Share News

IND vs AUS: పెర్త్ టెస్ట్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. మళ్లీ శనిలా దాపురించాడు

ABN , Publish Date - Nov 21 , 2024 | 04:07 PM

IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీకి సర్వం సిద్ధమైంది. రెండు భీకర ప్రత్యర్థుల మధ్య మరికొన్ని గంటల్లో సంకుల సమరం జరగనుంది. అయితే తొలి టెస్ట్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలింది.

IND vs AUS: పెర్త్ టెస్ట్‌కు ముందు టీమిండియాకు బిగ్ షాక్.. మళ్లీ శనిలా దాపురించాడు

BGT 2024: రెండు కొదమ సింహాలు కొట్లాడితే ఎలా ఉంటుందో తెలుసా? అలా ఉంటుంది భారత్-ఆస్ట్రేలియా తలపడితే. ప్రస్తుత క్రికెట్‌లో హవా చలాయిస్తున్న ఈ టాప్ టీమ్స్ మధ్య ఫైట్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. బరిలోకి దిగితే వేటకు దిగిన చిరుత పులిలా పంజా విసిరే వీటి మధ్య పోరాటానికి సర్వం సిద్ధమైంది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా శుక్రవారం ఈ రెండు జట్లు రేపు తలపడనున్నాయి. పెర్త్ ఆతిథ్యం ఇస్తున్న తొలి టెస్ట్‌లో గెలిచి నాలుగు టెస్టుల సిరీస్‌లో ఆధిక్యంలోకి దూసుకెళ్లాలని చూస్తున్నాయి. అయితే సరిగ్గా మొదటి టెస్ట్ ఆరంభానికి ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.


ఐరన్‌లెగ్

పెర్త్ టెస్ట్‌కు ముందు భారత్‌కు గట్టి షాక్ తగిలింది. మనకు శనిలా దాపురించిన ఓ ఐరన్‌లెగ్ అంపైర్ తిరిగొచ్చేశాడు. బీజీటీ-2024 సిరీస్ మొత్తం విధులు నిర్వహించనున్నాడీ అంపైర్. అతడే రిచర్డ్ కెటిల్‌బరో. ఈ పేరు వింటేనే భారత అభిమానులు ఆగ్రహంతో ఊగిపోతారు. అతడు అంపైర్‌గా వ్యవహరించిన అన్ని ఐసీసీ నాకౌట్ మ్యాచెస్‌లో మెన్ ఇన్ బ్లూ ఓడటమే దీనికి కారణం. టీ20 ప్రపంచ కప్-2014 ఫైనల్, టీ20 వరల్డ్ కప్-2016 ఫైనల్, వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్‌లో భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచులన్నింటికీ కెటిల్‌బరోనే అంపైర్‌గా ఉన్నాడు.


టెన్షన్ పెడుతున్నాడు

కెటిల్‌బరో అంపైర్‌గా ఉన్న అన్ని ఐసీసీ నాకౌట్ ఫైట్స్‌లో భారత్ ఓడటంతో అతడ్ని అభిమానులు ఐరన్‌లెగ్‌గా చూస్తారు. అలాంటోడు ఇప్పుడు ఆసీస్‌తో సిరీస్‌కు రావడంతో ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. గత పర్యటనల్లో కంగారూలపై గెలిచామని, మళ్లీ సక్సెస్ స్టోరీ రిపీట్ అవుతుందని అనుకుంటే.. కెటిల్‌బరో శనిలా దాపురించాడని అంటున్నారు. ఇంక సిరీస్ పోయినట్లే అని కామెంట్స్ చేస్తున్నారు. ఆల్రెడీ కివీస్ చేతుల్లో వైట్‌వాష్ అవడం, రోహిత్ శర్మ అందుబాటులో లేడనే టెన్షన్‌లో ఉంటే కొత్తగా ఈ సమస్య ఏంటని భయపడుతున్నారు. అయితే ఆందోళన అక్కర్లేదని.. రీసెంట్ పొట్టి వరల్డ్ కప్‌లో కెటిల్‌బరో అంపైర్‌గా ఉన్నా నెగ్గామని.. అతడు మనకు లక్కీ మస్కట్‌గా మారాడని నెటిజన్స్ చెబుతున్నారు. కాగా, బీజీటీ మ్యాచులకు కెటిల్‌బరోతో పాటు క్రిస్ గెఫానీ ఫీల్డ్ అంపైర్లుగా ఎంపికయ్యారు.


Also Read:

ఒలింపిక్స్‌ ఆతిథ్య రేసులో ఆగ్రా!

బాప్‌రే..కోహ్లీ బ్యాట్‌ ఖరీదు!

నితీశ్‌ టెస్ట్‌ అరంగేట్రం ఖాయం?

For More Sports And Telugu News

Updated Date - Nov 21 , 2024 | 04:13 PM