ICC New Rules: క్రికెట్‌లో మరోసారి ఐసీసీ కొత్త నిబంధనలు.. అవేంటంటే..?
ABN , Publish Date - Jan 05 , 2024 | 05:57 PM
క్రికెట్‌లో ఎప్పటికప్పుడు ఐసీసీ కొత్త నిబంధనలను ప్రవేశపెడుతూనే ఉంది. తాజాగా మరికొన్ని నిబంధనలను ఐసీసీ అమల్లోకి తీసుకువచ్చింది. గతంలో ఫీల్డింగ్ జట్టు స్టంపౌంట్ కోసం అప్పీల్ చేసినప్పుడు స్టంపౌంట్‌తో పాటు క్యాచ్ అవుట్‌ను కూడా సమీక్షించేవారు. కానీ కొత్త నిబంధన ప్రకారం కేవలం స్టంపౌంట్‌ను మాత్రమే పరిశీలించనున్నారు.
క్రికెట్‌లో ఎప్పటికప్పుడు ఐసీసీ కొత్త నిబంధనలను ప్రవేశపెడుతూనే ఉంది. తాజాగా మరికొన్ని నిబంధనలను ఐసీసీ అమల్లోకి తీసుకువచ్చింది. గతంలో ఫీల్డింగ్ జట్టు స్టంపౌంట్ కోసం అప్పీల్ చేసినప్పుడు స్టంపౌంట్‌తో పాటు క్యాచ్ అవుట్‌ను కూడా సమీక్షించేవారు. కానీ కొత్త నిబంధన ప్రకారం కేవలం స్టంపౌంట్‌ను మాత్రమే పరిశీలించనున్నారు. క్యాచ్ అవుట్‌ను కూడా చెక్ చేయడంతో డీఆర్ఎస్ లేకుండానే ఫీల్డింగ్ జట్టు లబ్ధి పొందుతుందని ఆరోపణలు రావడంతో ఈ నిబంధనలో ఐసీసీ మార్పులు చేసింది. ఒకవేళ క్యాచ్ అవుట్‌పై ఫీల్డింగ్ జట్టుకు ఏవైనా సందేహాలు ఉంటే వాళ్లు డీఆర్ఎస్ తీసుకోవాల్సి ఉంటుందని ఐసీసీ వెల్లడించింది.
మరోవైపు కంకషన్ రూల్‌లోనూ ఐసీసీ స్వల్ప మార్పులు చేసింది. ప్లేయర్ తలకు గాయమైతే కంకషన్ రూల్ కింద సబ్‌స్టిట్యూట్ ఆటగాడికి అనుమతి ఇస్తారు. అలా సబ్‌స్టిట్యూట్ ఆటగాడు బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్ చేయవచ్చు. కానీ కంకషన్‌కు గురైన ఆటగాడు బౌలింగ్ నిషేధానికి గురైతే.. సబ్‌స్టిట్యూట్ ఆటగాడికి కూడా బౌలింగ్ అవకాశం ఉండకుండా ఐసీసీ తన నిబంధనలో మార్పులు చేసింది. అటు అన్ని రకాల ఫుట్ నోబాల్స్‌ను థర్డ్ అంపైర్ సమీక్షించాలని ఐసీసీ తెలిపింది. అంతేకాకుండా మైదానంలో గాయపడ్డ ఆటగాడికి వైద్యం అందించే సమయంపైనా ఐసీసీ టైమ్ లిమిట్ పెట్టింది. వైద్య సహాయం కోసం నాలుగు నిమిషాల సమయం తీసుకోవచ్చని ఐసీసీ స్పష్టం చేసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.