Share News

Gautam Gambhir: టీమిండియాకు కొత్త కోచ్.. గంభీర్ మూటాముల్లె సర్దుకోవాల్సిందే

ABN , Publish Date - Nov 05 , 2024 | 05:34 PM

Gautam Gambhir: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఇప్పుడు ఫుల్ టెన్షన్ పడుతున్నాడు. న్యూజిలాండ్ సిరీస్‌లో జట్టు వైట్‌వాష్ అవడంతో అతడికి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఈ తరుణంలో భారత క్రికెట్‌ కోచింగ్‌కు సంబంధించి పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

Gautam Gambhir: టీమిండియాకు కొత్త కోచ్.. గంభీర్ మూటాముల్లె సర్దుకోవాల్సిందే

టీ20 వరల్డ్ కప్-2024 ముగింపుతో భారత క్రికెట్‌లో పరిణామాలు చాలా వేగంగా మారిపోయాయి. దిగ్గజం రాహుల్ ద్రవిడ్ నిష్క్రమణతో అతడి స్థానంలో మరో లెజెండరీ ప్లేయర్ గౌతం గంభీర్‌ను కొత్త కోచ్‌గా నియమించింది బీసీసీఐ. సహాయక సిబ్బంది దగ్గర నుంచి టీమ్ సెలెక్షన్, కెప్టెన్ ఎంపిక వరకు అతడికి ప్రతి దాంట్లోనూ ఫుల్ పవర్స్ ఇచ్చింది బోర్డు. కానీ మొదటి సిరీస్ నుంచి గౌతీ అంచనాలను మాత్రం అందుకోవడం లేదు. శ్రీలంక టూర్‌లో వన్డే సిరీస్‌లో ఓడటం, తాజాగా న్యూజిలాండ్ చేతుల్లో వైట్‌వాష్ అవడంతో గంభీర్ కోచింగ్ సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ తరుణంలో జట్టుకు నయా కోచ్ రానున్నాడని వినిపిస్తోంది. గౌతీ ఇంక మూటాముల్లె సర్దుకోవాల్సిందేనని అంటున్నారు.


లక్ష్మణ్ రావాల్సిందే

గంభీర్‌కు బదులు మరో సీనియర్ ఆటగాడు, నేషనల్ క్రికెట్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్న వీవీఎస్ లక్ష్మణ్‌ను కోచ్ పోస్ట్‌లోకి తీసుకోవాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి. గౌతీ 58 టెస్టులు ఆడగా.. హైదరాబాదీ వీవీఎస్ 134 మ్యాచులు ఆడాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లో ప్రతికూల పరిస్థితుల నుంచి టీమ్‌ను బయటపడేయడంలో అతడికి గొప్ప అనుభవం ఉంది. ప్రస్తుతం సౌతాఫ్రికాలో ఉన్న సూర్య సేనకు కోచ్‌గా ఉన్న లక్ష్మణ్ హెడ్ కోచ్‌గా వస్తే జట్టుకు ఢోకా ఉండదనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. స్ప్లిట్ కెప్టెన్సీ మాదిరిగా స్ప్లిట్ కోచింగ్ వైపు బీసీసీఐ దృష్టి సారిస్తే బాగుంటుందని కొందరు నెటిజన్స్ అంటున్నారు.


ఇద్దరు కోచ్‌లు

టీ20లు, వన్డేలకు గంభీర్‌ను.. టెస్టులకు లక్ష్మణ్‌ను కోచ్‌గా నియమిస్తే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ దిశగా బీసీసీఐ సమాలోచనలు చేసేలాగే ఉంది. కివీస్ సిరీస్‌లో గంభీర్ తీసుకున్న నిర్ణయాలు బెడిసికొట్టడం, వ్యూహాలు పనిచేయకపోవడంతో అతడి అధికారాలకు బోర్డు కత్తెర వేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో గనుక టీమ్ ఫెయిలైతే ఇద్దరు కోచ్‌ల ప్లాన్‌ను బీసీసీఐ అమల్లో పెట్టే అవకాశాలు మెండుగా ఉంటాయని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు.


Also Read:

కెప్టెన్‌గా బుమ్రా.. స్టార్ పేసర్‌కు ఫుల్ పవర్స్

బర్త్‌డే స్పెషల్.. కోహ్లీ గురించి ఎవరికీ తెలియని రహస్యాలు

మూలాలు మరిస్తే ఎలా..!

For More Sports And Telugu News

Updated Date - Nov 05 , 2024 | 06:25 PM