Share News

Nitish Kumar Reddy: లబుషేన్‌ను వణికించిన తెలుగోడు.. చావుదెబ్బ కొట్టాడు

ABN , Publish Date - Dec 15 , 2024 | 10:37 AM

ఆస్ట్రేలియాకు తెలుగోడి దెబ్బ ఎలా ఉంటుందో మరోమారు రుచి చూపించాడు నితీష్ కుమార్ రెడ్డి. ఆ టీమ్ స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను ఆటాడుకున్నాడు నితీష్. ఆసీస్‌ను చావుదెబ్బ కొట్టాడు.

Nitish Kumar Reddy: లబుషేన్‌ను వణికించిన తెలుగోడు.. చావుదెబ్బ కొట్టాడు
Nitish Kumar Reddy

IND vs AUS: ఆస్ట్రేలియా వర్సెస్ తెలుగు వాళ్లు.. ఇది ఎవర్‌గ్రీన్ బ్యాటిల్‌గా ఉంటూ వస్తోంది. మహ్మద్ అజహరుద్దీన్ నుంచి వెరీ వెరీ స్పెషల్ లక్ష్మణ్ వరకు.. కంగారూ టీమ్‌ను వణికించడంలో తెలుగు ఆటగాళ్లు ముందంజలో ఉంటూ వచ్చారు. ముఖ్యంగా లక్ష్మణ్ పేరు చెబితేనే ఆసీస్ వెన్నులో వణుకు పుడుతుంది. ఇప్పుడు అతడి వారసత్వాన్ని మరో తెలుగోడు నితీష్ కుమార్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో కంగారూలను భయపెడుతున్నాడు. తెలుగోడి దెబ్బ ఏంటో మరోమారు ఆ టీమ్‌కు రుచి చూపించాడు.


ఊరించే బంతులతో..

పెర్త్, అడిలైడ్ టెస్ట్‌లో ఆసీస్‌ను కంగారెత్తించిన నితీష్ రెడ్డి.. గబ్బా టెస్ట్‌లోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేస్తున్నాడు. మొదటి ఇన్నింగ్స్‌లో స్టార్ బ్యాటర్ మార్నస్ లబుషేన్‌ను భయపెట్టి ఔట్ చేశాడు నితీష్. 55 బంతుల్లో 12 పరుగులు చేసిన ఆసీస్ బ్యాటర్.. తెలుగోడి బౌలింగ్‌లో విరాట్ కోహ్లీకి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. అప్పటికే మహ్మద్ సిరాజ్ సహా ఇతర బౌలర్లు తీవ్రంగా ఇబ్బంది పెట్టడంతో పరుగులు చేయలేక సతమతమయ్యాడు లబుషేన్. ఆ తరుణంలో బౌలింగ్‌కు దిగిన నితీష్.. డాట్ బాల్స్‌తో టెన్షన్ పెట్టాడు. ఆ తర్వాత ఔట్ ఆఫ్ ది ఆఫ్ స్టంప్స్‌లో ఊరించే బంతులతో అతడ్ని రెచ్చగొట్టాడు. దీంతో వలలో చిక్కిన లబుషేన్.. వదిలేయాల్సిన బాల్‌ను షాట్ ఆడేందుకు ప్రయత్నించి స్లిప్స్‌లో కోహ్లీకి క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు.


Also Read:

ఆ గొడవ మర్చిపోని సిరాజ్


57 ఏళ్ల తర్వాత..

నా పెళ్లికి రండి

ఫైనల్లో భారత్‌ X చైనా

For More Sports And Telugu News

Updated Date - Dec 15 , 2024 | 10:40 AM