Share News

IND vs PAK: రేపే ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్.. ఫ్రీ స్ట్రీమింగ్ అందులోనే..

ABN , Publish Date - Nov 29 , 2024 | 06:47 PM

IND vs PAK: దాయాదుల సమరానికి సర్వం సిద్ధమైంది. యుద్ధాన్ని తలపించే పోరుకు భారత్-పాకిస్థాన్ ఆటగాళ్లు రెడీ అవుతున్నారు. శనివారం జరిగే ఈ ఫైట్‌ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో తెలుసుకుందాం..

IND vs PAK: రేపే ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్.. ఫ్రీ స్ట్రీమింగ్ అందులోనే..

క్రికెట్‌లో అసలైన సమరం అంటే భారత్-పాకిస్థాన్ మ్యాచులనే చెప్పాలి. దాయాది జట్లు బరిలోకి దిగి కొదమసింహాల్లా కొట్లాడితే వచ్చే మజానే వేరు. ఇది ఇరు జట్ల అభిమానులకు ఎంతో ఎమోషనల్ మూమెంట్. గెలిచిన టీమ్ ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోతే.. ఓడిన జట్టు అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతారు. రిజల్ట్ తారుమారైతే ప్లేయర్లపై విమర్శలకు దిగడం కూడా చూస్తుంటాం. ఈ రెండు టీమ్స్ మధ్య మ్యాచ్‌ను సాధారణ పోరులా చూడలేం. అది యుద్ధం కూడా కాదు.. అంతకుమించి అనేలా ఉంటుంది. అందుకే ఆ ఫైట్ కోసం అందరూ ఎదురు చూస్తుంటారు. అలాంటి వారిని అలరించేందుకు భారత్-పాక్ ప్లేయర్లు రెడీ అయిపోయారు.


లైవ్ అందులోనే..

దాయాదుల సమరానికి సర్వం సిద్ధమైంది. యుద్ధాన్ని తలపించే పోరుకు భారత్-పాకిస్థాన్ ఆటగాళ్లు రెడీ అవుతున్నారు. అండర్-19 ఆసియా కప్-2024లో భాగంగా దుబాయ్ వేదికగా జరిగే కీలక మ్యాచ్‌లో ఈ రెండు టీమ్స్ తలపడనున్నాయి. టోర్నీలో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్ కావడంతో తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమవుతున్నాయి. శనివారం జరిగే ఈ హైఓల్టేజ్ మ్యాచ్.. ఉదయం 10.30 గంటలకు ప్రారంభం కానుంది. అండర్-19 ఆసియా కప్-2024 ఎడిషన్‌కు సంబంధించిన మ్యాచులన్నీ సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో లైవ్ టెలికాస్ట్ కానున్నాయి.


అందరి కళ్లు అతడి మీదే..

అండర్-19 ఆసియా కప్‌లో భాగంగా రేపు జరిగే భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ను సోనీ లివ్ యాప్‌లో కూడా వీక్షించొచ్చు. సోనీ టీవీ ఛానల్, సోనీ లివ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్నవారు మ్యాచుల్ని చూడొచ్చు. సబ్‌స్క్రిప్షన్ లేని వారు డబ్బులు చెల్లించాలి. అయితే ఈ మ్యాచుల్ని ఉచితంగా చూసే వెసులుబాటు కూడా ఉంది. జియో, ఎయిర్‌టెల్ యూజర్లు టోర్నీ మ్యాచులను ఫ్రీగా స్ట్రీమింగ్ చేయొచ్చు. జియో టీవీ, ఎయిర్‌టెల్ టీవీ యాప్‌లో సోనీ టెన్ ఛానెల్స్‌ను సెలెక్ట్ చేసి లైవ్‌లో చూడొచ్చు. కాగా, ఇటీవల జరిగిన ఐపీఎల్ మెగా ఆక్షన్‌లో రూ.1.10 కోట్లు పలికిన 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మీదే అందరి ఫోకస్ ఉంది. ఈ బిహార్ కుర్రాడు అండర్ 19 టీమ్‌కు సెలెక్ట్ అయ్యాడు. దీంతో అతడు హాట్ ఫేవరెట్‌గా మారాడు.


Also Read:

మరో సచిన్‌ అవుతాడనుకుంటే అన్‌సోల్డ్‌గా మిగిలాడు.. చేజేతులా ఓడిన కర్ణుడి కథ

పంత్, అయ్యర్ కాదు.. ఐపీఎల్‌లో అత్యధిక ప్యాకేజ్ ఇతడికే..

రాసి పెట్టుకోండి.. ఆర్సీబీకి అతడే కెప్టెన్: ఏబీ డివిలియర్స్

For More Sports And Telugu News

Updated Date - Nov 29 , 2024 | 06:53 PM