KKR Vs PBKS: కోల్‌కతా విధ్వంసం.. పంజాబ్ ముందు కొండంత లక్ష్యం
ABN , Publish Date - Apr 26 , 2024 | 09:35 PM
సిక్సర్లు.. ఫోర్లతో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం మోతెక్కిపోయింది. పంజాబ్ కింగ్స్‌పై కోల్‌కోతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ పెనువిధ్వంసం సృష్టించారు. ఓపెనర్లు సునీల్ నరైన్, ఫిలిప్ సాల్ట్ మొదలుకొని 7వ నంబర్ బ్యాట్స్‌మెన్ అందరూ సమష్టిగా రాణించడంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 261 పరుగుల రికార్డు స్థాయి స్కోరు బాదింది.
కోల్‌కతా: సిక్సర్లు.. ఫోర్లతో కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం మోతెక్కిపోయింది. పంజాబ్ కింగ్స్‌పై కోల్‌కోతా నైట్ రైడర్స్ బ్యాట్స్‌మెన్ పెనువిధ్వంసం సృష్టించారు. ఓపెనర్లు సునీల్ నరైన్, ఫిలిప్ సాల్ట్ మొదలుకొని 7వ నంబర్ బ్యాట్స్‌మెన్ అందరూ సమష్టిగా రాణించడంతో కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 261 పరుగుల రికార్డు స్థాయి స్కోరు బాదింది. ఓపెనర్లు సునీల్ నరైన్ 32 బంతుల్లో 71 పరుగులు, ఫిలిప్ సాల్ట్ 37 బంతుల్లో 75 పరుగులు బాది స్కోరు బోర్డుని పరుగులు పెట్టించారు. సాల్ట్ 6 సిక్సర్లు, 6 ఫోర్లు బాదగా.. నరైన్ 9 ఫోర్లు, 4 సిక్సర్లు కొట్టాడు. మిగతా బ్యాటర్ల విషయానికి వస్తే వెంకటేశ్ అయ్యర్ 23 బంతుల్లో 39 పరుగులు, ఆండ్ర్యూ రస్సెల్ 12 బంతుల్లో 24 పరుగులు, శ్రేయస్ అయ్యర్ 10 బంతుల్లో 28 పరుగులు, రింకూ సింగ్ 5, రమణ్ దీప్ సింగ్ 6 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు.
ఇక పంజాబ్ కింగ్స్ బౌలర్లు కోల్‌కతా బ్యాటర్లను నియంత్రించడంలో దారుణంగా విఫలమయ్యారు. స్పిన్నర్ రాహుల్ చాహర్ మినహా మిగతా అందరూ భారీగా పరుగులు సమర్పించుకున్నారు. అర్షదీప్ సింగ్ 2 వికెట్లు, సామ్ కర్రాన్, హర్షల్ పటేల్, రాహుల్ చాహర్ ఒక్కోటి చొప్పున వికెట్లు తీశారు. కాగా 262 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో పంజాబ్ కింగ్స్ ఏ మేరకు రాణిస్తుందో చూడాలి.