IND vs SA: టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్ న్యూస్.. ఒకటి అనుకుంటే ఇంకేదో..
ABN , Publish Date - Nov 10 , 2024 | 01:04 PM
టీమిండియా అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఫ్యాన్స్ ఒకటి అనుకుంటే ఇంకొకటి అయ్యేలా ఉంది. వాళ్లు ఊహించనిది జరిగేలా ఉంది. వాళ్ల ఆశలు అడియాశలు అవడం ఖాయంగా కనిపిస్తోంది.
న్యూజిలాండ్ సిరీస్‌లో ఓటమితో తీవ్ర విమర్శల పాలవుతున్న భారత జట్టుకు సౌతాఫ్రికా టూర్‌తో కాస్త ఉపశమనం లభించింది. కివీస్ సిరీస్ వైఫల్యం నుంచి బయటపడేందుకు, మళ్లీ విజయాల బాట పట్టి అభిమానులను సంతృప్తి పర్చేందుకు ప్రొటీస్ సిరీస్ బాగా ఉపయోగపడుతోంది. ఆ జట్టుతో డర్బన్ వేదికగా జరిగిన తొలి టీ20లో సూర్య సేన ఘనవిజయం సాధించింది. ఓపెనర్ సంజూ శాంసన్ విధ్వంసక సెంచరీతో మ్యాచ్‌ను వన్‌సైడ్ చేసేశాడు. ప్రత్యర్థికి ఎక్కడా అవకాశం ఇవ్వని టీమిండియా.. ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్‌తో గ్రాండ్ విక్టరీ కొట్టింది. నాలుగు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో ఉన్న మెన్ ఇన్ బ్లూ ఇదే ఊపులో రెండో మ్యాచ్‌లోనూ విజయకేతనం ఎగురవేయాలని చూస్తోంది. అభిమానులు కూడా భారత ఆటగాళ్ల ప్రదర్శనను చూసి ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. కానీ వాళ్లకు బ్యాడ్ న్యూస్.
వరుణుడు ఏం చేస్తాడో..
గెబేహా ఆతిథ్యం ఇస్తున్న రెండో టీ20కి వర్షం ముప్పు పొంచి ఉంది. ఈ మ్యాచ్ జరగడం కష్టంగానే కనిపిస్తోంది. మ్యాచ్ మొదలవడానికి ముందే వరుణుడు ఇబ్బంది పెట్టే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వాన కారణంగా టాస్ ఆలస్యమయ్యే ప్రమాదం ఉంది. టైమ్‌కు టాస్ వేసినా.. ఫస్ట్ ఇన్నింగ్స్ మధ్యలో వరుణుడు గేమ్‌కు అంతరాయం కలిగించే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ మధ్యలో ఒకట్రెండు గంటల పాటు వర్షం కురిస్తే తిరిగి గ్రౌండ్‌ను రెడీ చేయడానికి సమయం పడుతుంది. ఈలోపు మళ్లీ వాన పడితే మ్యాచ్ సాగడం కష్టమే.
ఓవర్లు కుదిస్తారా?
వర్షం కారణంగా మ్యాచ్ పూర్తి స్థాయిలో సాధ్యం కాకపోతే కనీసం 5 ఓవర్ల గేమ్‌నైనా పెట్టే ఛాన్స్ ఉంది. ఒకవేళ అది కూడా కుదరకపోతే అప్పుడు రద్దు చేస్తారు. దీంతో టీమిండియా మిగిలిన రెండు టీ20ల్లో ఒక్కటి నెగ్గినా సిరీస్ సొంతమవుతుంది. అయితే సిరీస్ రిజల్ట్‌ను పక్కనబెడితే.. ఆదివారం సెలవు కావడంతో భారత స్టార్ల ఆట చూసి ఎంజాయ్ చేద్దామని అభిమానులు, ఆడియెన్స్ అనుకున్నారు. కానీ వాన గండం పొంచి ఉండటంతో మ్యాచ్ ఎంతవరకు జరుగుతుందో చెప్పలేని పరిస్థితి. దీంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు. ఒకటి అనుకుంటే, ఇంకొకటి అయ్యేలా ఉందని వర్రీ అవుతున్నారు. మరి.. వరుణుడు అడ్డుపడతాడో, కరుణించి ఆటకు అవకాశం ఇస్తాడో చూడాలి.
Also Read:
ఛాంపియన్స్ ట్రోఫీపై తేల్చేసిన ఐసీసీ
ఆసీస్ సిరీస్‌లో రోహిత్ ఆడతాడా లేదా.. తేల్చేసిన రితికా
75 బంతుల్లో 150 నాటౌట్.. బాదుడులో రోహిత్‌ను మించిపోయిందిగా..
For More Sports And Telugu News