IND vs ENG: టీమిండియాను ఇంగ్లండ్ 5-0తో వైట్ వాష్ చేస్తుంది.. మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Jan 30 , 2024 | 09:12 AM
హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఊహించని విజయంతో ఇంగ్లండ్ జట్టు ఫుల్ జోష్‌లో ఉన్న వేళ ఆ జట్టు మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతిథ్య జట్టు భారత్‌ను ఇంగ్లండ్ వైట్‌వాష్ చేస్తుందని హెచ్చరికలు జారీ చేశాడు.
హైదరాబాద్ వేదికగా జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్‌లో ఊహించని విజయంతో ఇంగ్లండ్ జట్టు ఫుల్ జోష్‌లో ఉన్న వేళ ఆ జట్టు మాజీ క్రికెటర్ మాంటీ పనేసర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అతిథ్య జట్టు భారత్‌ను ఇంగ్లండ్ వైట్‌వాష్ చేస్తుందని హెచ్చరికలు జారీ చేశాడు. ఇంగ్లండ్ మొదటి టెస్ట్ మ్యాచ్ గెలవడంలో కీలకపాత్ర పోషించిన ఒలీ పోప్, టామ్ హార్ట్‌లీ ఇదే విధంగా ఆడితే టీమిండియాను ఇంగ్లండ్ 5-0తో వైట్‌వాష్ చేస్తుందని పనేసర్ జోస్యం చెప్పాడు. రెండో టెస్ట్ ప్రారంభానికి ముందు ఏఎన్‌ఐ న్యూజ్ ఏజేన్సీతో మాట్లాడిన పనేసర్ ఈ మేరకు వ్యాఖ్యలు చేశాడు. ‘‘ఒలీ పోప్, టామ్ హార్ట్‌లీ ఇలాగే ఆడడం కొనసాగిస్తే టీమిండియాను ఇంగ్లండ్ వైట్‌వాష్ చేస్తుంది. ఇంగ్లండ్ 5-0తో సిరీస్ గెలుస్తుంది. అయితే దానికి ఒలీ పోప్, టామ్ హార్ట్‌లీ ఇదే ఆటతీరును కొనసాగించాల్సి ఉంటుంది. మొదటి టెస్టులో ఇంగ్లండ్‌కు చాలా పెద్ద విజయం దక్కింది. ఇది సాధ్యమవుతుందని ఎవరూ ఊహించలేదు. 190 పరుగుల లోటు తర్వాత ఇంగ్లండ్ ఓడిపోతుందని అంతా అనుకున్నారు. కానీ ఒలీ పోప్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. చాలా కాలంగా మనం చూసిన అత్యుత్తమ ఇన్నింగ్స్‌ల్లో ఇది ఒకటి.’’ అని చెప్పాడు.
ఇంగ్లండ్ సాధించిన అత్యుత్తమ విజయాల్లో ఇదొకటని పనేసర్ వ్యాఖ్యానించాడు. అలాగే ఈ విజయంతో ఇంగ్లండ్ ప్రపంచకప్ గెలిచినట్టుగా అనిపిస్తుందని ఆనందం వ్యక్తం చేశాడు. ‘‘విదేశాలలో ఇంగ్లండ్ సాధించిన గొప్ప విజయాలలో ఇది ఒకటి. ఈ విజయంతో ఇంగ్లండ్ ప్రపంచకప్ గెలిచినట్లు అనిపిస్తుంది’’ అని పనేసర్ అన్నాడు. కాగా లెఫ్టార్మ్ స్పిన్నరైనా మాంటీ పనేసర్ ఇంగ్లండ్ తరఫున 50 టెస్టులు, 26 వన్డేలు, ఓ టీ20 మ్యాచ్ ఆడాడు. టెస్టుల్లో 167 వికెట్లు, వన్డేల్లో 24 వికెట్లు, టీ20ల్లో 2 వికెట్లు తీశాడు. 2012/13లో భారత్ వేదికగా జరిగిన టెస్టు సిరీస్‌ను అలిస్టర్ కుక్ నాయకత్వంలోని ఇంగ్లండ్ జట్టు గెలుచుకోవడంలో పనేసర్ కీలకపాత్ర పోషించాడు. కాగా ఉప్పల్ వేదికగా జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. మొదటి ఇన్నింగ్స్‌లో టీమిండియాకు 190 పరుగుల భారీ అధిక్యం లభించినప్పటికీ ఓటమి తప్పలేదు. 28 పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లండ్‌ను విజయం వరించింది. ఇక ఫిబ్రవరి 2 నుంచి భారత్, ఇంగ్లండ్ మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.