Jasprit Bumrah: 500 కోట్లు మిస్.. చేజేతులా చేసుకున్న బుమ్రా
ABN , Publish Date - Dec 02 , 2024 | 04:42 PM
Jasprit Bumrah: టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రాను చూసి ప్రత్యర్థులు వణుకుతున్నారు. బుల్లెట్ స్పీడ్‌తో అతడు వేసే డెలివరీస్‌ను ఎదుర్కొవాలంటే జడుసుకుంటున్నారు. బుమ్రా బరిలోకి దిగాడంటేనే భయపడుతున్నారు.
IND vs AUS: టీమిండియా పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రాను చూసి ప్రత్యర్థులు వణుకుతున్నారు. అతడు బరిలోకి దిగుతున్నాడంటనేనే భయపడుతున్నారు. అంతగా మోడర్న్ క్రికెట్‌ను డామినేట్ చేస్తున్నాడీ భారత పేస్ గన్. బౌలింగ్ టాలెంట్‌తో ఇటు ఫ్యాన్‌బేస్, క్రేజ్, పాపులారిటీని భారీగా పెంచుకున్న ఈ స్పీడ్‌స్టర్.. అటు ఆర్జనలోనూ దూసుకెళ్తున్నాడు. టీమిండియాతో పాటు ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌కు ఆడటం ద్వారా భారీగా డబ్బులు వెనకేసుకుంటున్నాడు. యాడ్స్‌లో నటిస్తూ ఆదాయాన్ని రెట్టింపు చేసుకుంటున్నాడు. అయితే ఇంత టాలెంట్ ఉన్నోడు రూ.500 కోట్ల భారీ మొత్తాన్ని మిస్ చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ జాక్‌పాట్‌ను బుమ్రా ఎలా చేజార్చుకున్నాడో ఇప్పుడు చూద్దాం..
ఎలా మిస్ చేసుకున్నాడంటే..
బుమ్రా రూ.500 కోట్లు మిస్ అయ్యాడని అంటున్నాడు టీమిండియా వెటరన్ పేసర్ ఆశిష్ నెహ్రా. అనవసరంగా చేజార్చుకున్నాడని చెబుతున్నాడు. అంత డబ్బును బుమ్రా ఎలా మిస్ చేసుకున్నాడనేగా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం.. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2025 మెగా ఆక్షన్‌లో టీమిండియా స్టార్లు భారీ మొత్తాలను దక్కించుకున్నారు. రిషబ్ పంత్ (రూ.27 కోట్లు), శ్రేయస్ అయ్యర్ (రూ.26.75 కోట్లు) భారీ ధరకు అమ్ముడుబోయి వేలంలో కొత్త రికార్డులు క్రియేట్ చేశారు. ఈ నేపథ్యంలో బుమ్రా కూడా ఆక్షన్ బరిలోకి దిగితే సీన్ వేరేలా ఉండేదని నెహ్రా అన్నాడు. ఈజీగా రూ.500 కోట్లు దక్కించుకునే వాడు అని తన స్టైల్‌లో చమత్కరించాడు. అతడికి ఉన్న డిమాండ్ అలాంటిదన్నాడు.
ఏ టీమ్ వల్లా కాదు
‘ఈ మధ్య కాలంలో బుమ్రా బౌలింగ్ చేస్తున్న తీరు అద్భుతంగా ఉంది. కెరీర్‌లో ఇప్పుడు పీక్స్‌లో ఉన్నాడు. పెర్త్ టెస్ట్‌లో బౌలర్‌గా రాణించడమే గాక కెప్టెన్‌గానూ మెప్పించాడు. రోహిత్ శర్మ స్థానంలో సారథిగా ఒత్తిడిని తీసుకొని జట్టును గెలిపించాడు. న్యూజిలాండ్ చేతుల్లో వైట్‌వాష్ అయిన టీమ్‌ను అతడు ముందుండి నడిపించిన విధానం, విజయాన్ని అందించిన తీరు సూపర్బ్. ప్రస్తుత క్రికెట్‌లో బౌలింగ్‌లో బుమ్రాను మించినోడు లేడు. అతడు గనుక ఐపీఎల్ వేలం బరిలో ఉండి ఉంటే భారీ ధర పలికేవాడు. టీమ్స్ పర్స్‌లో రూ.520 కోట్లు ఉన్నా అతడ్ని దక్కించుకోవడం కష్టమే’ అని నెహ్రా చెప్పుకొచ్చాడు.
ఎన్ని కోట్లు ఉన్నా తక్కువే
సాధారణంగా ఐపీఎల్‌లో టీమ్స్ దగ్గర రూ.121 కోట్లు మాత్రమే ఉంటాయి. అందులో నుంచే ఆటగాళ్లను రీటెయిన్ చేసుకోవడం, కొత్త వారిని వేలంలో తీసుకోవడం చేస్తారు. అయితే నెహ్రా మాత్రం బుమ్రాను సొంతం చేసుకోవాలంటే ఎన్ని వందల కోట్లు ఉన్నా తక్కువేనంటూ అతడికి ఉన్న డిమాండ్‌ను వివరిస్తూ పైవ్యాఖ్యలు చేశాడు. కాగా, మెగా ఆక్షన్‌కు ముందు నిర్వహించిన రిటెన్షన్ ప్రక్రియలో బుమ్రాను రూ.18 కోట్లు చెల్లించి అట్టిపెట్టుకుంది ముంబై ఇండియన్స్.
Also Read:
చరిత్రకు అడుగు దూరంలో బుమ్రా.. పింక్ బాల్ టెస్ట్‌లో రికార్డులకు పాతరే
వెస్టిండీస్ బౌలర్ సంచలన రికార్డు.. 46 ఏళ్లలో ఇదే తొలిసారి
పాకిస్థాన్ గాలి తీసిన అక్తర్.. మీరు మారరు అంటూ..
For More Sports And Telugu News