IND vs SA: సౌతాఫ్రికాతో టీమిండియా టీ20 సిరీస్.. ఫ్రీగా ఎలా చూడాలంటే..
ABN , Publish Date - Nov 06 , 2024 | 07:59 PM
IND vs SA: న్యూజిలాండ్ సిరీస్ ఓటమితో అటు భారత ఆటగాళ్లతో పాటు ఇటు అభిమానులు కూడా తీవ్ర నిరాశకు లోనయ్యారు. అయితే ఈ ఓటమి గాయం నుంచి బయటపడేందుకు సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ రూపంలో అవకాశం దొరికింది.
న్యూజిలాండ్ సిరీస్ ఓటమితో అటు భారత ఆటగాళ్లతో పాటు ఇటు అభిమానులు కూడా తీవ్ర నిరాశకు లోనయ్యారు. ఛాంపియన్ టీమ్ ఇలా సొంతగడ్డపై చిత్తుగా ఓడటం, వైట్‌వాష్ అవడాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి టాప్ ప్లేయర్లు ఉన్నా టీమ్‌ను కాపాడలేకపోవడం ఏంటని అంతా నివ్వెరపోతున్నారు. ఈ మధ్య కాలంలో జట్టు ఇంత దారుణంగా ఆడలేదని, అసలు టీమిండియాకు ఏమైందని విస్మయానికి లోనవుతున్నారు. అయితే ఈ ఓటమి గాయం నుంచి బయటపడేందుకు సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ రూపంలో భారత జట్టుకు మంచి అవకాశం దొరికింది. ఇందులో గెలిచి అభిమానులకు సాంత్వన కలిగించే ఛాన్స్ లభించింది. ఈ నేపథ్యంలో ఈ సిరీస్‌కు సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు చూద్దాం..
ప్రాక్టీస్‌లో బిజీ
భారత్-ప్రొటీస్ మధ్య టీ20 సిరీస్‌కు సర్వం సిద్ధమైంది. నాలుగు మ్యాచ్‌ల ఈ సిరీస్ కోసం ఇప్పటికే సఫారీ గడ్డ మీద కాలుమోపిన యంగ్ ఇండియా ప్రాక్టీస్‌లో మునిగిపోయింది. టీ20 రెగ్యులర్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్‌లో భారత జట్టును ముందుండి నడిపించనున్నాడు. అటు సౌతాఫ్రికా టీమ్‌ను ఎయిడెన్ మార్క్రమ్ లీడ్ చేయనున్నాడు. టీ20 వరల్డ్ కప్-2024 ఫైనల్ తర్వాత ఈ రెండు జట్లు తలపడటం ఇదే మొదటిసారి కావడంతో సిరీస్ మీద సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ సిరీస్‌లోని మ్యాచులను ఫ్రీగా చూసేయొచ్చు. జియో సినిమా యాప్‌లో ఈ మ్యాచులను ఉచితంగా చూడొచ్చు.
ప్రతీకారంతో రగులుతున్న ప్రొటీస్
స్పోర్ట్స్ 18 నెట్‌వర్క్‌లోనూ భారత్-సౌతాఫ్రికా సిరీస్ మ్యాచుల్ని చూడొచ్చు. ఇంక నవంబర్ 8 నుంచి మొదలయ్యే ఈ సిరీస్‌లోని మొదటి మ్యాచ్‌కు డర్బన్ ఆతిథ్యం ఇస్తోంది. 10వ తేదీన జరిగే రెండో మ్యాచ్‌కు గెబెరా హోస్ట్‌గా ఉంది. మూడో మ్యాచ్ నవంబర్ 13న, ఆఖరి టీ20 నవంబర్ 15న జరగనున్నాయి. కివీస్‌తో సిరీస్‌లో ఓడాం కాబట్టి ప్రొటీస్ మీద నెగ్గడం సూర్య సేనకు కీలకంగా మారింది. అటు ప్రపంచ కప్ ఫైనల్ ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని సౌతాఫ్రికా చూస్తోంది. దీంతో సిరీస్‌లోని మ్యాచ్‌లు మరింత ఉత్కంఠతో సాగడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read:
ధోనీతో ట్రంప్.. యూఎస్ ప్రెసిడెంట్ సందడి మామూలుగా లేదుగా
ఐపీఎల్‌లో జాక్‌పాట్.. ఒక్క రోజులో మారిపోయిన క్రికెటర్ జీవితం
అయ్యర్ మెరుపు సెంచరీ.. వాళ్ల మీద కసితో చెలరేగాడు
For More Sports And Telugu News