Share News

ENG vs NZ: సెంచరీ, హ్యాట్రిక్, 10 వికెట్లు.. బచ్చా ప్లేయర్ ఆల్‌టైమ్ రికార్డ్

ABN , Publish Date - Dec 08 , 2024 | 07:29 PM

ENG vs NZ: రికార్డులు అనగానే బిగ్ ప్లేయర్స్ అందరికీ గుర్తుకొస్తారు. బడా ఆటగాళ్లే ఎక్కువగా మైల్‌స్టోన్స్ అందుకోవడం దీనికి కారణం. అయితే కొందరు కొత్త కుర్రాళ్లు కెరటంలా దూసుకొచ్చి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఎవరికీ సాధ్యం కాని రికార్డుల్ని అవలీలగా అందుకొని షాక్‌కు గురిచేస్తుంటారు.

ENG vs NZ: సెంచరీ, హ్యాట్రిక్, 10 వికెట్లు.. బచ్చా ప్లేయర్ ఆల్‌టైమ్ రికార్డ్

రికార్డులు అనగానే బిగ్ ప్లేయర్స్ అందరికీ గుర్తుకొస్తారు. బడా ఆటగాళ్లే ఎక్కువగా మైల్‌స్టోన్స్ అందుకోవడం దీనికి కారణం. అయితే కొందరు కొత్త కుర్రాళ్లు కెరటంలా దూసుకొచ్చి అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఎవరికీ సాధ్యం కాని రికార్డుల్ని అవలీలగా అందుకొని షాక్‌కు గురిచేస్తుంటారు. కష్టపడితే ఏదైనా సాధ్యమేనని నిరూపిస్తుంటారు. ఆకాశమే హద్దు అని తమ గేమ్‌తో ప్రూవ్ చేస్తుంటారు. ఓ యంగ్ క్రికెటర్ ఇదే కోవలోకి వస్తాడు. అతడే గస్ అట్కిన్సన్. ఈ ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ అందుకున్న రికార్డు ఏంటో తెలిస్తే ఎవ్వరైనా ఫిదా అవ్వాల్సిందే. ఆ రికార్డు ఏందనేది ఇప్పుడు చూద్దాం..


లిస్ట్‌లో భారత ప్లేయర్

ఇంగ్లండ్ యువ ఆల్‌రౌండర్ గస్ అట్కిన్సన్ ఆల్‌టైమ్ రికార్డు క్రియేట్ చేశాడు. టెస్ట్ క్రికెట్‌లో అత్యంత వేగంగా ఒక సెంచరీ, హ్యాట్రిక్, ఒకే మ్యాచ్‌లో 10 వికెట్లు పడగొట్టిన ప్లేయర్‌గా అతడు నిలిచాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు అట్కిన్సన్. దీంతో ఈ ఘనత సాధ్యమైంది. 10 టెస్టుల్లోనే అరుదైన మైలురాయిని అందుకున్నాడీ ఇంగ్లీష్ ఆల్‌రౌండర్. గతంలో టీమిండియా వెటరన్ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ 26 టెస్టుల్లో ఈ రికార్డు సాధించగా.. దాన్ని అట్కిన్సన్ బ్రేక్ చేశాడు. టెస్టుల్లో సెంచరీ, 10 వికెట్లు.. హ్యాట్రిక్ తీసిన ప్లేయర్ల జాబితాలో మూడో స్థానంలో ఇంగ్లండ్ క్రికెటర్ జానీ బ్రిగ్స్ ఉన్నాడు. ఈ ఫీట్ అందుకునేందుకు అతడికి 40 మ్యాచులు పట్టింది. ఆ దేశ మరో దిగ్గజ ఆటగాడు స్టువర్ట్ బ్రాడ్ ఈ ఫీట్‌ను చేరుకునేందుకు 46 మ్యాచులు తీసుకున్నాడు.


సిరీస్ సొంతం

అరుదైన రికార్డు క్రియేట్ చేసిన అట్కిన్సన్‌ను క్రికెట్ లవర్స్ మెచ్చుకుంటున్నారు. అతడు ఇలాంటి మరిన్ని ఫీట్స్ నమోదు చేయాలని కోరుకుంటున్నారు. ఇక, ఇంగ్లండ్-న్యూజిలాండ్ మ్యాచ్ విషయానికొస్తే.. ఇందులో ఇంగ్లీష్ టీమ్ విజయం సాధించింది. 323 పరుగుల భారీ తేడాతో కివీస్‌ను ఆ జట్టు చిత్తు చేసింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 123 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 55 పరుగులతో ఆకట్టుకున్న యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఈ గెలుపుతో మూడు టెస్టుల సిరీస్‌ను మరో టెస్ట్ మిగిలి ఉండగానే 2-0తో సొంతం చేసుకుంది ఇంగ్లండ్.


Also Read:

డేంజర్‌లో రోహిత్-కోహ్లీ.. రిటైర్మెంట్ తప్పించుకోవాలంటే ఒకటే దారి

ఈ స్క్రాప్ అవసరమా.. తీసిపారేయండి అంటున్న నెటిజన్స్

ఫోన్ నంబర్‌ను తలపిస్తున్న స్కోర్ కార్డ్.. రోహిత్ ఫెయిల్యూర్‌కు బిగ్ ప్రూఫ్

అడిలైడ్‌లో ఘోర ఓటమి.. అతడి కోసం వెయిటింగ్ అంటున్న రోహిత్

For More Sports And Telugu News

Updated Date - Dec 08 , 2024 | 07:47 PM