PAK vs AUS: గెలిచే మ్యాచ్‌లో పాక్ ఓటమి.. ఇంతకంటే దారుణం ఉండదు
ABN , Publish Date - Nov 04 , 2024 | 04:13 PM
PAK vs AUS: పాకిస్థానీలు అంటార్రా బాబు.. అంటూ సోషల్ మీడియాలో దాయాది దేశ క్రికెట్ గురించి నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తుంటారు. దీనికి ఆ జట్టు ఆటగాళ్ల ఓవరాక్షన్, చెత్త ఫీల్డింగ్, బ్యాటింగ్ ఒక కారణమైతే.. చాలా మ్యాచుల్లో గెలుపు అంచుల వరకు వచ్చి చేజేతులా ఓడటం మరో కారణం. ఇది తాజాగా మళ్లీ రిపీట్ అయింది.
పాకిస్థానీలు అంటార్రా బాబు.. అంటూ సోషల్ మీడియాలో దాయాది దేశ క్రికెట్ గురించి నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తుంటారు. దీనికి ఆ జట్టు ఆటగాళ్ల ఓవరాక్షన్, చెత్త ఫీల్డింగ్, బ్యాటింగ్ ఒక కారణమైతే.. చాలా మ్యాచుల్లో గెలుపు అంచుల వరకు వచ్చి చేజేతులా ఓడటం మరో కారణం. ఇది తాజాగా మళ్లీ రిపీట్ అయింది. ఈజీగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో పాక్ పరాజయం పాలైంది. ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో విజయపు అంచుల దాకా వచ్చి బొక్క బోర్లా పడింది. దీంతో ఆ టీమ్ మీద నెట్టింట మీమ్స్, జోక్స్ పేలుతున్నాయి.
కమిన్స్ రాకతో తారుమారు
మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్ 2 వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. ఆ టీమ్ సంధించిన 203 పరుగుల లక్ష్యాన్ని కంగారూలు 8 వికెట్లు కోల్పోయి ఛేదించారు. ఒకదశలో 155 పరుగులకు 7 మంది ఆస్ట్రేలియా బ్యాటర్లు పెవిలియన్‌కు చేరుకోవడంతో పాక్ విజయం నల్లేరు మీద నడక అని అనుకున్నారు. కానీ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ (32 నాటౌట్) మాత్రం పట్టు విడవకుండా ఆఖరి వరకు ఫైట్ చేశాడు. మిచెల్ స్టార్క్ (2 నాటౌట్) అండతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.
సీనియర్లు తప్ప అంతా ఫెయిల్
సిరీస్ ఓపెనర్‌లో తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్ 203 పరుగులే చేయగలిగింది. సీనియర్లు మహ్మద్ రిజ్వాన్ (44), బాబర్ ఆజం (37) ఫర్వాలేదనిపించారు. మిగిలిన బ్యాటర్లంతా చేతులెత్తేయడంతో పాక్ 117 పరుగులకు 6 వికెట్లు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడింది. అయితే ఆఖర్లో షాహిన్ అఫ్రిదీ (24), నసీం షా (40) పట్టుదలతో ఆడి టీమ్‌కు పోరాడే స్కోరు అందించారు. కంగారూ ఛేజింగ్ సాఫీగా సాగలేదు. హ్యారిస్ రౌఫ్ (3/67), షాహిన్ అఫ్రిదీ (2/43) చెలరేగి బౌలింగ్ చేయడంతో వరుస విరామాల్లో వికెట్లు కోల్పోయింది. దీంతో పాక్‌దే విజయమని అంతా అనుకున్నారు. కానీ దరిద్రానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిన దాయాది జట్టు 2 వికెట్లు తీయలేక మ్యాచ్‌ను కంగారూలకు అప్పగించింది. మొదట్లో ఇంగ్లిస్, ఆఖర్లో కమిన్స్ బాగా ఆడటంతో ఆసీస్ బతికిపోయింది. ఇక, బౌలింగ్‌లో 3 వికెట్లు తీసి పాక్ నడ్డి విరిచిన ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
Also Read
ఐపీఎల్ మెగా వేలం వేదిక, తేదీలు ఇవేనా..
చిక్కుల్లో టీమిండియా స్టార్ క్రికెటర్లు
ఇదెక్కడి మాస్ రా మామా.. ఫీల్డ్ సెట్టింగ్‌తోనే పిచ్చెక్కించారు
For More Sports And Telugu News