Share News

IND vs AUS: ఆసీస్‌పై భారత్ బ్రహ్మాస్త్రం.. దీన్ని ఛేదించాలంటే మొనగాళ్లు కావాలి

ABN , Publish Date - Nov 20 , 2024 | 09:22 PM

IND vs AUS: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని మరోమారు కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది టీమిండియా. అయితే సొంతగడ్డపై పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును ఓడించడం అంత ఈజీ కాదు. అందుకే బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీస్తోందట.

IND vs AUS: ఆసీస్‌పై భారత్ బ్రహ్మాస్త్రం.. దీన్ని ఛేదించాలంటే మొనగాళ్లు కావాలి

BGT 2024: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీని మరోమారు కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉంది టీమిండియా. అయితే సొంతగడ్డపై పటిష్టమైన ఆస్ట్రేలియా జట్టును ఓడించడం అంత ఈజీ కాదు. గత పర్యటనల్లో కంగారూల మెడలు వంచినప్పటికీ ఈసారి అటు నుంచి గట్టి కౌంటర్ ఖాయంగా కనిపిస్తోంది. ముందే న్యూజిలాండ్ సిరీస్‌లో వైట్‌వాష్ అవడంతో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కాబట్టి ఈ సిరీస్‌లో గెలుపు ప్రతిష్టాత్మకంగా మారింది. అయితే అన్ని విభాగాల్లోనూ బలంగా ఉన్న ఆతిథ్య జట్టు మెడలు వంచేందుకు టీమిండియా గట్టి ప్లాన్ వేస్తోందని తెలిసింది. బ్రహ్మాస్త్రాన్ని బయటకు తీస్తోందని సమాచారం. మరి.. టీమిండియా ఎక్కుపెడుతున్న ఆ బ్రహ్మాస్త్రం ఏంటో ఇప్పుడు చూద్దాం..


ప్రయోగానికి సిద్ధం

ఆస్ట్రేలియాను వాళ్ల స్ట్రెంగ్త్‌తోనే దెబ్బతీయాలని చూస్తోంది టీమిండియా. కంగారూ పిచ్‌లు పేస్, అనూహ్యమైన బౌన్స్, స్వింగ్‌కు బాగా ఫేమస్. ఆ జట్టు నిండా గట్టి పేసర్లు ఉంటారు. దీంతో సొంతగడ్డపై అలవాటైన కండీషన్స్‌లో ప్రత్యర్థి జట్లను భయపెడుతుంటుంది ఆసీస్. ఇప్పుడు ఇదే బలంతో ఆ టీమ్‌ను కొట్టేందుకు రెడీ అవుతోంది మెన్ ఇన్ బ్లూ. పేస్ బౌలింగ్ వెపన్‌ను ఆతిథ్య జట్టుపై ప్రయోగించేందుకు సన్నద్ధం అవుతోంది. తాత్కాలిక సారథి జస్‌ప్రీత్ బుమ్రా నేతృత్వంలో మహ్మద్ సిరాజ్, ఆకాశ్‌దీప్, హర్షిత్ రాణాతో కంగారూలను కంగారెత్తించాలని భావిస్తోంది. ముఖ్యంగా ఆకాశ్‌దీప్, హర్షిత్‌ను బ్రహ్మాస్త్రాలుగా భావిస్తోందట.


ఇద్దరూ ఇద్దరే

ఆకాశ్‌దీప్ ఆల్రెడీ తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు. క్వాలిటీ పేస్‌తో మంచి లైన్ అండ్ లెంగ్త్ పట్టుకొని బౌలింగ్ చేస్తూ తనలో పస ఎంత ఉందో చూపించాడు. రిథమ్‌లో బౌలింగ్ చేయడమే గాక బంతిని రెండు వైపులా స్వింగ్ చేస్తూ తాను ఎంత డేంజరస్ బౌలర్‌ అనేది నిరూపించాడు. వెటరన్ పేసర్ మహ్మద్ షమీకి తానే రీప్లే్స్‌మెంట్ అని చాటిచెప్పాడు. అందుకే అతడ్ని ప్రధాన ఆయుధంగా వాడుకోవాలని అనుకుంటోందట టీమ్ మేనేజ్‌మెంట్. అతడితో పాటు యంగ్ పేసర్ హర్షిత్ మీద కూడా నమ్మకం ఉంచిందట. పొడగరి అయిన హర్షిత్ పేస్‌తో పాటు వేరియేషన్స్‌తో బ్యాటర్లను ముప్పుతిప్పలు పెట్టగలడు. బాల్‌ను స్వింగ్ కూడా చేయగలడు. అనూహ్యమైన బౌన్స్ ఉన్న చోట అతడ్ని ఎదుర్కోవడం తోపు బ్యాటర్లకు కూడా సవాలే.


సర్‌ప్రైజ్ ప్యాకేజ్

తాత్కాలిక సారథి బుమ్రా మీద ప్రెజర్ తగ్గించడంతో పాటు కంగారూలకు షాక్ ఇచ్చేందుకు ఆకాశ్‌దీప్, హర్షిత్ భలే ఉపయోగపడతారని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోందట. వీళ్లిద్దరి బౌలింగ్ గురించి ఆ జట్టు బ్యాటర్లకు పెద్దగా ఐడియా లేదు. అందునా టెస్టుల్లో ఎప్పుడూ ఎదుర్కొన్నది లేదు. పైగా ఈ మధ్య కాలంలో వీళ్లు బాగా ఇంప్రూవ్ అయ్యారు. ఆసీస్ కండీషన్స్ వీళ్లకు బాగా సూట్ అవుతాయి. అందుకే సర్‌ప్రైజ్ ప్యాకేజ్‌గా ఈ ఇద్దరు సీమర్లను ఆతిథ్య జట్టుపై ప్రయోగించాలని కోచ్ గంభీర్ డిసైడ్ అయ్యాడని వినిపిస్తోంది.


దబిడిదిబిడే

అవసరమైతే ఓ బ్యాటర్ లేదా స్పిన్నర్‌ను తీసేసైనా వీళ్లను ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోవాలని అనుకుంటున్నాడట. మరి.. గౌతీ బ్రహ్మాస్త్రం ఏ మేరకు సక్సెస్ అవుతుందో త్వరలో తేలిపోనుంది. అయితే పేస్ బౌలింగ్ అటాక్, ముఖ్యంగా ఇద్దరు యంగ్ పేసర్లతో ఆసీస్‌ను కొట్టాలని చూస్తున్న భారత్ ఐడియాపై నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. ఇది సరిగ్గా క్లిక్ అయితే కంగారూలకు దబిడిదిబిడేనని అంటున్నారు. బుమ్రా అండ్ బాయ్స్ లయ అందుకుంటే ఆపడం మొనగాళ్ల వల్ల కూడా కాదని కామెంట్స్ చేస్తున్నారు.


Also Read:

ఉన్న పళంగా ఆస్ట్రేలియాకు అగార్కర్.. ఆ నలుగురికి ఎర్త్ పెట్టేందుకే..

రోహిత్ వారసుడిగా రాహుల్.. ఆ టెక్నిక్ పట్టేస్తే తిరుగుండదు

కయ్యానికి కాలు దువ్వుతున్న కోహ్లీ.. పక్కా ప్లానింగ్‌తోనే ముందుకు..

For More Sports And Telugu News

Updated Date - Nov 20 , 2024 | 09:26 PM