Share News

IND vs SA: సౌతాఫ్రికాతో మూడో టీ20.. 2 మార్పులతో బరిలోకి భారత్

ABN , Publish Date - Nov 12 , 2024 | 09:54 AM

IND vs SA: భారత్-సౌతాఫ్రికా టీ20 సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి మ్యాచ్‌లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టడంతో సిరీస్ వన్‌సైడ్ అవుతుందని అనుకున్నారు. కానీ రెండో మ్యాచ్‌లో ప్రొటీస్ కమ్‌బ్యాక్ ఇవ్వడంతో సిరీస్ మరింత రసవత్తరంగా మారింది.

IND vs SA: సౌతాఫ్రికాతో మూడో టీ20.. 2 మార్పులతో బరిలోకి భారత్

భారత్-సౌతాఫ్రికా టీ20 సిరీస్ ఆసక్తికరంగా సాగుతోంది. తొలి మ్యాచ్‌లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టడంతో సిరీస్ వన్‌సైడ్ అవుతుందని అనుకున్నారు. కానీ రెండో మ్యాచ్‌లో ప్రొటీస్ కమ్‌బ్యాక్ ఇవ్వడంతో సిరీస్ మరింత రసవత్తరంగా మారింది. బుధవారం జరిగే మూడో మ్యాచ్‌లో గెలిచిన జట్టు 2-1తో ఆధిక్యంలోకి వెళ్లే అవకాశం ఉంది. అందుకే నిర్ణయాత్మకంగా మారిన ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలని ఇరు జట్లు పట్టుదలతో ఉన్నాయి. తిరిగి గాడిన పడాలని భారత్, గెలుపు జోరును కొనసాగించాలని ప్రొటీస్ డిసైడ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మూడో టీ20లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఎలా ఉండనుందో ఇప్పుడు చూద్దాం..


కొత్తవారికి ఛాన్స్

మూడో టీ20లో భారత్ కచ్చితంగా రెండు మార్పులు చేసే అవకాశం కనిపిస్తోంది. ఇద్దరు ప్లేయర్లు ఔట్ అవడం, ఇద్దరు ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా అనిపిస్తోంది. యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ వరుసగా విఫలమవుతున్నాడు. ఎన్ని ఛాన్సులు ఇచ్చినా అతడు సద్వినియోగం చేసుకోవడం లేదు. సిరీస్ ఇప్పుడు తాడోపేడో అనే స్థితికి వచ్చినందున అభిషేక్‌ను పక్కనబెట్టొచ్చు. అతడి స్థానంలో బెంచ్ మీద ఉన్న రమణ్‌దీప్ సింగ్‌ను రీప్లేస్ చేయొచ్చు. మరో ఓపెనర్‌గా సంజూ శాంసన్ ఎలాగూ బరిలోకి దిగుతాడు. ఆ తర్వాత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్‌కు వస్తాడు. సెకండ్ డౌన్‌లో తిలక్ వర్మ ఆడతాడు.


డెబ్యూ ఖాయం!

మిడిలార్డర్‌లో రైట్ హ్యాండ్-లెఫ్ట్ హ్యాండ్ కాంబినేషన్‌ ఆధారంగా హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్‌లో ఎవరో ఒకరు ముందు బ్యాటింగ్‌కు దిగుతారు. స్పిన్ ఆల్‌రౌండర్‌గా అక్షర్ పటేల్ ఎలాగూ జట్టులో ఉంటాడు. అయితే రెండో టీ20లో చివర్లో ప్రధాన బ్యాటర్ లేని లోటు క్లియర్‌గా కనిపించింది. ఒకవేళ ఆ దిశగా ఆలోచిస్తే జితేష్ శర్మను తీసుకోవచ్చు. ఇక, స్పెషలిస్ట్ స్పిన్నర్లుగా వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్ తప్పకుండా ఆడతారు. అయితే పేస్ బౌలింగ్‌లో ఒక మార్పు ఖాయంగా కనిపిస్తోంది. ప్రధాన పేసర్‌గా ఆవేశ్ ఖాన్ ఉంటాడు. కానీ రెండో టీ20లో ధారాళంగా పరుగులు ఇచ్చుకున్న అర్ష్‌దీప్ బెంచ్ మీదకు వెళ్లొచ్చు. అతడి స్థానంలో యంగ్ స్పీడ్‌స్టర్ యష్ దయాల్ ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అటు రమణ్‌దీప్, ఇటు దయాల్‌‌ ఎంట్రీతో ఇద్దరు డెబ్యూ ప్లేయర్లు ఆడినట్లు అవుతుంది.

భారత జట్టు (అంచనా): రమణ్‌దీప్ సింగ్, సంజూ శాంసన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్/జితేష్ శర్మ, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, యష్ దయాల్, ఆవేశ్ ఖాన్.


Also Read:

హైబ్రిడ్‌ విధానంలో చాంపియన్స్‌ ట్రోఫీ!

బరిలో సింధు, సేన్‌

జిమ్నాస్ట్‌ నిషికకు పతకం

For More Sports And Telugu News

Updated Date - Nov 12 , 2024 | 10:04 AM