Share News

Jasprit Bumrah: చెప్పాడు.. చేశాడు.. మాట నిలబెట్టుకున్న బుమ్రా

ABN , Publish Date - Dec 18 , 2024 | 08:56 AM

Jasprit Bumrah: టీమిండియా ఏస్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తాను చెప్పింది చేస్తానని అతడు నిరూపించాడు. ఇంతకీ బుమ్రా ఇచ్చిన ఆ మాట ఏంటి? అనేది ఇప్పుడు చూద్దాం..

 Jasprit Bumrah: చెప్పాడు.. చేశాడు.. మాట నిలబెట్టుకున్న బుమ్రా
Jasprit Bumrah

IND vs AUS: టీమిండియా ఏస్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా మాట ఇస్తే వెనక్కిపోడు. తన ప్రత్యర్థులకు చెప్పి మరీ కొట్టడంలో అతడు సిద్ధహస్తుడు. అందుకే బుమ్రాతో పెట్టుకోవాలంటే అందరూ జంకుతారు. ఎక్కడ తమ కెరీర్ ఫినిష్ చేసేస్తాడో అని భయపడతారు. అలాంటి బుమ్రా మరోమారు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాడు. తాను చెప్పింది చేస్తానని అతడు నిరూపించాడు. ఇంతకీ బుమ్రా ఇచ్చిన ఆ మాట ఏంటి? అతడు దాన్ని ఎలా నిలబెట్టుకున్నాడు? అనేది ఇప్పుడు చూద్దాం..


గండం నుంచి గట్టెక్కించాడు

బ్యాటింగ్ అంటే ఏంటో చూపిస్తానంటూ జర్నలిస్టులకు ఇచ్చిన మాటను బుమ్రా నిలబెట్టుకున్నాడు. ఆస్ట్రేలియాతో గబ్బా వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో సూపర్బ్ నాక్‌తో అలరించాడు. 38 బంతులు ఎదుర్కొన్న పేసుగుర్రం.. 1 సిక్స్ సాయంతో 10 పరుగులు చేశాడు. రన్స్ పరంగా అతడు పెద్దగా ఏమీ చేయలేదని అనిపించొచ్చు. కానీ ఫాలోఆన్ గండం నుంచి టీమ్‌ను గట్టెక్కించాడు. మరో టెయిలెండర్ ఆకాశ్‌‌దీప్ (44 బంతుల్లో 33) సాయంతో జట్టను ఒడ్డున చేర్చాడు.


నా రికార్డులు తెలుసా?

ఆసీస్ బౌలర్లకు ఎదురొడ్డి వికెట్ పోకుండా బుమ్రా ఆడిన తీరు, ఫాలోఆన్ గండం నుంచి గట్టెక్కించిన విధానానికి అందరూ ఫిదా అయిపోయారు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నావని ప్రశంసిస్తున్నారు. కాగా, గబ్బా టెస్ట్ మూడో రోజు ముగిశాక ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత బ్యాటింగ్ గురించి బుమ్రా మాట్లాడాడు. అయితే బ్యాటింగ్ గురించి మీరు మాట్లాడటం ఏంటి? మీకు రాదనే ఉద్దేశం వచ్చేలా ఓ విలేకరి బుమ్రా మీద కామెంట్ చేశాడు. దీంతో టెస్టుల్లో ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు కొట్టిన బ్యాటర్ తానేనని.. వెళ్లి గూగుల్‌లో తన రికార్డులు చూసుకోమని బుమ్రా ఇచ్చిపడేశాడు. తానేంటో చూస్తారంటూ చెప్పాడు. గ్రౌండ్‌లోకి దిగాక బ్యాట్‌తో రఫ్ఫాడించాడు. కాగా, ఇంగ్లండ్ మీద 2022లో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఒకే ఓవర్‌లో 35 పరుగులు బాదాడు బుమ్రా.


Also Read:

దేవుడా.. ఇంకెన్ని చేయాలి!

గెలిచినంత సంబరం

గుకేష్‌కు ఘన సన్మానం

For More Sports And Telugu News

Updated Date - Dec 18 , 2024 | 09:00 AM