IND vs AUS: ఆస్ట్రేలియాకు ఊహించని ఎదురుదెబ్బ.. మ్యాచ్ మధ్యలోనే..
ABN , Publish Date - Dec 17 , 2024 | 12:01 PM
IND vs AUS: ఆస్ట్రేలియా జట్టుకు కోలుకోలేని ఎదురుదెబ్బ తగిలింది. గబ్బా టెస్ట్ మధ్యలోనే కంగారూలకు ఊహించని షాక్ తగిలింది.
గబ్బా టెస్ట్‌లో ఆస్ట్రేలియా పట్టు బిగిస్తోంది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోరును చేసిందా జట్టు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నారు కంగారూ బౌలర్లు. వరుస విరామాల్లో వికెట్లు తీస్తూ రోహిత్ సేనను చావుదెబ్బ తీశారు. ఇదే జోరులో మరో విక్టరీ నమోదు చేయాలని ఆసీస్ ఆటగాళ్లు భావిస్తున్నారు. అయితే ఆ టీమ్‌కు కోలుకోలేని షాక్ తగిలింది. మ్యాచ్‌పై పట్టుబిగిస్తున్న సమయంలో ఓ కీలక ఆటగాడు జట్టులో నుంచి బయటకు వెళ్లిపోయాడు. అతడు ఎవరు అనేది ఇప్పుడు చూద్దాం..
పిక్కలు పట్టేయడంతో..
ఆస్ట్రేలియా సీనియర్ పేసర్ జోష్ హేజల్‌వుడ్ మళ్లీ గాయపడ్డాడు. పెర్త్ టెస్ట్‌లో గాయపడిన ఈ స్పీడ్‌స్టర్.. ఇంజ్యురీ కారణంగా రెండో టెస్ట్‌కు దూరమయ్యాడు. అయితే తక్కువ సమయంలోనే కోలుకోవడంతో ఫుల్ ఫిట్‌నెస్ లేకపోయినా అతడ్ని బ్రిస్బేన్ టెస్ట్ ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకున్నారు. అయితే ఈ మ్యాచ్ నాలుగో రోజు అతడి కాలు పిక్కలు పట్టేశాయి. దీంతో ఒక్క ఓవర్ మాత్రమే వేసి అతడు ఫీల్డ్‌ను వదిలివెళ్లాడు. ఆ తర్వాత హేజల్‌వుడ్‌ను స్కానింగ్ కోసం తీసుకెళ్లినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. అతడు పూర్తి మ్యాచ్‌కు దూరమవుతాడని తెలుస్తోంది. కంప్లీట్ సిరీస్‌కు కూడా దూరమవడం ఖాయమని సమాచారం. కాగా, ఈ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్‌లో భారత్ ప్రస్తుతం 7 వికెట్ల నష్టానికి 201 పరుగులతో ఉంది. ఆసీస్ స్కోరుకు రోహిత్ సేన మరో 244 పరుగుల దూరంలో ఉంది.
Also Read:
ఆసీస్‌ను రెచ్చగొట్టిన జడేజా.. బ్యాట్‌ను కత్తిలా తిప్పుతూ..
షకీబ్ బౌలింగ్‌పై సస్పెన్షన్
అటు వర్షం.. ఇటు వికెట్లు
జట్టు సంధి దశలో ఉంది
For More Sports And Telugu News