Share News

DC vs GT: దుమ్ముదులిపేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. గుజరాత్ ముందు భారీ లక్ష్యం

ABN , Publish Date - Apr 24 , 2024 | 09:27 PM

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ దుమ్ముదులిపేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (88) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో తాండవం చేయడం, అక్షర్ పటేల్ (66) అర్థశతకంతో రాణించడం...

DC vs GT: దుమ్ముదులిపేసిన ఢిల్లీ క్యాపిటల్స్.. గుజరాత్ ముందు భారీ లక్ష్యం

ఢిల్లీలోని అరుణ్ జైట్లీ వేదికగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ దుమ్ముదులిపేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. రిషభ్ పంత్ (88) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో తాండవం చేయడం, అక్షర్ పటేల్ (66) అర్థశతకంతో రాణించడం, స్టబ్స్ (26) మెరుపులు మెరిపించడంతో.. ఢిల్లీ జట్టు గుజరాత్ ముందు 225 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించగలిగింది.


టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీ జట్టుకి ఓపెనర్లు షా, జేక్ శుభారంభాన్నే అందించారు. వీళ్లు దూకుడుగానే ఇన్నింగ్స్ ప్రారంభించారు. కానీ.. ఇంతలోనే ఢిల్లీ జట్టుకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వెనువెంటనే మూడు వికెట్లు (షా, జేక్, హోప్) కోల్పోయింది. అప్పుడు అక్షర్ పటేల్, రిషభ్ పంత్ కలిసి.. మంచి భాగస్వామ్యం నెలకొల్పారు. వికెట్లు పడనివ్వకుండా ఆచితూచి ఆడుతూ.. వీలు దొరికినప్పుడల్లా భారీ షాట్లతో దుమ్ముదులిపేశారు. నాలుగో వికెట్‌కి వీళ్లిద్దరు 113 పరుగులు జోడించారంటే.. అక్షర్, రిషభ్ ఎంత అద్భుతంగా ఆడారో అర్థం చేసుకోవచ్చు.

ఇక చివర్లో అయితే రిషభ్, స్టబ్స్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. బౌండరీల వర్షం కురిపించి, ఢిల్లీ అభిమానుల్ని ఫుల్‌గా ఎంటర్టైన్ చేశారు. 19వ ఓవర్‌లో స్టబ్స్ రెండు ఫోర్లు, రెండు సిక్సులు చితక్కొడితే.. చివరి ఓవర్‌లో పంత్ నాలుగు సిక్సులు, ఒక ఫోర్‌తో ఊచకోత కోశాడు. ఫలితంగా.. ఢిల్లీ జట్టు 200 మార్క్ దాటేసి 224 పరుగులు భారీ స్కోర్ చేసింది. ఇక గుజరాత్ బౌలర్ల విషయానికొస్తే.. సందీప్ వార్యర్ ఒక్కడే పొదుపుగా బౌలింగ్ వేశాడు. మూడు ఓవర్లలో 15 పరుగులిచ్చి 3 వికెట్లు తీశాడు. మిగతా వాళ్లు ధారాళంగా పరుగులిచ్చారు.

Updated Date - Apr 24 , 2024 | 09:27 PM