Share News

Team India: భారత్‌కు బిగ్ షాక్.. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం

ABN , Publish Date - Jan 08 , 2024 | 06:50 PM

Team India: చీలమండ గాయం నుంచి షమీ పూర్తిగా కోలుకోలేదని.. దీంతో ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్ట్‌లకు అతను దూరంగా ఉండనున్నట్లు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ వర్గాలు పేర్కొన్నాయి. షమీ ఇంకా బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించలేదని, అతను ఫిట్‌నెస్ టెస్ట్‌లో నెగ్గాల్సి ఉందని ఎన్‌సీఏ అధికారులు వెల్లడించారు.

Team India: భారత్‌కు బిగ్ షాక్.. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు స్టార్ పేసర్ దూరం

వన్డే ప్రపంచకప్ హీరో మహ్మద్ షమీ గాయం నుంచి ఇంకా కోలుకోలేదు. ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్ట్ సిరీస్‌కు అతడిని ఎంపిక చేసినా చివరకు ఒక్క మ్యాచ్‌లో కూడా ఆడలేకపోయాడు. త్వరలో స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగే ఐదు టెస్టుల సిరీస్‌కు కూడా షమీ దూరం కానున్నట్లు తెలుస్తోంది. చీలమండ గాయం నుంచి షమీ పూర్తిగా కోలుకోలేదని.. దీంతో ఇంగ్లండ్‌తో జరిగే తొలి రెండు టెస్ట్‌లకు అతను దూరంగా ఉండనున్నట్లు బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ వర్గాలు పేర్కొన్నాయి. షమీ ఇంకా బౌలింగ్ ప్రాక్టీస్ ప్రారంభించలేదని, అతను ఫిట్‌నెస్ టెస్ట్‌లో నెగ్గాల్సి ఉందని ఎన్‌సీఏ అధికారులు వెల్లడించారు.

కాగా గాయంతోనే వన్డే ప్రపంచకప్ బరిలోకి దిగిన షమీ.. ప్రతిరోజూ పెయిన్ కిల్లర్ ఇంజెక్షన్ సాయంతో మ్యాచ్ ఆడినట్లు కొన్ని నివేదికలు బహిర్గతం చేశాయి. దీంతో షమీ పంటి బిగువన నొప్పిని భరిస్తూనే అసాధారణ ప్రదర్శన కనబర్చాడు. దక్షిణాఫ్రికా పర్యటనకు షమీ దూరం కావడంతో తొలి టెస్టులో టీమిండియా ఇబ్బంది పడింది. మూడో పేసర్‌గా షమీ స్థానంలో జట్టులోకి వచ్చిన ప్రసిధ్ కృష్ణ దారుణంగా విఫలమయ్యాడు. ఇప్పుడు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సిరీస్‌కు కూడా షమీ దూరం కావడం టీమిండియాకు పెద్ద దెబ్బే అని చెప్పాలి. బుమ్రా, సిరాజ్ మినహాయిస్తే భారత బౌలింగ్ దళం బలహీనంగా కనిపిస్తోంది. హార్దిక్ పాండ్యా, దీపక్ చాహర్, ఉమేష్ యాదవ్ లాంటి బౌలర్లు అందుబాటులో లేకపోవడం కూడా మైనస్ పాయింట్ అవుతోంది. యువ బౌలర్లు అంచనాల మేరకు రాణించలేకపోతున్నారు.


మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Jan 08 , 2024 | 06:50 PM