Share News

KL Rahul: కేఎల్ రాహుల్ క్లాసిక్ బ్యాటింగ్.. ఇది శానాకాలం యాదుంటది

ABN , Publish Date - Dec 17 , 2024 | 02:39 PM

KL Rahul: టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ క్లాసిక్ నాక్‌తో అలరించాడు. కష్టాల్లో ఉన్న జట్టును అతడు ఒడ్డున పడేశాడు. ఎన్ని ఇన్నింగ్స్‌లు ఉన్నా వాటి కంటే ఇది చాలా స్పెషల్ అనే చెప్పాలి.

KL Rahul: కేఎల్ రాహుల్ క్లాసిక్ బ్యాటింగ్.. ఇది శానాకాలం యాదుంటది
KL Rahul

టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఇప్పటికే ఎన్నో మంచి ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఇందులో కొన్ని చిరస్మరణీయ ఇన్నింగ్స్‌లు కూడా ఉన్నాయి. సొంతగడ్డపై కంటే విదేశాల్లో అందునా సేనా (సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో అతడి బ్యాట్ నుంచి బ్యూటిఫుల్ నాక్స్ చాలా వచ్చాయి. తాజాగా అతడు ఇలాంటి గుర్తుండిపోయే నాక్ మరొకటి ఆడాడు. గబ్బా వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో క్లాసిక్ బ్యాటింగ్‌తో అలరించాడు రాహుల్.


క్రీజులో పాతుకుపోయాడు

139 బంతులు ఎదుర్కొన్న రాహుల్.. 84 పరుగులు చేశాడు. ఇందులో 8 బౌండరీలు ఉన్నాయి. ఓపెనర్‌గా వచ్చిన ఈ స్టైలిష్ బ్యాటర్.. ఆరో వికెట్‌గా వెనుదిరిగాడు. వచ్చిన బ్యాటర్ వచ్చినట్లు పెవిలియన్‌కు క్యూ కడుతున్నా రాహుల్ మాత్రం ధైర్యంగా నిలబడ్డాడు. ఒక ఎండ్‌లో అతడు పాతుకుపోయాడు. కంగారూ బౌలర్లు నిప్పులు చెరిగే బంతులతో భయపెట్టినా, వర్షం పదే పదే పరీక్ష పెట్టినా అతడు ఫైటర్‌లా పోరాడాడు. ఫోర్లు, సిక్సుల జోలికి వెళ్లకుండా స్ట్రైక్ రొటేషన్ ధ్యేయంగా బ్యాటింగ్ చేశాడు. రవీంద్ర జడేజా (77)తో కలసి టీమ్‌ను ఫాలో ఆన్ బారి నుంచి కాపాడాడు. ఆసీస్ జట్టుకు అతడు ఎదురొడ్డి ఆడిన విధానం, పార్ట్‌నర్‌షిప్స్‌తో టీమ్‌ను నడిపించిన తీరుకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ ఇన్నింగ్స్ శానా యేండ్లు యాదుంటది అని అంటున్నారు.


Also Read:

జడేజా బ్యాట్‌పై గుర్రం బొమ్మ.. దీని వెనుక పెద్ద చరిత్రే ఉంది

స్మిత్ స్టన్నింగ్ క్యాచ్.. చూసితీరాల్సిన వీడియో ఇది..

బచ్చా బౌలర్ డబుల్ హ్యాట్రిక్.. తోపుల వల్ల కానిది సాధించాడు

For More Sports And Telugu News

Updated Date - Dec 17 , 2024 | 02:42 PM