Share News

Nitish Kumar Reddy: నితీష్ రెడ్డికి గోల్డెన్ ఛాన్స్.. నక్క తోక తొక్కాడుగా..

ABN , Publish Date - Nov 17 , 2024 | 06:48 PM

Nitish Kumar Reddy: తెలుగు తేజం నితీష్ రెడ్డి టైమ్ స్టార్ట్ అయినట్లే అనిపిస్తోంది. అతడికి గోల్డెన్ ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది. నితీష్ నక్క తోక తొక్కాడని అంతా మాట్లాడుకుంటున్నారు.

Nitish Kumar Reddy: నితీష్ రెడ్డికి గోల్డెన్ ఛాన్స్.. నక్క తోక తొక్కాడుగా..

ఇండియన్ ప్రీమియర్ లీగ్ ద్వారా వెలుగులోకి వచ్చిన ప్లేయర్లలో తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి ఒకడు. ఈ ఏడాది సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున బరిలోకి దిగిన నితీష్.. ఆల్‌రౌండ్ పెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు బౌలింగ్‌లో సత్తా చాటాడు. ఫీల్డింగ్‌లోనూ తన మార్క్ చూపించాడు. బాల్ మెరిట్‌ను బట్టి బిగ్ షాట్స్ కొడుతూ కేక పుట్టించాడు. వరల్డ్ క్లాస్ బౌలర్లను కూడా అలవోకగా ఎదుర్కొన్నాడు. అతడి పెర్ఫార్మెన్స్‌కు ప్రోత్సాహకంగా ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు కూడా దక్కింది. ఆ తర్వాత భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చే ఛాన్స్ వచ్చింది. కానీ గాయం కారణంగా అరంగేట్రం చేయలేకపోయాడతను. అయితే ఎట్టకేలకు బంగ్లాదేశ్ సిరీస్‌తో అతడు డెబ్యూ ఇచ్చేశాడు. ఇప్పుడీ తెలుగోడికి మరో గోల్డెన్ ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది.


అరంగేట్రానికి అంతా సిద్ధం

ఆల్‌రౌండర్ నితీష్‌ లక్కీ ఛాన్స్ కొట్టేశాడని సమాచారం. ఆస్ట్రేలియాతో త్వరలో జరగనున్న బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆడే అవకాశాన్ని ఈ తెలుగు తేజం దక్కించుకున్నాడని వినిపిస్తోంది. పెర్త్‌లో జరిగే సిరీస్ ఓపెనర్‌లో నితీష్‌ను బరిలోకి దింపేందుకు రంగం సిద్ధమవుతోందట. అతడికి టెస్ట్ క్యాప్ ఇవ్వాలని టీమ్ మేనేజ్‌మెంట్ డిసైడ్ అయిందట. బ్యాటింగ్‌తో పాటు అతడి బౌలింగ్ సేవల్ని కూడా వాడుకోవాలని హెడ్ కోచ్ గౌతం గంభీర్ భావిస్తున్నాడట. నాలుగో సీమర్‌గా, మిడిలార్డర్ బ్యాటర్‌గా అతడ్ని ఆడించాలని అనుకుంటున్నాడట. ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గంభీర్ చేసిన వ్యాఖ్యలు నితీష్ టెస్ట్ డెబ్యూకు మరింత ఊతం ఇస్తున్నాయి.


నితీష్ ఏంటో మాకు తెలుసు

‘ఈ టూర్ కోసం శార్దూల్ ఠాకూర్‌ను కాదని నితీష్ రెడ్డిని జట్టులోకి తీసుకున్నాం. దీనికి బలమైన కారణం ఉంది. భవిష్యత్తు గురించి ఆలోచనతోనే ఈ నిర్ణయం తీసుకున్నాం. నితీష్ లాంటి వాళ్లు టీమ్‌కు చాలా అవసరం. అతడిలో ఎంతో ప్రతిభ దాగి ఉంది. కంగారూ సిరీస్ కోసం బెస్ట్ స్క్వాడ్‌ను సెలెక్ట్ చేశామని భావిస్తున్నా. నితీష్ వంటి ఆటగాళ్లకు అవకాశాలు ఇస్తే ఎలా ఉంటుందో అందరికీ తెలుసు. అతడు కచ్చితంగా మేం కోరుకున్నది అందిస్తాడనే నమ్మకం ఉంది. టీమ్ గెలుపు కోసం నితీష్ తన శాయశక్తులా ప్రయత్నిస్తాడు’ అని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో గౌతీ చెప్పుకొచ్చాడు. దీంతో తుదిజట్టులో ఈ తెలుగోడ్ని పక్కా తీసుకుంటారని అంతా అంటున్నారు. ఇక, ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 21 మ్యాచులు ఆడిన నితీష్.. 779 పరుగులు చేశాడు. అలాగే 56 వికెట్లు పడగొట్టాడు. బ్యాటింగ్‌లో అటాకింగ్ అప్రోచ్‌తో పాటు డిఫెన్స్ కూడా చేయగలగడం, మీడియం పేస్‌తో బ్యాటర్లకు ఇబ్బందులు సృష్టించే సత్తా ఉండటం వల్లే ఈ సిరీస్‌లో ఇతర ఆటగాళ్లను కాదని.. నితీష్‌ను ఆల్‌రౌండర్ రోల్‌కు తీసుకున్నారు సెలెక్టర్లు.


Also Read:

దయచేసి కోహ్లీని గెలకొద్దు.. కంగారూ టీమ్‌కు లెజెండ్ సూచన

తిలక్ సక్సెస్ వెనుక తెలుగోడు.. వరుస సెంచరీల సీక్రెట్ ఇదే

పాక్ తోక కత్తిరించిన బీసీసీఐ.. ఏ మొహం పెట్టుకొని ఆడతారో..

For More Sports And Telugu News

Updated Date - Nov 17 , 2024 | 06:51 PM