Share News

Maharashtra Elections: అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన ఎన్సీపీ

ABN , Publish Date - Oct 23 , 2024 | 02:19 PM

38 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఎన్సీపీ విడుదల చేసింది. బారామతి నుండి అజిత్ పవార్, యోలా నుండి ఛగన్ భుజబల్‌ను ఎన్నికల బరిలో నిలిపింది.

Maharashtra Elections: అభ్యర్థుల తొలి జాబితా ప్రకటించిన ఎన్సీపీ
NCP Party

ముంబై: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ బుధవారం కీలక ప్రకటన చేసింది. ఎన్నికల వ్యూహంలో భాగంగా 38 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాను ఎన్సీపీ విడుదల చేసింది. బారామతి నుండి అజిత్ పవార్, యోలా నుండి ఛగన్ భుజబల్‌ను బరిలోకి దింపింది. అంబేగావ్‌ నుంచి దిలీప్‌ వల్సే-పాటిల్‌, కాగల్‌ నుంచి హసన్‌ ముష్రీఫ్‌, పార్లీ నుంచి ధనంజయ్‌ ముండే, దిండోరి నుంచి నరహరి ఝిర్వాల్‌లను కూడా పార్టీ బరిలోకి దించింది.


అభ్యర్థులను ప్రకటించిన శివసేన

మరోవైపు శివసేన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు 45 మంది అభ్యర్థులతో మొదటి జాబితాను ఇప్పటికే విడుదల చేసింది. థానే నగరంలోని కోప్రి-పంచ్‌పఖాడి నుండి ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండేను, వారి సంబంధిత స్థానాల నుండి అర డజనుకు పైగా క్యాబినెట్ సభ్యులను నామినేట్ చేసింది. మంగళవారం అర్థరాత్రి విడుదల చేసిన జాబితా ప్రకారం, జూన్ 2022లో అప్పటి ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేపై తిరుగుబాటుకు నాయకత్వం వహించిన షిండేకు మద్దతు ఇచ్చిన దాదాపు అందరు ఎమ్మెల్యేలను అధికార పార్టీ తిరిగి నామినేట్ చేసింది.


స్టార్ క్యాంపెయినర్లు..

మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, ఎన్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రఫుల్ పటేల్, పార్టీ రాష్ట్ర అధినేత సునీల్ ఠాక్రే , 27 మంది క్యాబినెట్ సభ్యులు స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో ఉన్నారు. అధికార మహాయుతి కూటమికి చెందిన నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) 288 సభ్యులతో కూడిన అసెంబ్లీకి జరిగే ఎన్నికలకు మాత్రం ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. ఈ వారంలో తమ అభ్యర్థులను ప్రకటించే ముందు, ప్రాంతీయ పార్టీ అసెంబ్లీ ఎన్నికల కోసం 27 మంది స్టార్ క్యాంపెయినర్ల జాబితాను విడుదల చేసింది.

Priyanka Gandhi: తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ.. వయనాడ్‌లో ప్రియాంక నామినేషన్..

Updated Date - Oct 23 , 2024 | 02:19 PM