Jasprit Bumrah: చరిత్రకు అడుగు దూరంలో బుమ్రా.. పింక్ బాల్ టెస్ట్‌లో రికార్డులకు పాతరే
ABN , Publish Date - Dec 02 , 2024 | 03:45 PM
Jasprit Bumrah: టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా చరిత్రకు అడుగు దూరంలో నిలిచాడు. మరో అరుదైన మైలురాయిని చేరుకునేందుకు అతడు ఉవ్విళ్లూరుతున్నాడు.
IND vs AUS: టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా మంచి జోరు మీదున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై అడుగు పెట్టినప్పటి నుంచి అతడు అదరగొడుతున్నాడు. ప్రాక్టీస్ సెషన్స్‌లో సొంత జట్టు బ్యాటర్లను భయపెడుతున్న బుమ్రా.. బరిలోకి దిగి కంగారూలతోనూ ఆడుకుంటున్నాడు. పెర్త్ టెస్ట్‌లో ఆసీస్‌కు అతడు చుక్కలు చూపించాడు. చేజారిందనుకున్న మ్యాచ్‌ను తన బౌలింగ్ టాలెంట్‌తో భారత్ వైపు తిప్పాడు. 8 వికెట్లతో రిజల్ట్‌ను శాసించాడు. అందుకే యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ సెంచరీలు బాదినా.. బుమ్రాకే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అలాంటి పేసుగుర్రం ఇప్పుడు అడిలైడ్ ఛాలెంజ్‌కు రెడీ అవుతున్నాడు. అయితే అతడ్ని ఓ రికార్డు ఊరిస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..
తొలి బౌలర్‌గా..
ఈ ఏడాది ఇప్పటిదాకా ఆడిన టెస్టుల్లో కలిపి బుమ్రా 49 వికెట్లు పడగొట్టాడు. 50 వికెట్ల మార్క్‌కు చేరుకునేందుకు భారత స్పీడ్‌స్టర్ మరో వికెట్ దూరంలో ఉన్నాడు. ఒకవేళ ఆ మార్క్‌ను అందుకుంటే గనుక ఈ సంవత్సరం 50 వికెట్ల క్లబ్‌లో చేరిన తొలి బౌలర్‌గా నిలుస్తాడు. ఇక, తొలి టెస్ట్‌లో అదరగొట్టిన బుమ్రా.. రెండో టెస్ట్‌లోనూ ఆసీస్ బెండు తీయాలని చూస్తున్నాడు. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ తిరిగి జట్టుతో చేరాడు కాబట్టి అతడికి సారథ్య బాధ్యతల టెన్షన్ కూడా ఉండదు. దీంతో బుమ్రా మరింత చెలరేగి బౌలింగ్ చేసే అవకాశం ఉంది. కంగారూలకు దబిడిదిబిడి ఖాయంగా కనిపిస్తోంది.
వార్మప్‌కు దూరం
పెర్త్ టెస్ట్‌లో దుమ్మురేపిన బుమ్రా ప్రైమ్ మినిస్టర్స్ ఎలెవన్‌తో జరిగిన వార్మప్ మ్యాచ్‌కు దూరంగా ఉన్నాడు. అతడితో పాటు టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా బరిలోకి దిగలేదు. ఇద్దరూ తొలి మ్యాచ్‌లో అదరగొట్టడంతో వాళ్లకు రెస్ట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆడించలేదు. ఈ ప్రాక్టీస్ మ్యాచ్ జట్టుకు బాగా హెల్ప్ చేసింది. బౌలింగ్‌లో హర్షిత్ రాణా ఒకే ఓవర్‌లో 4 వికెట్లు పడగొట్టి తన సత్తా ఏంటో మరోమారు చూపించాడు. బ్యాటింగ్‌లో శుబ్‌మన్ గిల్ హాఫ్ సెంచరీతో మెరిశాడు. నితీష్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ కూడా మంచి నాక్స్‌తో ఆకట్టుకున్నారు.
Also Read:
వెస్టిండీస్ బౌలర్ సంచలన రికార్డు.. 46 ఏళ్లలో ఇదే తొలిసారి
పాకిస్థాన్ గాలి తీసిన అక్తర్.. మీరు మారరు అంటూ..
వెంకటేశ్ అయ్యర్‌కు షాక్.. కేకేఆర్‌కు కొత్త కెప్టెన్ వచ్చేస్తున్నాడు
ఆ సర్టిఫికెట్ ఉంటేనే షమీకి ఎంట్రీ.. బీసీసీఐ కొత్త మెలిక
For More Sports And Telugu News