Share News

Ravindra Jadeja: జడేజా బ్యాట్‌పై గుర్రం బొమ్మ.. దీని వెనుక పెద్ద చరిత్రే ఉంది

ABN , Publish Date - Dec 17 , 2024 | 01:39 PM

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బ్యాట్ గురించి ఇప్పుడంతా డిస్కస్ చేస్తున్నారు. ఆ బ్యాట్ మీద ఉన్న గుర్రం బొమ్మ వైరల్ అవుతోంది. అయితే ఇది సాదాసీదా గుర్రం కాదు.. ఎంతో చరిత్ర ఉన్న ప్రసిద్ధమైన అశ్వం.

Ravindra Jadeja: జడేజా బ్యాట్‌పై గుర్రం బొమ్మ.. దీని వెనుక పెద్ద చరిత్రే ఉంది
Ravindra Jadeja

అందరు ఆటగాళ్లలాగే క్రికెటర్లకు కూడా చాలా సెంటిమెంట్స్ ఉంటాయి. దాన్ని వాళ్లు గ్రౌండ్‌లో కూడా చూపిస్తుంటారు. బ్యాటింగ్ చేసే సమయంలో, బౌలింగ్ చేసే సమయంలో లేదా సెలబ్రేషన్ టైమ్‌లో దీన్ని చూడొచ్చు. తాము వాడే బ్యాట్ దగ్గర నుంచి ప్యాడ్స్, హెల్మెట్, గ్లౌవ్స్ వరకు తమకు నచ్చిన విషయాలు, సెంటిమెంట్స్‌ను ఫాలో అవుతుంటారు. కొందరు కిట్ బ్యాగ్‌లో దేవుళ్ల ఫొటోలు పెడితే, కొందరు ప్యాంట్ జేబులో కర్చీఫ్ పెడుతుంటారు. ఇంకొందరు టాటూలు వేసుకుంటారు. అయితే టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా మాత్రం వీళ్లకు భిన్నంగా తన బ్యాట్ మీద గుర్రం బొమ్మ వేయించాడు. అయితే ఇది సాదాసీదా గుర్రం కాదు. దీని వెనుక బిగ్ స్టోరీ ఉంది.


యుద్ధాల్లో కీలక పాత్ర

రవీంద్ర జడేజా బ్యాట్ గురించి ఇప్పుడంతా డిస్కస్ చేస్తున్నారు. ఆ బ్యాట్ మీద ఉన్న గుర్రం బొమ్మ వైరల్ అవుతోంది. అయితే ఇది మామూలు గుర్రం కాదు.. ఎంతో చరిత్ర ఉన్న ప్రసిద్ధమైన అశ్వం. దీన్ని మార్వాడీ గుర్రం అని పిలుస్తారు. ఉత్తర భారతదేశంలో ఎక్కువగా కనిపించే ఈ గుర్రాలకు మేలిజాతి అశ్వాలుగా పేరుంది. మన దేశంలోని బెస్ట్ గుర్రాలుగా వీటిని చెబుతుంటారు. అప్పట్లో యుద్ధాల్లో వీటిని బాగా వినియోగించేవారు. మార్వార్, జైపూర్, జోధ్‌పూర్ సామ్రాజ్యాల్లో ఈ గుర్రాలు లేకుండా యుద్ధాలు జరిగేవి కాదని అంటుంటారు.


రాజ్‌పుత్ యోధులు

మార్వాడీ గుర్రాలను మల్లనీ గుర్రాలు అని కూడా పిలుస్తారు. ఈ గుర్రాల్లో మగవి సుమారుగా 365 కిలోల వరకు ఉంటాయి. అదే ఆడ గుర్రాలైతే దాదాపుగా 340 కిలోల దాకా ఉంటాయి. గుజరాత్, రాజస్థాన్‌లో వీటి వాడకం బాగా ఉండేది. ముఖ్యంగా రాజ్‌పుత్ యోధులు వీటి మీద సవారీ చేస్తూ యుద్ధాల్లో పైచేయి సాధించేవారని చరిత్రకారులు చెబుతుంటారు. అలాంటి ఎంతో ఘనచరిత్ర కలిగిన గుర్రం బొమ్మను జడ్డూ తన బ్యాట్ మీద వేయించుకున్నాడు. ఈ భారత స్టార్ గుర్రాలను ఎక్కువగా ఇష్టపడతాడు. అందుకే తాజాగా బ్యాట్ మీద గుర్రం బొమ్మతో అందరీకి సర్‌ప్రైజ్ ఇచ్చాడు. కాగా, గబ్బా టెస్ట్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఈ బ్యాట్‌తో అతడు చెలరేగాడు. 123 బంతుల్లో 77 పరుగుల విలువైన ఇన్నింగ్స్‌తో టీమ్‌ను గట్టెక్కించాడు.


Also Read:

బచ్చా బౌలర్ డబుల్ హ్యాట్రిక్.. తోపుల వల్ల కానిది సాధించాడు

ఆస్ట్రేలియాకు ఊహించని ఎదురుదెబ్బ.. మ్యాచ్ మధ్యలోనే..

ఆసీస్‌ను రెచ్చగొట్టిన జడేజా.. బ్యాట్‌ను కత్తిలా తిప్పుతూ..

For More Sports And Telugu News

Updated Date - Dec 17 , 2024 | 01:44 PM