Share News

IND vs AUS: టీమిండియాను అవమానించిన ఆసీస్.. గెలిచామని ఇంత పొగరా..

ABN , Publish Date - Dec 31 , 2024 | 04:48 PM

BGT 2024: ఆస్ట్రేలియా జట్టుకు పొగరెక్కువ. క్రికెట్ వరల్డ్‌లో బాగా వినిపించే స్టేట్‌మెంట్ ఇది. అభిమానుల దగ్గర నుంచి కామెంటేటర్ల వరకు.. మాజీ ఆటగాళ్ల నుంచి ఇప్పుడు ఆడుతున్న ప్లేయర్ల దాకా.. పసికూన జట్ల నుంచి బడా టీమ్స్ వరకు దాదాపుగా అందరి అభిప్రాయం ఇది. దీన్ని మరోమారు ప్రూవ్ చేసింది ఆసీస్.

IND vs AUS: టీమిండియాను అవమానించిన ఆసీస్.. గెలిచామని ఇంత పొగరా..
Team India

Rohit Sharma: ఆస్ట్రేలియా జట్టుకు పొగరెక్కువ. క్రికెట్ వరల్డ్‌లో బాగా వినిపించే స్టేట్‌మెంట్ ఇది. అభిమానుల దగ్గర నుంచి కామెంటేటర్ల వరకు.. మాజీ ఆటగాళ్ల నుంచి ఇప్పుడు ఆడుతున్న ప్లేయర్ల దాకా.. పసికూన జట్ల నుంచి బడా టీమ్స్ వరకు దాదాపుగా అందరి అభిప్రాయం ఇది. ఏళ్ల కొద్దీ జెంటిల్మన్ గేమ్ మీద పెత్తనం చలాయించడంతో వాళ్లకు ఎదురుపడిన టీమ్‌ను గేమ్ కంటే ముందు స్లెడ్జింగ్‌తో చిత్తు చేయాలని చూస్తూ ఉంటుంది. అక్కడి మీడియా, మాజీ క్రికెటర్లు, అభిమానులు ఆ జట్టుకు మద్దతునిస్తూ వాళ్ల పని వాళ్లు చేస్తుంటారు. ఇలా ప్రత్యర్థులను ఎప్పటికప్పుడు అవమానిస్తూ పైకి లేవకుండా స్ట్రాటజీలు అమలు చేస్తుంటారు. ఇప్పుడు భారత్ విషయంలోనూ అదే జరుగుతోంది. టీమిండియాను అవమానించింది ఆసీస్. అసలేం జరిగిందో ఇప్పుడు చూద్దాం..


ఎందుకిలా చేసినట్లు?

ఈ ఏడాది టెస్టుల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన ఆటగాళ్లతో కలసి క్రికెట్ ఆస్ట్రేలియా ఒక టీమ్‌ను రూపొందించింది. ఇందులో ఓపెనర్లుగా భారత యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్, ఇంగ్లండ్ డాషింగ్ ప్లేయర్ బెన్ డకెట్‌ను ఎంపిక చేసింది. జో రూట్, రచిన్ రవీంద్ర, హ్యారీ బ్రూక్, అలెక్స్ క్యారీ, కమిందు మెండిస్‌ను మిడిలార్డర్ బ్యాటర్లుగా సెలెక్ట్ చేసింది. బౌలర్లుగా మ్యాట్ హెన్రీ, జోష్ హేజల్‌వుడ్, జస్‌ప్రీత్ బుమ్రా, కేశవ్ మహారాజ్ సెలెక్ట్ అయ్యారు. ఈ టీమ్‌కు జస్‌ప్రీత్ బుమ్రాను కెప్టెన్‌గా నియమించింది. ఇక్కడే పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


కావాలనే పన్నిన కుట్ర!

క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించిన టెస్ట్ టీమ్‌లో భారత సారథి రోహిత్ శర్మకు చోటు దక్కలేదు. ఈ ఏడాది హిట్‌మ్యాన్ లాంగ్ ఫార్మాట్‌లో పెద్దగా రాణించలేదు. కాబట్టి ఎంపిక చేయకపోవడంలో తప్పు లేదు. టీమిండియా నుంచి సూపర్బ్‌గా ఆడిన బుమ్రా, జైస్వాల్‌కు చోటు ఇవ్వడం కూడా కరెక్టే. కానీ బుమ్రాను సారథిగా నియమించడంతో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రూట్ లాంటి ఎక్స్‌పీరియెన్స్ ఉన్న ఆటగాడ్ని కాదని.. ఒకట్రెండు టెస్టులకు మాత్రమే సారథ్యం వహించిన బుమ్రాకు సారథ్యం ఇవ్వడం పక్కా ప్లానింగ్ అని నెటిజన్స్ అంటున్నారు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ 1-2తో వెనుకంజలో ఉంది. మన టీమ్‌ను మరింత దెబ్బతీయాలంటే కెప్టెన్ రోహిత్‌ను అవమానించాలి. బెస్ట్ టెస్ట్ టీమ్‌లో అతడికి చోటు ఇవ్వకపోగా.. బుమ్రాను సారథిగా నియమించడం ద్వారా ఇద్దరికీ పడకుండా చేయాలనే కుట్రలో భాగంగానే ఇలా చేసిందని కామెంట్స్ చేస్తున్నారు. ఇలాంటి కుట్రలను అధిగమించి ఆఖరి టెస్టులో నెగ్గడం, సిరీస్‌ను డ్రా చేయడంపై మెన్ ఇన్ బ్లూ ఫోకస్ చేయాలని సూచిస్తున్నారు.


Also Read:

అభిషేక్ శర్మ ఊర మాస్ బ్యాటింగ్

‘అప్పుడే..నవతరం నాయకులు’

న్యూజిలాండ్‌దే సిరీస్‌

నిద్రలేని రాత్రులు.. కఠిన సవాళ్లు

For More Sports And Telugu News

Updated Date - Dec 31 , 2024 | 04:48 PM