Cheteshwar Pujara: ఆస్ట్రేలియాతో సిరీస్‌కు పుజారా.. కానీ సూపర్ ట్విస్ట్
ABN , Publish Date - Nov 18 , 2024 | 03:04 PM
Cheteshwar Pujara: అభిమానుల కల ఎట్టకేలకు నిజం కానుంది. ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఎలాగైనా పుజారాను తీసుకోవాలనే డిమాండ్ నెరవేరనుంది. ఆసీస్‌తో పోరుకు పుజారా రాక ఖాయమైంది.
ఆస్ట్రేలియాతో త్వరలో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి భారత జట్టు సన్నద్ధం అవుతోంది. పెర్త్ టెస్ట్‌లోనే కంగారూలకు షాక్ ఇచ్చి సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని చూస్తోంది. అయితే అన్ని విభాగాల్లో బలంగానే ఉన్నా బ్యాటింగ్ యూనిట్ కొంత ఆందోళన కలిగిస్తోంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలి టెస్టుకు అందుబాటులో లేకపోవడం మరో షాక్. న్యూజిలాండ్ సిరీస్‌లో బ్యాటర్లు దారుణంగా ఆడటం ఫ్యాన్స్‌ను మరింత టెన్షన్ పడుతోంది. అందుకే పేస్, బౌన్స్, స్వింగ్‌కు స్వర్గధామం లాంటి పిచ్‌లపై ఆసీస్‌ను ఓడించాలంటే ఛటేశ్వర్ పుజారా లాంటి సీనియర్ బ్యాటర్ టీమ్‌లో ఉండాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఎట్టకేలకు వారి కోరికలు ఫలించాయి. బీజీటీ కోసం పుజారా రాక ఖాయమైంది. ఈ సిరీస్‌లో అతడు పార్టిసిపేట్ చేయనున్నాడు. కానీ సూపర్ ట్విస్ట్ ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
కొత్త అవతారంలో..
100కు పైగా టెస్టులు ఆడిన అనుభవం, 7 వేలకు పైగా పరుగులు, 19 సెంచరీలు, 3 డబుల్ సెంచరీలు చేసిన బ్యాటర్. ఏళ్ల నుంచి జట్టు బ్యాటింగ్ భారాన్ని మోస్తున్నాడు. టీమిండియా టెస్టుల్లో సూపర్ పవర్‌గా ఎదగడంలో అతడి కృషి గురించి ఎంత మెచ్చుకున్నా తక్కువే. అతడే ఛటేశ్వర్ పుజారా. ఇన్ని సాధించిన ఈ దిగ్గజ ఆటగాడ్ని సెలెక్టర్లు కొన్నాళ్లుగా పట్టించుకోవడం లేదు. పేలవమైన ఫామ్, వయసు, భవిష్యత్తులను దృష్టిలో పెట్టుకొని అతడికి బదులు యంగ్‌స్టర్స్‌కు ఛాన్సులు ఇస్తోంది. అయితే పుజారా మాత్రం డొమెస్టిక్ క్రికెట్‌పై ఫోకస్ పెట్టి సత్తా చాటుతున్నాడు. అలాంటోడ్ని ఎలాగైనా ఆసీస్ సిరీస్‌లో ఆడించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. అది నెరవేరనుంది కూడా. అయితే ప్లేయర్‌గా కాదు.. కామెంటేటర్‌గా కొత్త అవతారంలో పుజారా ఫ్యాన్స్‌ను ఎంటర్‌టైన్ చేయనున్నాడు.
హిందీ కామెంట్రీ
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మ్యాచులకు పుజారా కామెంట్రీ ఇవ్వనున్నాడు. హిందీలో అతడు వ్యాఖ్యానం చేయనున్నాడు. ఇది తెలిసిన కొందరు అభిమానులు హ్యాపీ ఫీలవుతున్నారు. కనీసం కామెంట్రీ రూపంలోనైనా పుజారా అలరించనుండటం మంచి విషయమని అంటున్నారు. కంగారూ గడ్డపై తాను ఆడినప్పటి విశేషాలు, అక్కడి పిచ్‌ల స్వభావం గురించి అతడి మాటల్లో వినాలని ఉందని అంటున్నారు. అయితే మరికొందరు ఫ్యాన్స్ మాత్రం గత బీజీటీలో సెకండ్ హయ్యెస్ట్ రన్ స్కోరర్‌గా ఉన్నోడ్ని టీమ్‌లోకి తీసుకోలేదని.. అతడితో కామెంట్రీ చేయించడం కరెక్ట్ కాదని చెబుతున్నారు.
Also Read:
కోహ్లీకి తప్పని కష్టాలు.. పెర్త్‌లో అసలేం జరుగుతోంది
జ్యోతి సురేఖకు స్వర్ణం
కార్ల్‌సన్ కమాల్
For More Sports And Telugu News