Ayodhya: రామ మందిరం ప్రాణ ప్రతిష్ఠకు మరో స్టార్ క్రికెటర్‌కు ఆహ్వానం
ABN , Publish Date - Jan 20 , 2024 | 02:05 PM
ఈ నెల 22న జరగనున్న అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యకమానికి హాజరయ్యే టీమిండియా ఆటగాళ్ల జాబితాలో మరో క్రికెటర్ కూడా చేరాడు. రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా టీమిండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఆహ్వానం అందింది.
అయోధ్య: ఈ నెల 22న జరగనున్న అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యకమానికి హాజరయ్యే టీమిండియా ఆటగాళ్ల జాబితాలో మరో క్రికెటర్ కూడా చేరాడు. రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా టీమిండియా సీనియర్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌కు ఆహ్వానం అందింది. ఇందుకు సంబంధించిన ఆహ్వాన పత్రికను తమిళనాడు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్‌జీ సూర్య, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు వెంకట్రామన్ అశ్విన్‌కు అందజేశారు. చైన్నైలోని అశ్విన్ నివాసానికి వెళ్లి మరి ఈ ఆహ్వాన పత్రికను అందజేశారు. కాగా అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఇప్పటికే టీమిండియా మాజీ క్రికెటర్లు సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనితోపాటు విరాట్ కోహ్లీకి కూడా ఆహ్వానం అందింది.
ప్రస్తుతం ఐపీఎల్ 2024 కోసం రాంచీలో సిద్ధమవుతున్న ధోనికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) సహ-ప్రావిన్స్ సెక్రటరీ, బీజేపీ జార్ఖండ్ రాష్ట్ర ఆర్గనైజేషన్ జనరల్ సెక్రటరీ అయిన ధనంజయ్ సింగ్ ఆహ్వాన పత్రిక అందజేశారు. కాగా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ద్వారా 6000కి పైగా ఆహ్వాన పత్రికలను పంపిణీ చేస్తున్నారు. రామాలయంలో సోమవారం నాటి సంప్రోక్షణ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రామ్ లల్లా విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది. మైసూరుకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ రూపొందించిన 51 అంగుళాల విగ్రహాన్ని గురువారం ఆలయానికి తీసుకువచ్చారు. కాగా ఈ నెల 22న జరగనున్న రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి అయోధ్యలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ ఎత్తున ఏర్పాటు చేస్తున్న ఈ కార్యక్రమానికి అతిథులు భారీగా తరలిరానున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.