Mohammed Siraj: రివేంజ్ తీర్చుకున్న సిరాజ్.. మియా పగబడితే ఇలాగే ఉంటది
ABN , Publish Date - Dec 18 , 2024 | 10:39 AM
Mohammed Siraj: భారత ఏస్ పేసర్ మహ్మద్ సిరాజ్ రివేంజ్ కంప్లీట్ చేశాడు. తనను గెలికిన కంగారూలకు బాగా బుద్ధి చెప్పాడు. మియా పగబడితే ఎలా ఉంటుందో వాళ్లకు రుచి చూపించాడు.
IND vs AUS: టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్ ఎప్పుడూ అగ్రెసివ్‌గా ఉంటాడు. గ్రౌండ్ బయట కూల్‌గా ఉన్నా.. బరిలోకి దిగితే మాత్రం తనలోని అగ్రెషన్‌ను బయటకు తీస్తాడు. నిప్పులు చెరిగే బంతుతో ప్రత్యర్థుల వెన్నులో వణుకు పుట్టిస్తాడు. ఒక్కోసారి అవతలి బ్యాటర్ల మీద బంతులతో పాటు మాటల తూటాలతోనూ దాడి చేస్తాడు. అలాంటిది తనను ఎవరైనా గెలికితే ఊరుకుంటాడా? వాళ్ల అంతు చూసే దాకా అస్సలు వదలడు. ఇప్పుడు అదే జరిగింది. తనను రెచ్చగొట్టిన ఇద్దరు బ్యాటర్లపై అతడు రివేంజ్ తీర్చుకున్నాడు.
మళ్లీ సిరాజ్ జోలికొస్తారా?
సిరాజ్ రివేంజ్ కంప్లీట్ చేశాడు. తనను గెలికిన ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్‌కు అతడు బాగా బుద్ధి చెప్పాడు. మియా పగబడితే ఎలా ఉంటుందో వాళ్లకు రుచి చూపించాడు. గబ్బా టెస్ట్ ఆసీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఈ ఇద్దరు స్టార్ బ్యాటర్లను భయపెట్టి ఔట్ చేశాడు సిరాజ్. మొదట షార్ట్ బాల్‌తో హెడ్‌ను దొరకబుచ్చుకున్నాడు మియా. ఆ తర్వాత మరో చక్కటి బంతితో స్మిత్ ఆటకట్టించాడు. పింక్ బాల్ టెస్ట్‌లో తనను తిట్టిన హెడ్‌తో పాటు ఎప్పుడూ సవాల్ విసిరే స్మిత్ కథ ముగించాడు. ఇది చూసిన నెటిజన్స్.. ఇదీ సిరాజ్ అంటే, పగబడితే అస్సలు వదలడని కామెంట్స్ చేస్తున్నారు.
కంగారూలకు పోయించారు
రెండో ఇన్నింగ్స్‌లో ఆసీస్ బ్యాటింగ్‌లో పూర్తిగా తడబడింది. భారత బౌలర్ల దెబ్బకు ఆ జట్టు గడగడలాడింది. 89 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి దిక్కుతోచని స్థితిలో పడింది. సిరాజ్ (2/36)తో పాటు జస్‌ప్రీత్ బుమ్రా (3/18), ఆకాశ్‌దీప్ (2/28) కూడా బుల్లెట్ పేస్‌తో కంగారూలకు పోయించారు. వంద లోపే ఆలౌట్ అయితే పరువు పోతుందని భావించిన ఆసీస్.. ఇన్నింగ్స్‌ను 89 పరుగుల వద్దే డిక్లేర్ చేసింది. ఆ తర్వాత 275 పరుగుల లక్ష్య ఛేదనకు బరిలోకి దిగిన రోహిత్ సేన ప్రస్తుతం వికెట్లేమీ కోల్పోకుండా 8 పరుగులతో ఉంది.
Also Read:
కెరీర్ క్లోజ్.. రిటైర్మెంట్‌పై హింట్ ఇచ్చేసిన రోహిత్..
చెప్పాడు.. చేశాడు.. మాట నిలబెట్టుకున్న బుమ్రా
దేవుడా.. ఇంకెన్ని చేయాలి!
For More Sports And Telugu News