U19 Womens Asia Cup: చాంపియన్‌గా టీమిండియా.. అమ్మాయిలు కప్పు కొట్టేశారు..
ABN , Publish Date - Dec 22 , 2024 | 11:29 AM
ఫైనల్ వరకూ తగ్గేదేలే అంటూ దూసుకొచ్చిన భారత అమ్మాయిలు.. తుది పోరులోనూ అదరగొట్టారు. దీంతో అండర్-19లో మొదటిసారి నిర్వహించిన ఆసియా కప్‌ను టీమిండియా సొంతం చేసుకుంది.
ఫైనల్ వరకూ తగ్గేదేలే అంటూ దూసుకొచ్చిన భారత అమ్మాయిలు.. తుది పోరులోనూ అదరగొట్టారు. దీంతో అండర్-19లో మొదటిసారి నిర్వహించిన ఆసియా కప్‌ను టీమిండియా సొంతం చేసుకుంది. కౌలాలంపూర్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ను చిత్తు చేసి విజేతగా ఆవిర్భవించింది ఇండియా విమెన్స్ టీమ్. మహిళల విభాగంలో టీ20 ఫార్మాట్‌లో మొదటిసారి జరిగిన ఈ టోర్నమెంట్ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌ను మట్టికరిపించింది. ఫస్ట్ బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 117 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన బంగ్లాదేశ్ 76 పరుగులకే కుప్పకూలింది. 41 పరుగుల తేడాతో గెలిచిన భారత్.. సగర్వంగా కప్పును అందుకుంది. రీసెంట్‌గా జరిగిన అండర్-19 పురుషుల ఆసియా కప్‌లో ఫైనల్‌లో బంగ్లాదేశ్ చేతుల్లో ఓడింది భారత్. ఇప్పుడా ఓటమికి ప్రతీకారం తీర్చుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు వరుస షాక్‌లు తగిలాయి.
తడబడ్డారు
ఓపెనర్ కమిలిని (5)తో పాటు వన్ డౌన్ బ్యాటర్ సానికా చల్కే (0) వెంటవెంటనే ఔట్ అయ్యారు. అయితే ఇంకో ఓపెనర్ త్రిష (52) మాత్రం పట్టుదలతో ఆడింది. కెప్టెన్ నికీ ప్రసాద్ (12)తో కలసి టీమ్‌ను ఆదుకునేందుకు ప్రయత్నించింది. మూడో వికెట్‌కు 41 పరుగులు జోడించారు. ఆ తర్వాత నికీతో పాటు ఐశ్వరి (5) త్వరగా పెవిలియన్ చేరడంతో ఇన్నింగ్స్ మళ్లీ కుదుపునకు లోనైంది. కానీ మిథిలా (17), ఆయుషి శుక్లా (10) ఆఖర్లో బ్యాట్ ఊపి స్కోరు వంద దాటించారు. బంగ్లాదేశ్ బౌలర్లలో ఫర్జానా 4 వికెట్లతో దుమ్మురేపింది. నిషితా అక్తర్ నిషి 2 వికెట్లతో సత్తా చాటింది.
కొండంత లక్ష్యంలా..
బౌలింగ్‌కు స్వర్గధామంలా మారిన పిచ్ మీద బంగ్లాదేశ్ ఆరంభం నుంచి తడబాటును కంటిన్యూ చేసింది. వికెట్ బౌలింగ్‌కు పూర్తిగా అనుకూలించడంతో భారత్ సంధించిన చిన్నపాటి టార్గెట్ కూడా బంగ్లాకు కొండలా కనిపించింది. ఆ టీమ్‌లో జౌరియా ఫెర్డోస్ (22), ఫహోమిదా చోయా (18) మినహా అంతా ఫ్లాప్ అయ్యారు. వాళ్లిద్దరే రెండంకెల స్కోరు చేయగలిగారు. దీన్ని బట్టే బంగ్లా బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు. టీమిండియా బౌలర్లలో ఆయుషి శుక్లా 3 వికెట్లతో ప్రత్యర్థి నడ్డి విరిచింది. సిసోడియా, సోనమ్ యాదవ్ చెరో 2 వికెట్లతో భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
Also Read:
సీఎస్‌కే చిచ్చరపిడుగు విధ్వంసం.. 97 బంతుల్లోనే డబుల్ సెంచరీ
రిటైరైనా ఫిట్‌నెస్‌లో బాప్.. ఈ బ్యాటింగ్ రాక్షసుడ్ని గుర్తుపట్టారా..
ఊతప్పపై అరెస్ట్ వారెంట్
For More Sports And Telugu News