Share News

Yashaswi Jaiswal: సచిన్, విరాట్ తర్వాత క్రికెట్ దునియాకు అతడే బాస్.. మాజీ కోచ్ కామెంట్స్ వైరల్

ABN , Publish Date - Nov 26 , 2024 | 04:22 PM

క్రికెట్ ప్రపంచంలో సచిన్ విరాట్ కోహ్లీ తర్వాత మళ్లీ అంతటి సత్తా ఉన్న ప్లేయర్ దొరికాడంటూ టీమిండియా మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ సంతోషం వ్యక్తం చేశాడు. లెజెండరీ ట్యాగ్ ను మోసేందుకు ఓ యువ క్రికెటర్ సిద్ధమవుతున్నాడంటూ కామెంట్స్ చేశాడు.

Yashaswi Jaiswal: సచిన్, విరాట్ తర్వాత క్రికెట్ దునియాకు అతడే బాస్.. మాజీ కోచ్ కామెంట్స్ వైరల్
Sachin Tendulkar, Virat Kohli

ముంబై: భారత క్రికెట్ పై సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి స్టార్లు వేసిన ముద్ర అంతా ఇంతా కాదు. అయితే, ఇప్పుడు మళ్లీ వారి వారసత్వాన్ని కొనసాగించేందుకు టీమిండియాలో ఒకడు పుట్టుకొచ్చాడంటూ భారత జట్టు మాజీ కోచ్ గ్రెగ్ చాపెల్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. పెర్త్ వేదికగా ఆసిస్ తో జరిగిన మ్యాచ్ లో టీమిండియా బ్యాటర్ యశస్వి జైస్వాల్ చేసిన సెంచరీ అతడి క్రేజ్ ను అమాంతం పెంచేసింది. 297 బంతుల్లో 161 పరుగులు చేసిన యశస్వి.. 54.21 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసి 15 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీల వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లే సత్తా యశస్వి జైస్వాల్‌కు ఉందని గ్రెగ్ చాపెల్ అభిప్రాయపడ్డాడు.


సత్తా ఉంది..

ఇటీవల మీడియాతో మాట్లాడిన గ్రెగ్ చాపెల్.. ’ఆస్ట్రేలియాతో జరిగిన పెర్త్ టెస్టులో 161 పరుగుల ఇన్నింగ్స్ ఆడిన యశస్వి జైస్వాల్ తనను ఎంతగానో ఆకట్టుకున్నాడని చెప్పాడు. తొలి టెస్టులో భారత్ 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ యువ ఓపెనింగ్ బ్యాట్స్‌మన్ సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ వంటి అద్భుతమైన బ్యాటింగ్ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్లగలడు' అని ఆశాభావం వ్యక్తం చేశాడు.


లెజెండ్ల సరసన చోటు..

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆసిస్‌తో జరిగిన టెస్టులో యశస్వి పలు రికార్డులను బద్దలుకొట్టాడు. సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేసిన ఈ ఓపెనింగ్ బ్యాటర్.. తన కెరీర్ లోనే నాలుగో టెస్టు సెంచరీని నమోదు చేశాడు. 23 ఏళ్లు నిండకముందే టెస్టుల్లో అత్యధిక సెంచరీలు చేసిన బ్యాటర్ల లిస్టులో చేరాడు. ఇప్పటివరకూ ఈ స్థానంలో సచిన్ టెండూల్కర్(8), రవిశాస్త్రి(5), సునీల్ గవాస్కర్(4), వినోద్ కాంబ్లీ(4) ఉన్నారు. ఇప్పుడు యశస్వి(4) సైతం వీరి సరసన చేరాడు.

Champions Trophy: హైబ్రిడ్ మోడల్‌కు ఓకే అంటే బంపర్ ఆఫర్.. పీసీబీని సంప్రదించిన ఐసీసీ


Updated Date - Nov 26 , 2024 | 04:22 PM