Share News

Hardik Pandya: కావాలనే స్లోగా ఆడిన హార్దిక్.. ఇంత స్వార్థం దేనికి..

ABN , Publish Date - Nov 11 , 2024 | 03:01 PM

Hardik Pandya: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎలా బ్యాటింగ్ చేస్తాడో తెలిసిందే. క్రీజులోకి అడుగు పెట్టింది మొదలు ధనాధన్ షాట్లతో అలరిస్తాడు. తగ్గేదేలే అంటూ బౌండరీలు, సిక్సులతో చెలరేగుతాడు.

Hardik Pandya: కావాలనే స్లోగా ఆడిన హార్దిక్.. ఇంత స్వార్థం దేనికి..

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఎలా బ్యాటింగ్ చేస్తాడో తెలిసిందే. క్రీజులోకి అడుగు పెట్టింది మొదలు ధనాధన్ షాట్లతో అలరిస్తాడు. తగ్గేదేలే అంటూ బౌండరీలు, సిక్సులతో చెలరేగుతాడు. ప్రత్యర్థి బౌలర్లపై పిడుగులా విరుచుకుపడతాడు. చూస్తుండగానే అపోజిషన్ టీమ్ నుంచి మ్యాచ్‌ను లాగేసుకుంటాడు. క్షణాల్లోనే రిజల్ట్‌ను తారుమారు చేస్తాడు. కానీ సౌతాఫ్రికాతో జరిగిన సెకండ్ టీ20 మాత్రం దీనికి పూర్తి భిన్నంగా సాగింది. ఈ మ్యాచ్‌లో ఆరో డౌన్‌లో బ్యాటింగ్‌కు దిగిన హార్దిక్.. 45 బంతుల్లో 39 పరుగులు చేశాడు.


అదేం బ్యాటింగ్?

రెండో టీ20లో 4 బౌండరీలు కొట్టిన హార్దిక్.. కేవలం ఒకే సిక్స్ బాదాడు. భారీ స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేసే పాండ్యా.. నిన్నటి మ్యాచ్‌లో 86 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. అసలు ఆడుతోంది హార్దికేనా అనే అనుమానం కలిగింది. మరో ఎండ్‌లో ఉన్న టెయిలెండర్ అర్ష్‌దీప్ సింగ్ సిక్స్ కొట్టినా హార్దిక్ మాత్రం డిఫెన్సివ్ అప్రోచ్‌తో ఆడటం విమర్శలకు దారితీసింది. అతడు కావాలనే స్లోగా బ్యాటింగ్ చేశాడనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. తొలి టీ20లో రెండు పరుగులు మాత్రమే చేశాడు పాండ్యా. దీంతో రెండో మ్యా్చ్‌లో ఎలాగైనా రన్స్ చేయాలి, టీమ్‌లో తన ప్లేస్ కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే అలా ఆడాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.


ఐపీఎల్‌కు ప్రిపేర్ అవుతున్నాడా?

నిన్నటి మ్యాచ్‌లో ఆడిన చివరి 10 బంతుల్లో 7 డాట్స్ చేశాడు పాండ్యా. కేవలం ఆరు పరుగులు మాత్రమే చేశాడు. దీంతో అతడిపై విమర్శల వాన కురుస్తోంది. ‘పాండ్యా నాటౌట్‌గా ఉన్నాడు. అతడు తన కోసమే ఆడాడు. స్వార్థం తప్ప ఏమీ కనిపించలేదు. ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడేందుకు ప్రిపేర్ అవుతున్నట్లు అనిపిస్తోంది. సింగిల్స్ తీయలేదు, అర్ష్‌దీప్ సిక్స్ కొట్టినా అతడు మాత్రం షాట్లు బాదలేదు’ అని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ బాసిత్ అలీ విమర్శించాడు. హార్దిక్.. ఇంత స్వార్థం పనికిరాదు.. జట్టు కోసం ఆడమంటూ సోషల్ మీడియాలో మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.


Also Read:

మళ్లీ అదే తప్పు చేస్తున్న గంభీర్.. అతడిపై ఎందుకంత ప్రేమ..

తప్పంతా నాదే.. వాళ్లకు తిట్టే హక్కు ఉంది: గంభీర్

స్టార్టప్ దశ మార్చేసిన ధోని

For More Sports And Telugu News

Updated Date - Nov 11 , 2024 | 03:04 PM