Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీపై తేల్చేసిన ఐసీసీ
ABN , Publish Date - Nov 10 , 2024 | 12:24 PM
క్రికెట్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక టోర్నమెంట్స్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఒకటి. ఐసీసీ నిర్వహించే ఈ టోర్నీకి సంబంధించి రకరకాలు ఊహాగానాలు వస్తున్నాయి. పాకిస్థాన్ ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీ మొదలవక ముందే వివాదాస్పదంగా మారింది.
ICC: క్రికెట్‌లోని అత్యంత ప్రతిష్టాత్మక టోర్నమెంట్స్‌లో ఛాంపియన్స్ ట్రోఫీ ఒకటి. ఐసీసీ నిర్వహించే ఈ టోర్నీకి సంబంధించి రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి. వచ్చే ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి పాకిస్థాన్ ఆతిథ్యం ఇస్తోంది. అయితే మొదలవక ముందే ఈ టోర్నీ చుట్టూ వివాదం అలుముకుంది. భద్రతా కారణాల రీత్యా పాక్‌కు టీమిండియాను పంపించేది లేదని భారత క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. బీసీసీఐని కన్విన్స్ చేసేందుకు ఎంత ప్రయత్నించినా లాభం లేకుండా పోయింది. మరికొన్ని రోజుల్లో ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ ప్రకటించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో టోర్నీకి భారత్ వెళ్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో ఏకంగా టోర్నీని రద్దు చేశారనే వార్త సంచలనంగా మారింది.
రద్దే మార్గం?
ఛాంపియన్స్ ట్రోఫీని ఐసీసీ రద్దు చేయాలని భావిస్తోందని సమాచారం. దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ టోర్నమెంట్ కోసం పాక్‌కు వెళ్లేది లేదని భారత్ స్పష్టం చేయడంతో.. టీమిండియా మ్యాచ్‌ల షెడ్యూల్ ఇబ్బందికరంగా మారింది. తమ మ్యాచుల్ని హైబ్రిబ్ పద్ధతిలో దుబాయ్ లేదా ఇతర దేశంలో నిర్వహించాలని, కానీ దాయాది దేశానికి రావడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని భారత్ చెప్పేసింది. మరోవైపు మెగా టోర్నీని పాక్‌లోనే నిర్వహించాలని ఆ దేశ క్రికెట్ బోర్డు పట్టుదలతో ఉంది. అటు బీసీసీఐ మొండికేయడం, ఇటు పీసీబీ కూడా మాట వినకపోవడంతో ఛాంపియన్స్ ట్రోఫీని రద్దు చేస్తే బెటర్ అని ఐసీసీ పెద్దలు భావిస్తున్నారని వినికిడి.
మొండికేస్తున్న పీసీబీ, బీసీసీఐ
ఛాంపియన్స్ ట్రోఫీ-2025కి పెద్దగా సమయం కూడా లేదు. ఇప్పటికే వంద రోజుల కౌంట్‌డౌన్ కూడా స్టార్ట్ కావాల్సి ఉంది. ఇటు చూస్తే పీసీబీ, బీసీసీఐలు మొండికేస్తున్నాయి. దీంతో టోర్నమెంట్‌ను రద్దు చేయడం లేదా వాయిదా వేయడం మీద ఐసీసీ ఫోకస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. షెడ్యూల్ ఫిక్స్ కాకపోవడం కారణమని పైకి చెబుతున్నా.. హైబ్రిడ్ మోడల్‌కు పాక్ బోర్డు ఒప్పుకోకపోవడం, టీమిండియాను పాకిస్థాన్‌కు పంపేది లేదని బీసీసీఐ కరాఖండీగా తేల్చిచెప్పడంతోనే ఐసీసీ ఈ డెసిషన్ తీసుకోవాలని డిసైడ్ అయినట్లు క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. కాగా, వచ్చే ఏడాది ఫిబ్రవరి 19వ తేదీ నుంచి మార్చి 9వ తేదీల మధ్య ఈ బడా టోర్నీ నిర్వహణకు ముసాయిదా షెడ్యూల్‌ను ఇప్పటికే అత్యున్నత క్రికెట్ బోర్డుకు అందజేసింది పీసీబీ. కానీ టీమిండియా మ్యాచుల కోసం హైబ్రిడ్ మోడల్ కావాలని బీసీసీఐ నుంచి ప్రతిపాదనలు రావడంతో పాక్ బోర్డు దీనికి ఒప్పుకోలేదు. దీంతో టోర్నీ నిర్వహణ మీద సందిగ్ధత కొనసాగుతోంది.
Also Read:
75 బంతుల్లో 150 నాటౌట్.. బాదుడులో రోహిత్‌ను మించిపోయిందిగా..
ఆసీస్ సిరీస్‌లో రోహిత్ ఆడతాడా లేదా.. తేల్చేసిన రితికా
టాప్ లేపాల్సిందే..
For More Sports And Telugu News