Nitish Kumar Reddy: సిరాజ్ డాట్ బాల్.. దద్దరిల్లిన స్టేడియం.. మియా మ్యాజిక్ అంటే ఇది..
ABN , Publish Date - Dec 28 , 2024 | 07:55 PM
Boxing Day Test: మెల్‌బోర్న్ టెస్ట్‌లో సూపర్బ్ సెంచరీతో మెరిశాడు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి. కమిన్స్, స్టార్క్, బోలాండ్, లియాన్ లాంటి తోపు బౌలర్ల బౌలింగ్‌ను తట్టుకొని ఫైట్ చేశాడు. బ్రిలియంట్ నాక్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. అయితే అతడు సెంచరీ మార్క్‌ను అందుకోవడంలో మహ్మద్ సిరాజ్ పాత్ర కూడా ఎంతో ఉంది.
మెల్‌బోర్న్ టెస్ట్‌లో సూపర్బ్ సెంచరీతో మెరిశాడు తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి. కమిన్స్, స్టార్క్, బోలాండ్, లియాన్ లాంటి తోపు బౌలర్ల బౌలింగ్‌ను తట్టుకొని ఫైట్ చేశాడు. బ్రిలియంట్ నాక్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశాడు. అయితే అతడు సెంచరీ మార్క్‌ను అందుకోవడంలో మహ్మద్ సిరాజ్ పాత్ర కూడా ఎంతో ఉంది. సిరాజ్ అందించిన సహకారం వల్లే అతడు మ్యాజికల్ ఫిగర్‌కు చేరుకున్నాడు. అందుకే సిరాజ్ కోసం మెల్‌బోర్న్ గ్రౌండ్ అంతా ఒక్కటైంది. సాధారణంగా ఏ బ్యాటర్ అయినా ఫోర్ లేదా సిక్స్ కొడితే ప్రేక్షకులు గట్టిగా అరుస్తారు, కేకలు, విజిల్స్ వేస్తూ ఎంకరేజ్ చేస్తారు. కానీ సిరాజ్ డిఫెన్స్ చేస్తే స్టేడియం షేక్ అయింది. అసలు ఏం జరిగింది? డాట్ బాల్‌కు మైదానం ఎందుకు దద్దరిల్లింది? నితీష్ సెంచరీలో సిరాజ్ కాంట్రిబ్యూషన్ ఎంత? అనేది ఇప్పుడు చూద్దాం..
ఆశలు గల్లంతు అనుకుంటే..
బాక్సింగ్ డే టెస్ట్‌లో నితీష్ సెంచరీ కొట్టడం వెనుక చాలా మంది పాత్ర ఉంది. అతడ్ని ఎంకరేజ్ చేస్తూ వస్తున్న హెడ్ కోచ్ గౌతం గంభీర్ దగ్గర నుంచి కెప్టెన్ రోహిత్ శర్మ వరకు.. అలాగే బ్యాటింగ్ సమయంలో మరో ఎండ్‌లో మంచి సహకారం అందించిన వాషింగ్టన్ సుందర్ దాకా చాలా మంది సపోర్ట్ ఉంది. కానీ సిరాజ్ మద్దతు కారణంగానే శతకం మార్క్‌ను అందుకున్నాడు నితీష్. అతడు 90ల్లో ఉన్నప్పుడు సుందర్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన జస్‌ప్రీత్ బుమ్రా 3 బంతులు ఎదుర్కొని డకౌట్‌గా పెవిలియన్ బాట పట్టాడు. అప్పుడు నితీష్ స్కోరు 99. 9 వికెట్లు పడటం, అప్పుడే క్రీజులోకి వచ్చిన డీఎస్పీ సిరాజ్ బ్యాటింగ్‌లో తడబడే టెయిలెండర్ కావడంతో నితీష్ సెంచరీ చేయడం కష్టమేనని అంతా భావించారు.
ధైర్యంగా నిలబడ్డాడు
సిరాజ్ ఔట్ అయితే నితీష్ సెంచరీ ఆశలు గల్లంతే. అతడు బ్యాట్‌తో ఈ మధ్య అంతగా మెరుపులు మెరిపించడం లేదు. కాబట్టి మియా పుట్టి ముంచుతాడని అంతా డిసైడ్ అయ్యారు. అప్పటికే కమిన్స్-బోలాండ్ నిప్పులు చెరిగే బంతులతో చెలరేగుతుండటంతో తెలుడోగి సెంచరీ డ్రీమ్ కల్లేనని ఫిక్స్ అయ్యారు. కానీ సిరాజ్ పట్టుదలతో ఆడాడు. సాలిడ్ డిఫెన్స్‌తో వికెట్లకు అడ్డంగా నిలబడ్డాడు. ధైర్యంగా ఆడుతూ బంతులు డెడ్ చేశాడు. ఆ తర్వాతి ఓవర్‌లో నితీష్ మంచి షాట్ కొట్టి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. సిరాజ్ డిఫెన్స్ టైమ్‌లో స్టేడియం మొత్తం దద్దరిల్లింది. మియాకు సపోర్ట్ చేస్తూ భారత ఫ్యాన్స్ తెగ సందడి చేశారు. విజిల్స్ వేస్తూ, చప్పట్లు కొడుతూ స్టేడియాన్ని షేక్ చేశారు. కమాన్ సిరాజ్.. ఇలాగే ఆడు అంటూ సపోర్ట్ చేశారు. నితీష్ సెంచరీ తర్వాత కూడా సిరాజ్‌ను మెచ్చుకుంటూ రచ్చ రచ్చ చేశారు.