఐలాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఫెన్నెల్ ఈ ఫీట్ నమోదు చేశాడు. ఒకే ఓవర్‌లో వరుసగా 4 బంతుల్లో 4 వికెట్లు తీశాడు ఫెన్నెల్. ఆదివారం నాడు బ్యూనస్ ఎయిర్స్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో అతడు సూపర్బ్ బౌలింగ్‌తో రెచ్చిపోయాడు.
దిగ్గజాల సరసన..
క్రీజులోకి వచ్చిన బ్యాటర్‌ను వచ్చినట్లు పెవిలియన్‌కు పంపించాడు హెర్నర్ ఫెన్నెల్. మ్యాచ్‌లో ఆఖరి ఓవర్‌లో అతడు ఈ ఫీట్ నమోదు చేశాడు. ట్రాయ్ టేలర్, అలిస్టర్ ఇఫిల్, రొనాల్డ్ ఎబాంక్స్, అలెగ్జాండ్రో మోరిస్‌ను అతడు ఔట్ చేశాడు. మొత్తంగా అతడి స్పెల్ ముగిసేసరికి 14 పరుగులు ఇచ్చుకొని 5 వికెట్లు పడగొట్టాడు ఫెన్నెల్. జెంటిల్మన్ గేమ్‌లో వరుస బంతుల్లో 4 వికెట్లు తీస్తే డబుల్ హ్యాట్రిక్‌గా పరిగణిస్తారు. అలా నాలుగు బంతుల్లో నాలుగు వికెట్లు తీసిన బౌలర్ల జాబితాను చూసుకుంటే.. రషీద్ ఖాన్ టాప్‌లో ఉన్నాడు. లసిత్ మలింగ, కర్టిస్ కాంఫర్ (ఐర్లాండ్) రెండు, మూడు స్థానాల్లో ఉన్నారు. ఆ తర్వాతి ప్లేస్‌లో లెసోతోకు చెందిన వసీం యకూబ్ ఉండగా.. తాజా స్పెల్‌తో హెర్నర్ ఫెన్నెల్ ఐదో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.
Also Read:
ఆస్ట్రేలియాకు ఊహించని ఎదురుదెబ్బ.. మ్యాచ్ మధ్యలోనే..
ఆసీస్‌ను రెచ్చగొట్టిన జడేజా.. బ్యాట్‌ను కత్తిలా తిప్పుతూ..
షకీబ్ బౌలింగ్‌పై సస్పెన్షన్
For More Sports And Telugu News