Share News

KL Rahul: పరువు తీసుకున్న రాహుల్.. వెళ్లి రంజీలు ఆడుకో పో..

ABN , Publish Date - Nov 08 , 2024 | 03:58 PM

ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాకు కీలకంగా భావిస్తున్న స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ మరోమారు నిరాశపర్చాడు. దారుణమైన ఆటతీరుతో పరువు తీసుకున్నాడు. అతడు ఔట్ అయిన తీరు చూస్తే షాక్ అవ్వక మానరు.

KL Rahul: పరువు తీసుకున్న రాహుల్.. వెళ్లి రంజీలు ఆడుకో పో..

IND A vs AUS A: న్యూజిలాండ్ చేతుల్లో వైట్‌వాష్ అవడంతో ఇంటా బయట తీవ్ర విమర్శల పాలవుతోంది భారత్. సొంతగడ్డపై బెబ్బులి లాంటి టీమిండియా ఇంత దారుణంగా ఓడటంపై అంతా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. దీంతో త్వరలో ఆస్ట్రేలియాతో జరిగే బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే బ్యాటింగ్ వైఫల్యంతో ఇబ్బందులు పడుతున్న జట్టు.. ఆ సిరీస్‌లో ఎలా నెట్టుకొస్తుందనేది ఆసక్తికరంగా మారింది. స్టైలిస్ బ్యాటర్ కేఎల్ రాహుల్ టీమ్‌కు కీలకం కానున్నాడని భావిస్తున్నారు. అతడి బ్యాటింగ్ శైలి ఆ పిచ్‌లకు నప్పుతుందని చెబుతున్నారు. కానీ రాహుల్ ఆటతీరు మాత్రం దీనికి పూర్తి భిన్నంగా సాగుతోంది. మరోమారు నిరాశపర్చిన ఈ స్టార్ బ్యాటర్.. పరువు కూడా పోగొట్టుకున్నాడు.


మళ్లీ అదే వరస

బీజీటీ-2024 కోసం కాస్త ముందే ఆస్ట్రేలియాకు చేరుకున్న రాహుల్.. ఆ దేశ ఏ టీమ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పాల్గొంటున్నాడు. అయితే వరుసగా రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అతడు దారుణంగా ఆడాడు. తొలి ఇన్నింగ్స్‌లో 4 పరుగులకే పెవిలియన్ చేరిన ఈ స్టైలిష్ బ్యాటర్.. రెండో ఇన్నింగ్స్‌లో 10 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే అతడు ఔట్ అయిన తీరు ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విచిత్రమైన రీతిలో పెవిలియన్ బాట పట్టాడు రాహుల్. స్పిన్నర్ రాకెచోలీ వేసిన బంతిని ఆడబోయిన రాహుల్.. అది టర్న్ అయి లెగ్ సైడ్ వెళ్లిపోతుందని భావించాడు. దీంతో బాల్‌ను టచ్ కూడా చేయలేదు.


ఇంత చెత్తగా ఔట్ అయ్యాడేంటి?

గుడ్ లెంగ్త్‌లో పడిన బంతిని తప్పుగా అంచనా వేశాడు రాహుల్. బాల్ తనకు దూరంగా వెళ్లిపోతుందని భావించి దాన్ని టచ్ చేయలేదు. కానీ పిచ్ అయ్యాక కొద్దిగా టర్న్ అయిన బంతి లెగ్ వికెట్ వైపు దూసుకొచ్చింది. అది పూర్తిగా లెగ్ సైడ్ వెళ్తోందని భావించిన రాహుల్.. దాన్ని ఎడమ కాలితో ఆపుదామని అనుకున్నాడు. కానీ పడిన బంతి టర్న్ అయి లెగ్ వికెట్‌ను ముద్దాడటం, స్టంప్స్ గాల్లోకి లేవడం క్షణకాలంలో జరిగిపోయాయి. దీంతో అసలు ఏమైందో అతడికి అర్థం కాలేదు. చివరి వరకు బాల్ మీదే తన చూపును ఉంచినా స్పిన్‌ను సరిగ్గా అంచనా వేయలేకపోవడం, లెంగ్త్‌‌కు తగ్గట్లు అడ్జస్ట్ అవకపోవడం, బాల్‌ను టచ్ చేసేందుకు ప్రయత్నించకపోవడం రాహుల్ చేసిన తప్పు.


రంజీలే గతి

సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఈ వీడియోను చూసిన నెటిజన్స్.. రాహుల్ ఇంక టీమిండియాలో చోటు గురించి మర్చిపో అని అంటున్నారు. వెళ్లి.. రంజీలు, ఐపీఎల్ ఆడుకో పో అని ఘాటు కామెంట్స్ చేస్తున్నారు. కాగా, ఈ మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో భారత్ ఏ ప్రస్తుతం 5 వికెట్ల నష్టానికి 73 పరుగులతో ఉంది. ధృ‌వ్ జురెల్ (19 నాటౌట్), నితీష్ కుమార్ రెడ్డి (9 నాటౌట్) ఇప్పుడు క్రీజులో ఉన్నారు. మన జట్టు ఆధిక్యం 11 పరుగులు. జురెల్-నితీష్ ఎంత సేపు క్రీజులో ఉంటారనే దాని మీదే భారీ స్కోరు ఆశలు ఆధారపడి ఉన్నాయి. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఫైటింగ్ నాక్ ఆడిన జురెల్ మళ్లీ అదే రీతిలో పెర్ఫార్మ్ చేస్తాడేమో చూడాలి.


Also Read:

ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. ఇలాంటి ఆట పాక్‌కే సాధ్యం

కుర్రాళ్లు కుమ్మేస్తారా?

వీస్ చేతిలో చిత్తుగా ఓడిన టీమిండియాకు కీలక సలహా ఇచ్చిన కపిల్ దేవ్

For More Sports And Telugu News

Updated Date - Nov 08 , 2024 | 04:11 PM