Share News

Ashwin-Jadeja: అశ్విన్ మోసం చేశాడు.. ఇలాంటోడు అనుకోలేదు: జడేజా

ABN , Publish Date - Dec 21 , 2024 | 10:22 AM

Ashwin-Jadeja: టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సుదీర్ఘ కెరీర్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఈ దిగ్గజ ఆటగాడికి అందరూ అభినందనలు తెలియజేస్తున్నారు. రిటైర్మెంట్‌ను ఎంజాయ్ చేయాలని సూచిస్తున్నారు.

Ashwin-Jadeja: అశ్విన్ మోసం చేశాడు.. ఇలాంటోడు అనుకోలేదు: జడేజా
Ravichandran Ashwin

IND vs AUS: ఒకర్ని మించినోళ్లు ఒకరు. బంతి చేతికొస్తే ప్రత్యర్థి అంతు చూసే దాకా వదిలేవాళ్లు కాదు. బొంగరంలా గింగిరాలు తిప్పుతూ బ్యాటర్లను వణికించేవారు. రామలక్ష్మణుల్లా కలసి యుద్ధం చేసేవారు. ఒకరికొకరు తోడుగా ఉంటూ జట్టుకు విజయాలు అందించేవారు. బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌లో భారీ భాగస్వామ్యాలతో టీమ్‌ను విజయతీరాలకు చేర్చేవారు. క్రికెట్‌లో అత్యుత్తమ స్పిన్ జోడీల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న వాళ్లే.. రవచంద్రన్ అశ్విన్-రవీంద్ర జడేజా. టెస్ట్ క్రికెట్‌లో ఏళ్లుగా భారత్ పెత్తనం చలాయించడంలో వీళ్లిద్దరిదీ కీలక పాత్ర. కానీ ఈ జోడీ విడిపోయింది. అశ్విన్ రిటైర్మెంట్‌తో జడ్డూ ఏకాకిగా మిగిలిపోయాడు.


ఒక్క మాట చెప్పలేదు

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలో అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించాడు. దీంతో ఇక మీదట అతడు లేకుండానే జడ్డూ టీమిండియా స్పిన్ భారాన్ని మోయాల్సి ఉంటుంది. ఇది అతడికి ఎంతో ఎమోషనల్ మూమెంట్. దీనిపై లెఫ్టార్మ్ స్పిన్నర్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. అశ్విన్ తనను మోసం చేశాడని అన్నాడు. రిటైర్మెంట్ అనౌన్స్ చేసిన రోజంతా తనతోనే ఉన్నాడని.. కానీ గేమ్‌కు గుడ్‌బై చెప్పనున్నట్లు ఒక్క మాట కూడా తనతో షేర్ చేయలేదన్నాడు. చివరి క్షణాల్లో తనకు రిటైర్మెంట్ గురించి తెలిసిందని.. ప్రెస్ కాన్ఫరెన్స్‌కు 5 నిమిషాల ముందు తనకు సమాచారం అందిందని చెబుతూ జడ్డూ భావోద్వేగానికి లోనయ్యాడు. అశ్విన్ ఇలా చేస్తాడని అనుకోలేదన్నాడు.


రీప్లేస్‌మెంట్‌ కనుగొంటాం

‘కెరీర్ ఆసాంతం అశ్విన్ నాకు ఓ మెంటార్‌లా అండగా ఉంటూ వచ్చాడు. ఆన్ ఫీల్డ్‌లో ఎప్పుడు ఏ సలహా కావాలనే అతడు పక్కనే ఉండేవాడు. బౌలింగ్ పార్ట్‌నర్‌గా బ్యాటర్లను ఎలా ఔట్ చేయాలనే దానిపై సిచ్యువేషన్‌కు తగ్గట్లు ప్లాన్స్ వేసేవాడు. ఇవన్నీ నేను తప్పకుండా మిస్ అవుతా. అయితే అతడికి సరైన రీప్లేస్‌మెంట్‌ను కనుగొంటామని ఆశిస్తున్నా’ అని జడ్డూ చెప్పుకొచ్చాడు. అశ్విన్ రిటైర్మెంట్ గురించి తెలియగానే తాను షాక్ అయ్యానని అన్నాడు. అయితే అతడి మైండ్ గురించి తనకు తెలుసునని.. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం అతడికి అలవాటు అని పేర్కొన్నాడు.


Also Read:

జహీర్‌..ఈ బాలిక బౌలింగ్‌ చూశావా?

టైటాన్స్‌ను గెలిపించిన పవన్‌

తనకు తానే శత్రువు

For More Sports And Telugu News

Updated Date - Dec 21 , 2024 | 10:45 AM