Share News

Gautam Gambhir: గంభీర్‌కు బీసీసీఐ గుబులు.. తప్పించుకోవడానికి నో ఛాన్స్

ABN , Publish Date - Nov 04 , 2024 | 06:54 PM

Gautam Gambhir: టీమిండియా కోచ్ గౌతం గంభీర్‌లో గుబులు మొదలైంది. బీసీసీఐ అంటే భయపడిపోతున్నాడు గౌతీ. అతడికి తప్పించుకునే ఛాన్స్ కూడా లేకుండా పోయింది.

Gautam Gambhir: గంభీర్‌కు బీసీసీఐ గుబులు.. తప్పించుకోవడానికి నో ఛాన్స్

టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ దేనికీ భయపడడు. ఏ విషయం మీదైనా తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పే గౌతీ.. ఎలాంటి పరిస్థితి ఎదురైనా తొణకడు, బెణకడు. తన స్టైల్‌లో సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు దూసుకెళ్తుంటాడు. అలాంటోడికి ఇప్పుడు పెద్ద చిక్కే వచ్చి పడింది. దేనికీ వెరవని గౌతీ ఇప్పుడు భారత క్రికెట్ బోర్డుకు భయపడుతున్నాడని తెలుస్తోంది. అతడికి తప్పించుకునే ఛాన్స్ కూడా లేకుండా పోయింది. ఎలాగైనా సమాధానాలు చెప్పి తీరాల్సిన పరిస్థితి గంభీర్‌ది. మరి.. బీసీసీఐ ఏం అడగబోతోంది? గౌతీ తప్పించుకోలేని ఆ ప్రశ్నలు ఏంటనేది ఇప్పుడు చూద్దాం..


పవర్స్ కట్?

రాహుల్ ద్రవిడ్ నిష్క్రమణ తర్వాత ఏరికోరి మరీ గంభీర్‌ను కోచ్ పదవి కోసం తెచ్చుకుంది బీసీసీఐ. శ్రీలంకతో వన్డే సిరీస్‌లో టీమ్‌కు ఓటమి ఎదురైనా అతడికి అండగా నిలిచింది. అయితే ఇప్పుడా పరిస్థితి లేదు. న్యూజిలాండ్ చేతుల్లో సొంతగడ్డ మీద 0-3తో వైట్‌వాష్ అయింది టీమిండియా. ఘోర పరాజయంతో జట్టు మీద నలువైపుల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. దీంతో గంభీర్ పవర్స్ కట్ చేసేందుకు బోర్డు సిద్ధమవుతోందని వినిపిస్తోంది. కివీస్ సిరీస్‌పై పోస్ట్‌మార్టం చేసేందుకు రెడీ అయిందని.. అందులో భాగంగానే గౌతీతో పాటు ఇతర కోచింగ్ స్టాఫ్‌తో త్వరలో బీసీసీఐ పెద్దలు సమావేశం కానున్నారని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది.


ఎందుకు మార్చారు?

న్యూజిలాండ్ సిరీస్‌లో గంభీర్ తీసుకున్న పలు నిర్ణయాలపై బోర్డు సీరియస్‌గా ఉందట. తొలి టెస్టులో వర్షం పడ్డాక బ్యాటింగ్ చేయాలని నిర్ణయించడం, ఆఖరి మ్యాచ్‌లో మహ్మద్ సిరాజ్‌ను నైట్ వాచ్‌మన్‌గా పంపడం, అలాగే స్పెషలిస్ట్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్‌ను 8వ డౌన్‌లో ఆడించడం మీద గౌతీని ప్రశ్నించనున్నారట బోర్డు పెద్దలు. దీంతో పాటు బెంగళూరు టెస్టులో ఓటమి వెంటనే వరుసగా రెండు మ్యాచుల్లో స్పిన్ ట్రాక్‌ల్లో ఆడాలని డిసైడ్ చేయడం మీద కూడా క్వశ్చన్స్ చేయనున్నారని వినిపిస్తోంది.


రిపీట్ అయితే కష్టమే

మాజీ కోచ్ ద్రవిడ్ హయాంలో సొంతగడ్డపై జరిగే టెస్టుల్లో బ్యాటింగ్, బౌలింగ్‌కు అనుకూలించే స్పోర్టింగ్ వికెట్లను ఎంచుకునేవారు. కానీ ఒక్క ఓటమికే టర్నింగ్ ట్రాక్స్‌కు ఎందుకు మారారు? దీని వల్ల స్పిన్ ఉచ్చులో పడి సిరీస్ కోల్పోవడంతో బీసీసీఐ సీరియస్‌గా ఉందట. హఠాత్తుగా పిచ్ మార్పు ఎందుకు జరిగిందనే దానిపై గంభీర్ సమాధానం ఇవ్వక తప్పదని ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. వచ్చే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలోనూ ఇలాంటి మిస్టేక్స్ రిపీట్ అయితే సెలెక్షన్‌కు దూరంగా ఉంచడంతో పాటు అతడి అధికారాలకు కత్తెర వేయడం ఖాయమని సమాచారం.


Also Read:

అయ్యర్ కావాలనే బయటకు వచ్చాడా.. పెద్ద ప్లానింగే ఇది

పంత్‌కు రూ.50 కోట్లు.. పాత రికార్డులకు పాతర

గెలిచే మ్యాచ్‌లో పాక్ ఓటమి.. ఇంతకంటే దారుణం ఉండదు

For More Sports And Telugu News

Updated Date - Nov 04 , 2024 | 06:57 PM