IND vs SA: సౌతాఫ్రికాతో సెకండ్ టీ20.. ఒక్క మార్పుతో బరిలోకి భారత్
ABN , Publish Date - Nov 09 , 2024 | 05:06 PM
తొలి టీ20లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా సెకండ్ ఛాలెంజ్‌కు సిద్ధమవుతోంది. మరోమారు ప్రొటీస్‌ను చిత్తు చేసేందుకు రెడీ అవుతోంది. ఈ రెండు జట్ల మధ్య జరిగే సండే ఫైట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది.
IND vs SA: తొలి టీ20లో సౌతాఫ్రికాను చిత్తు చేసిన టీమిండియా సెకండ్ ఛాలెంజ్‌కు సిద్ధమవుతోంది. మరోమారు ప్రొటీస్‌ను చిత్తు చేసేందుకు రెడీ అవుతోంది. ఈ రెండు జట్ల మధ్య జరిగే సండే ఫైట్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. మొదటి మ్యాచ్‌లో గెలిచిన జోష్‌లో ఉన్న సూర్యసేన అదే జోరును కంటిన్యూ చేయాలని చూస్తోంది. 2-0తో ఆధిక్యాన్ని పెంచుకోవాలని భావిస్తోంది. ఫస్ట్ టీ20లో కంగుతిన్న ప్రొటీస్.. ఈ మ్యాచ్‌లో నెగ్గి బోణీ కొట్టాలని చూస్తోంది. ఇరు జట్లు ఢీ అంటే ఢీ అంటుండటంతో మ్యాచ్ రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో రెండో టీ20లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..
మరో ఛాన్స్ ఇస్తారా?
తొలి టీ20లో గ్రాండ్ విక్టరీ కొట్టడంతో రెండో మ్యాచ్‌లోనూ దాదాపుగా అదే జట్టుతో వెళ్లాలని భారత టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. అయితే ఒక మార్పు మాత్రం జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సంజూ శాంసన్‌కు తోడుగా మరో ఓపెనర్‌గా అభిషేక్ శర్మకు బదులుగా రమణ్‌దీప్ సింగ్‌ను తీసుకునే ఛాన్సుల్ని కొట్టిపారేయలేం. వరుస వైఫల్యాలతో ఇబ్బంది పడుతున్న అభిషేక్.. ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌లో 7 పరుగులే చేసి పెవిలియన్‌కు చేరుకున్నాడు. దీంతో అతడి స్థానంలో రమణ్‌దీప్‌ను తీసుకునే అవకాశం ఉంది. అయితే మరో ఛాన్స్ ఇద్దామనుకుంటే మాత్రం అతడ్ని కంటిన్యూ చేయొచ్చు.
ప్రయోగాలకు నో
ఫస్ట్ డౌన్‌లో సారథి సూర్యకుమార్ యాదవ్, సెకండ్ డౌన్‌లో తిలక్ వర్మ ఆడతారు. మిడిలార్డర్‌లో ముందుగా హార్దిక్ పాండ్యా బ్యాటింగ్‌కు దిగుతాడు. ఆ తర్వాత రింకూ సింగ్, స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వస్తారు. ప్రధాన స్పిన్నర్లుగా తొలి మ్యాచ్‌లో ఆడిన వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ ఎలాగూ జట్టులో ఉంటారు. పేస్ బాధ్యతల్ని అర్ష్‌దీప్ సింగ్, ఆవేశ్ ఖాన్ పంచుకుంటారు. ఒక్క అభిషేక్ మార్పు తప్పితే మిగతా ప్లేయర్లను కదిపే అవకాశాలు కనిపించడం లేదు. ఒకవేళ సిరీస్ గెలిస్తే ఆఖరి టీ20లో ప్రయోగాలు, కొత్తవారికి అవకాశాలు ఇవ్వొచ్చు.
భారత జట్టు (అంచనా): అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్, రవి బిష్ణోయ్, వరుణ్ చక్రవర్తి, ఆవేశ్ ఖాన్.
Also Read:
సంజూ సక్సెస్ వెనుక సూపర్ పవర్.. చెప్పి మరీ కొట్టించాడు
ఆ ఒక్క మాటతో అంతా మారిపోయింది: శాంసన్
సెమీస్‌కు కిరణ్ జార్జ్
For More Sports And Telugu News