Share News

Jasprit Bumrah: బుమ్రాకు సారీ చెప్పిన ఫిమేల్ కామెంటేటర్.. అసలేంటీ కాంట్రవర్సీ..

ABN , Publish Date - Dec 16 , 2024 | 02:35 PM

భారత పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రాకు ఓ మహిళా కామెంటేటర్ క్షమాపణలు చెప్పింది. అసలు బుమ్రాకు ఆమె ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చింది? ఏంటా కాంట్రవర్సీ అనేది ఇప్పుడు చూద్దాం..

Jasprit Bumrah: బుమ్రాకు సారీ చెప్పిన ఫిమేల్ కామెంటేటర్.. అసలేంటీ కాంట్రవర్సీ..
Jasprit Bumrah

టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రాను ఓ మహిళా కామెంటేటర్ క్షమాపణలు కోరింది. తాను కావాలని అనలేదంటూ అతడికి సారీ చెప్పింది. జరిగిందేదో జరిగింది, వదిలేయాలని రిక్వెస్ట్ చేసింది. తాను ఒకటి మాట్లాడితే.. సోషల్ మీడియాలో ఇంకో విధంగా వైరల్ అయిందని, తప్పుడు ఉద్దేశంతో తాను అనలేదని వాపోయింది. అసలు ఎవరా కామెంటేటర్? ఆమె బుమ్రాకు ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చింది? ఏంటా కాంట్రవర్సీ? అనేది ఇప్పుడు వివరంగా చూద్దాం..


రెస్పెక్ట్ ఇస్తా

బుమ్రాకు సారీ చెప్పింది ప్రముఖ కామెంటేటర్ ఇషా గుహ. జస్‌ప్రీత్ సహా టీమిండియాకు ఆడిన గొప్ప ఆటగాళ్లందర్నీ తాను ప్రశంసించానని.. వాళ్లు అంటే తనకు ఎంతో ఇష్టం అని తెలిపింది. ఈ ఆట కోసం తమ జీవితాలను ధారపోసిన ప్లేయర్లు అంటే తనకు గౌరవం ఉందని ఆమె చెప్పుకొచ్చింది. తన మాటల్ని పూర్తిగా వింటే ఈ విషయం అర్థమవుతుందని పేర్కొంది ఇషా గుహ. బుమ్రా ఘనతల్ని పొగిడేందుకు ప్రయత్నించానని.. కానీ తాను వాడిన పదాలు తప్పుడు అర్థాలకు దారితీశాయని వాపోయింది. తనను క్షమించాలని కోరింది.


బుమ్రా ఓ కోతి

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ కామెంటేటర్స్‌లో ఇషా గుహ కూడా ఉంది. గబ్బా టెస్ట్‌కు కామెంట్రీ చేస్తూ బుమ్రా గురించి ఆమె అభ్యంతకర కామెంట్ చేసింది. కోతి లేదా జంతువు అనే అర్థం వచ్చేలా అతడ్ని సంబోధించింది. దీంతో ఇది కాస్తా కాంట్రవర్సీకి దారితీసింది. అంత తోపు బౌలర్‌ను అలా పిలవడం ఏంటని ఇషాపై విరుచుకుపడుతున్నారు నెటిజన్స్. జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన ఆమెను వదిలేది లేదంటూ సీరియస్ అవుతున్నారు. ఇదే విషయంపై ఆమె తాజాగా రియాక్ట్ అవుతూ సారీ చెప్పింది. ఇషా క్షమాపణలు కోరడంపై టీమిండియా మాజీ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు. లైవ్‌లో అందరూ చూస్తుండగా సారీ చెప్పడం గ్రేట్ అని ఆమెను మెచ్చుకున్నాడు. దీనికి ఎంతో ధైర్యం కావాలన్నాడు.


Also Read:

మిచెల్ మార్ష్ అద్భుతం.. గాల్లో పక్షిలా ఎగురుతూ పట్టేశాడు

జైస్వాల్ కొంపముంచిన నోటిదూల.. తగ్గకపోతే కెరీర్ ఫినిష్

పదే పదే అదే తప్పు.. కోహ్లీ.. ఇక మారవా..

For More Sports And Telugu News

Updated Date - Dec 16 , 2024 | 02:41 PM